గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

దేశంలో 40,000కు పైగా అమృత సరోవరాలు జాతికి అంకితం -- భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సాధించిన ఘనత

Posted On: 31 MAR 2023 11:28AM by PIB Hyderabad

      దేశానికి స్వాతంత్య్రం సిద్ధినుంచి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నిర్వహిస్తున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా  గత సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన ప్రధానమంత్రి మిషన్ అమృత్ సరోవర్ అనే ఆదర్శ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం  75 అమృత సరోవరాల చొప్పున  నిర్మించడం / పురుజ్జీవింపజేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.  తద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం దాని ముఖ్య ఉద్దేశం.   ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి 50,000 అమృత సరోవరాలు నిర్మించాలన్న లక్ష్యం పూర్తిచేయనున్నారు.   ఈ కార్యక్రమం ప్రారంభించిన అతి కొద్దీ కాలంలో అంటే 11 నెలల్లో ఇప్పటివరకు 40,000 అమృత సరోవరాలను నిర్మించడం పూర్తయ్యింది.  ఇది మొత్తం లక్ష్యంలో 80%.  
       
      ఈ కార్యక్రమం మూలం 'జన భాగీదారి'  అంటే ప్రజల భాగస్వామ్యం.   కార్యక్రమం అమలులో ప్రతి స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది.   ఇప్పటి వరకు ప్రతి అమృత సరోవరానికి ఒకటి చొప్పున  54088 వినియోగదారుల బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.    ఈ వినియోగదారుల బృందాలు అమృత సరోవరాల అభివృద్ధికి సంబంధించిన పూర్తి ప్రక్రియలో సంపూర్ణంగా కలసి ఉంటాయి.   సాధ్యాసాధ్యాలను అంచనావేయడం,  పనుల నిర్వహణ మరియు దాని వినియోగం వంటి అన్ని వ్యవహారాలను ఈ బృందాలు చూస్తాయి.  
      స్వాతంత్య్ర సమరయోధులు , పంచాయత్ లోని పెద్దలు, సమరయోధులు మరియు మృతవీరుల కుటుంబ సభ్యులు, పద్మ అవార్డు గ్రహీతలు మొదలగు వారిని  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుపోతున్నాయి.   అమృత సరోవరం నిర్మాణానికి నిర్దేశించిన స్థలంలో శంకుస్థాపన  వేయడం, జనవరి 26, ఆగస్టు 15 వంటి ముఖ్యమైన తేదీలలో పతాకావిష్కరణ జరపడం వంటివి వారిచేత చేయిస్తున్నారు.   ఇప్పటివరకు  ఈ  మిషన్ లో  1784 మంది స్వాతంత్య్ర సమరయోధులు,  18,173 మంది పంచాయత్ పెద్దలు, 448 మంది  సమరయోధుల కుటుంబ సభ్యులు, 684 మంది మృతవీరుల కుటుంబ సభ్యులు, 56 మంది పద్మ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
     
      మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే అమృత్ సరోవర్  మిషన్  గ్రామీణుల జీవనాన్ని అభివృద్ధిపరుస్తున్నది.  పూర్తయిన సరోవరాలను  నీటిపారుదల, చేపల పెంపకం,  బాతుల పెంపకం,  పోషకాలు ఇచ్చే కాయల సాగు మరియు పశుగణాభివృద్ధి మొదలైన పనులకు ఉపయోగిస్తున్నారు.   ఇప్పటివరకు 66% వినియోగదారుల బృందాలు వ్యవసాయం, 21% చేపల పెంపకం, 6% పోషకాలు ఇచ్చే కాయల సాగు మరియు కమలాల సాగు మరియు 7% బృందాలు పశుగణాభివృద్ధిలో పనుల్లో ఉన్నారు.  ప్రతి అమృత సరోవర్ తో జతపడి ఉన్న వివిధ వినియోగదారుల బృందాలు ఈ పనులు చేపడుతున్నారు.     'సంపూర్ణ ప్రభుత్వ'  ఆచరణ పధ్ధతి ఈ మిషన్ ఆత్మ వంటిది.  ఈ  కార్యక్రమం అమలులో ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు అంటే రైల్వే మంత్రిత్వ శాఖ,  రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ,  జల శక్తి మంత్రిత్వ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ,   పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలతో కలసి  గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది.   ఈ మంత్రిత్వ శాఖలు నిర్వహించే అమృత సరోవర్ పనులకు సాంకేతిక సంస్థలు కూడా తోడవుతాయి.  మంత్రిత్వశాఖలతో కలిసే జాతీయ భాస్కరాచార్య రోదసి అనువర్తన మరియు భూ సంబంధ సమాచార శాస్త్ర  సంస్థ (BISAG-N) వంటి సాంకేతిక సంస్థలు మరియు అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రభుత్వాలు ఈ మిషన్ నిర్వహణలో చేదోడువాదోడుగా ఉంటాయి.  

        వివిధ మంత్రిత్వ శాఖలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పడానికి సంబంధించిన ప్రధాన అంశం ఏమిటంటే అమృత సరోవర్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలలో తవ్వకాలు జరిపి తీసిన మట్టిని రైల్వే మంత్రిత్వ శాఖ  మరియు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ  తమ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నాయి.   దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఏర్పాటుచేస్తున్న ఎన్నో అమృత సరోవరాల నిర్మాణం / పునరుద్ధరణలో  ప్రజా సంస్థలు మరియు సామాజిక బాధ్యత నెరవేరుస్తున్న కార్పొరేట్ సంస్థలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి.  

        మిషన్ అమృత్ సరోవర్ లక్ష్యం అమృత సరోవరాల నిర్మాణ పనుల గుణాత్మక  అమలు మరియు అభివృద్ధి.   స్థానిక సమాజానికి సంబంధించిన పనులకు అమృత సరోవర్ కేంద్రబిందువుగా ఉండటం మరియు అమృత సరోవర్ పనుల కోసం  వివిధ మంత్రిత్వ శాఖలు ఏకముఖత్వంతో ఒక్కటై పనిచేయడం.  


 

****(Release ID: 1912762) Visitor Counter : 110