ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 వ సంవత్సరం మార్చి 26 వ తేదీ న జరిగిన ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 99 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 MAR 2023 11:45AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశ ప్రజలారా, మరోసారి ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం( ‘మనసు లో మాట’ ) కార్యక్రమాని కి మీ అందరికి హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు న ఈ చర్చ ను మొదలుపెడుతుంటే మనసు లో చాలా ఆలోచన లు మెదులుతున్నాయి. మా, మీ ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం అనుబంధం తొంభై తొమ్మిదో మైలురాయి కి చేరుకొంది. సాధారణం గా తొంభైతొమ్మిదో మలుపు చాలా కష్టం అని వింటుంటాం. క్రికెట్‌ లో ‘నర్వస్ నైంటీస్’ ను చాలా క్లిష్టమైన దశ గా భావిస్తారు. అయితే, భారతదేశం లోని ప్రజల ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం గురించి చెప్పుకోవలసి వస్తే తత్సంబంధి ప్రేరణే కాస్త వేరేది గా ఉంటుంది. ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం వందో భాగాన్ని గురించి దేశ ప్రజల లో చాలా ఆసక్తి నెలకొన్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. నాకు చాలా సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మనం స్వేచ్ఛా స్వర్ణయుగాన్ని జరుపుకొంటున్నటువంటి ఈ యొక్క సందర్భం లో, కొత్త సంకల్పాల తో ముందుకు సాగుతున్న దశ లో వందో ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం( ‘మనసు లో మాట’ ) కార్యక్రమాన్ని గురించి మీ సలహాల ను మరియు మీ ఆలోచనల ను తెలుసుకోవాలి అని నేను కూడా చాలా ఆసక్తి తో ఉన్నాను. మీ సూచన ల కోసం నేను ఆసక్తి తో ఎదురుచూస్తున్నాను. నిజానికి నిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈసారి మరింత ఎక్కువ గా ఎదురుచూస్తున్నాను. మీ సూచన లు, ఆలోచన లు ఏప్రిల్ 30 వ తేదీ న నిర్వహించుకొనే వందో ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమంను మరింత గుర్తుండేలా చేస్తాయి.

ప్రియమైన నా దేశప్రజలారా,ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాల ను అంకితం చేస్తున్న వేల మంది ని గురించి మనం ‘మనసు లో మాట’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మాట్లాడుకొన్నాం. పింఛన్ మొత్తాన్ని కుమార్తె ల చదువు ల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు వారి జీవితాంతం సంపాదన ను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు. మన దేశం లో దాతృత్వం చాలా ఎక్కువ గా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి వంటి అవయవ దాతల కథల ను, దేహ దాత ల కథల ను వినిపించడం జరుగుతున్నది.

 

 

సహచరులారా, ఈ ఆధునిక వైద్య విజ్ఞాన యుగం లో అవయవ దానం ఒకరి కి ప్రాణం పోయడానికి చాలా ముఖ్యమైన సాధనం గా మారింది. ఒక వ్యక్తి మరణానంతరం తన శరీరాన్ని దానం చేస్తే, దాని ద్వారా 8 మందికో లేక 9 మందికో కొత్త జీవనాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అని చెబుతారు. దేశం లో కూడా అవయవ దానం పైన అవగాహన పెరుగుతుండడం సంతోషించదగ్గ విషయం. మన దేశం లో అవయవ దానం కేసు లు 2013 వ సంవత్సరం లో 5 వేల లోపే ఉండేవి. ఈ సంఖ్య 2022 వ సంవత్సరం నాటికి 15 వేల కు పైబడింది. అవయవ దానం చేసిన వ్యక్తులు గాని లేదా వారి కుటుంబాలు గాని చేసింది చాలా పుణ్యం వచ్చేటటువంటి పని అని చెప్పాలి.

