ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఝాన్సీలోని అంతర్జాతీయ స్థాయి రైల్వే స్టేషన్‌తో నగరంసహా సమీప ప్రాంతాల్లో పర్యాటక-వాణిజ్యాభివృద్ధికి మరింత ఉత్తేజం: ప్రధానమంత్రి

Posted On: 26 MAR 2023 10:54AM by PIB Hyderabad

   ఝాన్సీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా రూపుదిద్దుకున్న రైల్వే స్టేషన్ వల్ల నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో పర్యాటక-వాణిజ్యాభివృద్ధికి మరింత ఉత్తేజం లభిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశమంతటా ఆధునిక స్టేషన్ల రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఝాన్సీని ఆధునికీకరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.

   బుందేల్‌ ఖండ్‌ ప్రజల ప్రయోజనార్థం ఝాన్సీ స్టేషన్‌కు అంతర్జాతీయ స్థాయి కల్పించే పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలపడంపై ఆయనతోపాటు రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్‌కు కూడా ఝాన్సీ ఎంపీ శ్రీ అనురాగ్‌ శర్మ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఉత్రప్రదేశ్‌లోని ఝాన్సీ నగరానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ట్వీట్‌పై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశంలో:

“దేశవ్యాప్తంగా ఆధునిక రైల్వే స్టేషన్లను రూపుదిద్దే మా కృషిలో ఇదొక అంతర్భాగం. ఈ నేపథ్యంలో ఝాన్సీ స్టేషన్‌ అభివృద్ధి ఈ నగరంసహా పరిసర ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్య రంగాలకు మరింత ఊపు లభిస్తుంది” అని పేర్కొన్నారు.

*****

DS/ST


(Release ID: 1910962) Visitor Counter : 172