సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సూక్ష్మ & చిన్న తరహా పరిశ్రమల రుణ హామీ పథకం 01.04.2023 నుంచి పునరుద్ధరణ
రూ.1 కోటి వరకు రుణాలకు వార్షిక హామీ రుసుమును సంవత్సరానికి 2% గరిష్ట రేటు నుంచి 0.37% వరకు తగ్గించడానికి సీజీటీఎంఎస్‌ఈ మార్గదర్శకాలు జారీ
హామీల పరిమితి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంపు
Posted On:
31 MAR 2023 1:58PM by PIB Hyderabad
సూక్ష్మ & చిన్న తరహా పరిశ్రమల రుణ హామీ పథకాన్ని 01.04.2023 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. కార్పస్‌కు రూ. 9,000 కోట్లను చేర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల అదనపు పూచీకత్తు రహిత హామీ రుణాలను ఇవ్వడం, రుణ వ్యయాన్ని సుమారు 1 శాతం తగ్గించడంపైనా ప్రకటన చేశారు.
ఆ ప్రకటనకు అనుగుణంగా ఈ క్రింది చర్యలు తీసుకోవడం జరిగింది:
- సూక్ష్మ & చిన్న తరహా పరిశ్రమల (సీజీటీఎంఎస్‌ఈ) కోసం రుణ హామీ నిధి కార్పస్‌కు 30.03.2023న రూ.8,000 కోట్లను జత చేశారు.
- రూ.1 కోటి వరకు రుణాలకు వార్షిక హామీ రుసుమును సంవత్సరానికి 2% గరిష్ట రేటు నుంచి 0.37% వరకు తగ్గించడానికి సీజీటీఎంఎస్‌ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది, సూక్ష్మ & చిన్న తరహా పరిశ్రమల రుణ వ్యయాలను చాలా వరకు తగ్గిస్తుంది.
- హామీల పరిమితిని రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచడం జరిగింది.
- రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్న హామీ రుణాలకు సంబంధించి, క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ఇకపై న్యాయస్థానాల ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు.
ఎఫ్‌వై2022-23 సమయంలో రూ.1 లక్ష కోట్ల విలువైన హామీలను ఆమోదించడం ద్వారా కొత్త మైలురాయిని సీజీటీఎంఎస్‌ఈ చేరుకుంది.
****
(Release ID: 1912763)
Visitor Counter : 246