 

 

సహచరులారా, ఇటువంటి ఉదాత్తమైన పని ని చేసే వ్యక్తుల మనసు లోని మాట ను తెలుసుకోవాలి, దానిని దేశప్రజల కు వెల్లడించాలి అని నాకు చాలా కాలంగా కోరిక. ఈ రోజు న ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఒక ముద్దులొలికే పాప, సుందరమైన చిట్టితల్లి యొక్క అమ్మానాన్న లు మనతో భేటీ అవుతున్నారు. తండ్రి గారి పేరు శ్రీ సుఖ్‌బీర్ సింహ్ సంధు , తల్లి గారి పేరు సుప్రీత్ కౌర్ గారు. ఈ కుటుంబం పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ లో నివాసం ఉంటున్నారు. అనేక మొక్కుల తరువాత వారికి ఒక చాలా అందమైనటువంటి ముద్దుగుమ్మ.. పాపాయి పుట్టింది. ఇంట్లోని వారు చాలా ప్రేమ తో ఆ పాప కు అబాబత్ కౌర్ అనే పేరు ను పెట్టుకొన్నారు. అబాబత్ అనే మాట కు ఇతరుల కు సేవ చేయడానికి సంబంధించింది, ఇతరుల బాధల ను దూరం చేయడానికి సంబంధించింది అని భావం. ఆ పసిగుడ్డు కు ముప్పై తొమ్మిది రోజుల వయస్సు ఉన్నప్పుడు, అప్పుడే ఆమె ఈ లోకాన్ని విడచిపెట్టి వెళ్లిపోయింది. కానీ సుఖ్‌ బీర్ సింహ్ సంధు గారు, ఆయన భార్య సుప్రీత్ కౌర్ గారు, వారి కుటుంబం చాలా ప్రేరణవంతం అయినటువంటి నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఆ నిర్ణయం ఏమిటి అంటే, ముప్పై తొమ్మిది రోజుల వయస్సు ఉన్న పుత్రిక యొక్క అవయవాల ను దానం చేద్దాం అనేదే. ఇప్పుడు మనతో ఫోన్ లో సుఖ్‌ బీర్ సింహ్ గారు, ఆయన యొక్క శ్రీమతి గారు భేటీ అవుతున్నారు. రండి, వారితో మాట్లాడుదాం.

ప్రధాన మంత్రి గారు: సుఖ్‌ బీర్ గారు నమస్తే.

సుఖ్‌బీర్ గారు : నమస్కారం గౌరవనీయ ప్రధాన మంత్రి గారు. సత్ శ్రీ అకాల్.

ప్రధాన మంత్రి గారు : సత్ శ్రీ అకాల్ అండి, సత్ శ్రీ అకాల్ అండి. సుఖ్‌ బీర్ గారు నేను ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఇలా అనిపించింది. ఏమని అంటే అబాబత్ ను గురించిన విషయం ఎంతటి ప్రేరణ ను కలిగించేది గా ఉంది అంటే దానిని గురించి మీ నోటనే వినాలి అని. ఎందుకు అంటే ఇంట్లో బిడ్డ పుట్టింది అంటే అప్పుడు అనేక కలల ను, అనేక సంతోషాల ను వెంటబెట్టుకు వస్తుంది. అయితే బిడ్డ ఇంత త్వరగా వెళ్లిపోతే కలిగే ఆ బాధ ఎంత భయంకరం గా ఉంటుందో దానిని గురించి కూడాను నేను ఊహించగలను. మీరు ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకొన్నారంటే, మరి నేను అన్ని విషయాల ను తెలుసుకోవాలనుకుంటున్నానండి.

