రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇండియన్ నేవీ కోసం రూ. 1,700 కోట్ల విలువైన 13 లింక్స్-యు2 ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ కోసం బీ ఈ ఎల్ తో ఎం ఓ డీ ఒప్పందం కుదుర్చుకుంది
Posted On:
30 MAR 2023 1:55PM by PIB Hyderabad
రక్షణ మంత్రిత్వ శాఖ, మార్చి 30, 2023న, భారత నావికాదళం కోసం 13 లింక్స్-యు2 ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరుతో ఒప్పందంపై సంతకం చేసింది. లింక్స్-U2 సిస్టమ్ అనేది నావల్ గన్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ దేశీయంగా రూపొందించబడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఇది సముద్ర అయోమయ అలాగే గాలి/ఉపరితల లక్ష్యాలను ఖచ్చితంగా ట్రాక్ చేయగలదు మరియు చేదించగలదు. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ మరియు గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో దేశీయంగా నిర్మించబడే న్యూ జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్స్‌లో 4వ తరం కి చెందిన పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం తో అభివృద్ధి చేయబడిన మరియు తయారు చేయబడిన వ్యవస్థలు అమర్చబడతాయి. ఈ చర్య నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండు లక్షల పనిదినాల ఉపాధిని సృష్టిస్తుంది మరియు ఎం ఎస్ ఎమ్ ఈ లతో సహా వివిధ భారతీయ పరిశ్రమల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది, తద్వారా రక్షణలో ‘ఆత్మనిర్భర్త’ సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు గణనీయంగా దోహదపడుతుంది.
***
(Release ID: 1912244)
Visitor Counter : 191