సుఖ్‌బీర్ గారు : సర్ దేవుడు మాకు చాలా మంచి బిడ్డ ను ఇచ్చాడు. చాలా అందమైన బొమ్మ మా ఇంటి కి వచ్చింది. పుట్టిన వెంటనే తెలిసింది- బిడ్డ మెదడు లో నరాల గుచ్ఛం ఉందని, దాని కారణంగా బిడ్డ గుండె పరిమాణం పెద్దది గా అవుతోందనీనూ. బిడ్డ ఆరోగ్యం ఎంత బాగుందంటే, తను ఎంత అందం గా ఉందంటే, మరి ఇంతటి పెద్ద సమస్య తో పుట్టడం ఏమిటో అని మేం ఒకటే ఆందోళన కు లోను అయ్యాం. మొదటి 24 రోజు ల వరకు బిడ్డ పూర్తి సాధారణంగా ఉంది. ఉన్నట్టుండి బిడ్డ గుండె పనిచేయడం మానివేసింది. మేం వెంటనే ఆసుపత్రి కి తీసుకుపోయాం. అక్కడ వైద్యులు బిడ్డ కు ప్రాణం పోశారు. కానీ ఇంత చిన్న వయస్సు లో బిడ్డ కు వచ్చిన ఇంత పెద్ద సమస్య- గుండెపోటు- ను అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. చికిత్స కోసం బిడ్డ ను చండీగఢ్‌ లోని పీజీఐ కి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స చేసేప్పుడు చిన్నారి ధైర్యం గా పోరాడింది. కానీ వ్యాధి ఎలాంటిదంటే చిన్న వయస్సు లో చికిత్స సాధ్యం కాదు. బిడ్డ ను బతికించడానికి డాక్టర్ లు చాలా ప్రయత్నించారు. ఒకవేళ ఆ బిడ్డ దాదాపు ఆరు నెలల వయస్సు దాకా చేరుకొంటే గనక ఆమె కు ఆపరేశన్ చేయాలి అనేటటువంటి ఆలోచన చేసి ఉండవచ్చును. కానీ దైవం తలచింది వేరే విధం గా ఉంది. బిడ్డ కు 39 వ రోజు వచ్చేసరికే గుండెపోటు మరోమారు వచ్చింది అని డాక్టర్ చెప్పారు. అప్పుడు నమ్మకం తగ్గిపోయింది. బిడ్డ పదేపదే ధైర్యం గా పోరాడడం చూశాం. బిడ్డ ఇక్కడ కు రావడం లో ఏదో ప్రయోజనం ఉంది అని భార్యాభర్తలం ఏడుస్తూనే ఆ నిర్ణయాని కి వచ్చాం. సరిగ్గా సమాధానమిచ్చాం. ఈ బిడ్డ అవయవాల ను ఎందుకు దానం చేయకూడదు అని మేం అనుకున్నాం. దానివల్ల వేరొకరి జీవనం లో వెలుగు వస్తుంది కదా అని అనుకున్నాం. పీజీఐ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వారి ని సంప్రదించాం. అంత చిన్న బిడ్డ యొక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసుకోవచ్చు అని వారు మార్గనిర్దేశం చేశారు. పరమాత్మ మాకు ధైర్యాన్ని ఇవ్వడం తో గురు నానక్ సాహబ్ తత్త్వం మా వెంట ఉంది. ఈ భావన తో మేం నిర్ణయాన్ని తీసేసుకున్నాం.

ప్రధాన మంత్రి గారు: గురువు లు చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటి ని మీరు చేతల లో చూపెట్టారండి. సుప్రీత్ గారు ఉన్నారా ? ఆవిడ తో మాటలాడవచ్చా ?

సుఖ్‌ బీర్ గారు : సరే సర్.

సుప్రీత్ గారు: హెలో

ప్రధాన మంత్రి గారు : సుప్రీత్ గారూ.. మీకు నేను నమస్కరిస్తున్నాను.

సుప్రీత్ గారు: నమస్కారం సర్. నమస్కారం సర్. మీరు మాతో మాట్లాడడం మాకు చాలా గర్వకారణం సర్.

ప్రధాన మంత్రి గారు : మీరు ఎంతో గొప్ప పని ని చేశారు. దేశం ఈ విషయాలన్నిటిని విందంటే మరి ఇతరుల ప్రాణాలను రక్షించడానికి చాలా మంది ముందుకు వస్తారు. అబాబత్ చేసిన ఈ యొక్క త్యాగం ఉంది చూశారు, ఇది చాలా గొప్పదండి.

సుప్రీత్ గారు: సర్. ఇది కూడాను బహుశా గురునానక్ మహరాజ్ గారి నుండి లభించినటువంటి దీవెన కావచ్చు.. అటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆయనయే నిబ్బరాన్ని ఇచ్చారు మరి.

ప్రధాన మంత్రి గారు : గురువుల కృప లేనిదే ఏదీ జరగనే జరగదు సుమండి.

సుప్రీత్ గారు: తప్పకుంగా సర్, ఖచ్చితం గా.

ప్రధాన మంత్రి గారు : సుఖ్‌ బీర్ గారూ.. మీరు ఆసుపత్రి లో ఉండి ఉంటారు మరి అప్పుడు ఈ దిగ్భ్రాంతికరమైన కబురు ను గురించి డాక్టర్ మీకు చెప్పినప్పుడు మీరు, మీ భార్య ఆరోగ్యకరమైన మనస్సు తో ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం గురువు ల బోధన ల ఫలితం. మీ మనసు లో గొప్ప ఉదారమైన ఆలోచన. నిజానికి సాధారణ భాష లో అబాబత్ కి అర్థం సహకారం. ఈ పని పూర్తి అయిన క్షణం గురించి నేను వినాలని అనుకొంటున్నాను.

సుఖ్‌ బీర్ గారు : సర్.. నిజాని కి ప్రియా గారు అని మా కుటుంబానికి స్నేహితురాలు ఉన్నారు. ఆమె తన అవయవాల ను దానం చేశారు. మేం ఆమె నుండి కూడా ప్రేరణ ను పొందాం. పార్థివ దేహం పంచ భూతాల లో కలసిపోతుంది అని ఆ సమయం లో మేం భావించాం. ఎవరైనా ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు వారి శరీరాన్ని కాల్చివేయడమో లేదా పాతిపెట్టడమో చేస్తారు. కానీ ఆ అవయవాలు ఎవరికైనా ఉపయోగపడితే అది మంచి పని. భారతదేశం లో విజయవంతం గా మార్పిడి చేసిన అవయవాల ను దానం చేసిన అతి పిన్న వయస్కురాలు మీ కూతురే అని డాక్టర్ లు మాకు చెప్పినప్పుడు మరింత గర్వపడ్డాం. ఇంత వయసు వచ్చినప్పటికీ ఇప్పటివరకు మా తల్లితండ్రుల కు మంచి పేరు ను తెచ్చిపెట్టలేకపోయాం. కానీ మా బిడ్డ కొన్ని రోజుల వ్యవధి లో మాకు పేరు ను తెచ్చిపెట్టింది. ఈ రోజు న మీతో మాట్లాడడం అంత కంటే గొప్ప విషయం. మేం గర్వపడుతున్నాం.

ప్రధాన మంత్రి గారు : సుఖ్‌ బీర్ గారూ.. ఈ రోజు న మీ కుమార్తె శరీరం లోని ఒక భాగం మాత్రమే జీవించి ఉన్నట్టు కాదు.. మీ కుమార్తె మానవత్వ అమర గాథ లో అమర యాత్రికురాలి గా మారిపోయారు. ఆమె శరీరం లోని ఒక భాగం ద్వారా ఆ పాప నేటికీ జీవించి ఉన్నట్లే. కదా. ఈ గొప్ప కార్యానికి గాను మిమ్ములను, మీ భార్య ను, మీ కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను.

సుఖ్‌ బీర్ గారు : ధన్యవాదాలు సర్.

 

సహచరులారా, అవయవ దానం లో ఉన్న అతి పెద్ద భావన ఏమిటి అంటే అది ఈ లోకం నుండి వెళ్లిపోతున్నప్పుడు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడాలి అనేదే. అవయవ దానం కోసం ఎదురుచూసే వారికి ప్రతి క్షణం నిరీక్షణ ఎంత కష్టమో తెలుసును. అటువంటి పరిస్థితి లో ఒక అవయవ దాత లేదా శరీర దాత లభించినప్పుడు వారిలో ఈశ్వర స్వరూపమే కానవస్తుంది. ఝార్ ఖండ్ నివాసి స్నేహలత చౌధరి గారు కూడా ఇలాగే దైవం గా మారి, ఇతరుల కు జీవనాన్ని ప్రసాదించారు. 63 ఏళ్ల వయస్సు లో స్నేహలత చౌధరి గారు తన గుండె ను, మూత్రపిండాన్ని, కాలేయాన్ని దానం చేసి వెళ్లిపోయారు. ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఆమె కుమారుడు సోదరుడు అభిజీత్ చౌధరి గారు మాతో ఉన్నారు. రండి వారు చెప్పేది విందాం.

ప్రధాన మంత్రి గారు: అభిజీత్ గారు నమస్కారం.

అభిజీత్ గారు: నమస్కారాలు సార్.

ప్రధాన మంత్రి గారు: అభిజీత్ గారూ... మీకు జన్మను ఇచ్చి, ఒక విధం గా మీకు జీవనాన్ని అందించిన తల్లి తాను చనిపోయిన తరువాత సైతం చాలా మందికి జీవనాన్ని ఇచ్చి వెళ్లారు. ఒక కుమారుడి గా అభిజీత్ మీరు తప్పక గర్వపడుతూ ఉంటారు కదూ.

అభిజీత్ గారు: అవునండి సర్.

ప్రధాన మంత్రి గారు: మీ అమ్మ గారి ని గురించి కొంచెం వివరం గా చెప్పండి. ఏ పరిస్థితుల లో అవయవ దానం నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ?

అభిజీత్ గారు: సరాయికెలా అని ఝార్ ఖండ్‌ లో ఒక చిన్న ఊరు. అక్కడ మా అమ్మానాన్నలు ఉండే వారు. గత ఇరవై ఐదేళ్లుగా నిరంతరాయంగా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉంది మా అమ్మ కు. ఆ ప్రకారం మా అమ్మ ఉదయం 4 గంటలకు మార్నింగ్ వాక్ కు బయలుదేరారు. ఆ సమయం లో ఓ ద్విచక్ర వాహనం ఆమె ను వెనుక నుంచి డీకొట్టడం తో ఆమె ఒక్కసారి గా కిందపడిపోయింది. తలకు బలమైన గాయం అయింది. వెంటనే ఆమెను సరాయికెలా లోని పెద్దాసుపత్రి కి తీసుకుపోయాం. అక్కడ వైద్యుడు ఆమె కు కట్టు కట్టారు. కానీ ఆమె కు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్పృహ లో లేదు. వెంటనే టాటా మెయిన్ హాస్పిటల్ కు తీసుకెళ్లాం. అక్కడ సర్జరీ చేశారు. 48 గంటల అబ్జర్వేశన్ అనంతరం ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువ అని డాక్టర్ అన్నారు. తరువాత ఆమె ను విమానం లో దిల్లీ లోని ఎయిమ్స్‌ కు తీసుకువచ్చాం. దాదాపు 7-8 రోజుల పాటు ఇక్కడ చికిత్స పొందారు. ఆ తరువాత పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఒక్కసారి గా రక్తపోటు బాగా పడిపోయింది. బ్రెయిన్ డెత్ అయిందని ఆ తరువాత తెలిసింది. అప్పుడు డాక్టర్ మళ్ళీ అవయవ దానాన్ని గురించి, నియమ నిబంధనల ను గురించి మాకు చెప్పారు. అవయవ దానం వంటివి ఉన్నాయని మా నాన్నగారి కి చెప్పలేక పోవచ్చని అనుకున్నాం. ఈ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేరు అని మాకు అనిపించింది. కాబట్టి ఇటువంటిది ఒకటి ఉంటుంది అనే సంగతి ని ఆయన మనసు లో నుండి తీసేద్దాం అని అనుకొన్నాం. అవయవ దానాన్ని గురించిన చర్చ జరుగుతుంది అని మేం చెప్పగానే ఆయన “ఇది అమ్మ కు కూడా ఇష్టం. మనం దీనిని చేయాలి” అన్నారు. అమ్మ బతకదు అని తెలిసి అప్పటి వరకు చాలా నిరాశ లో ఉన్నాం. కానీ ఈ అవయవ దానం చర్చ మొదలవగానే ఆ నిరాశ పాజిటివ్ దిశ కు మళ్ళింది. అలా చాలా మంచి పాజిటివ్ వాతావరణం లోకి వచ్చాం. అలా ఉండగానే రాత్రి 8 గంటల కు కౌన్సెలింగ్ జరిగింది. రెండో రోజు అవయవ దానం చేశాం. ఇంతకు ముందు నేత్ర దానం మొదలైన సామాజిక కార్యక్రమాల లో ఆమె చాలా చురుకు గా ఉండేదన్న మా అమ్మ ఆలోచన లు గుర్తొచ్చాయి. బహుశా మేం ఈ ఆలోచన తోనే ఇంత పెద్ద పని ని చేయగలిగాం. ఈ విషయం లో మా నాన్న నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది సాధ్యపడింది.

ప్రధాన మంత్రి గారు: ఎంత మంది కి ఆమె అవయవాలు ఉపయోగపడ్డాయి ?

అభిజీత్ గారు: ఆమె గుండె, రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్ళు దానం చేశాం. నలుగురు వ్యక్తుల ప్రాణాలు దక్కాయి. ఇద్దరికి చూపు వచ్చింది.

ప్రధాన మంత్రి గారు: అభిజీత్ గారూ.. మీ అమ్మానాన్న ఇద్దరూ ప్రణామాల కు హక్కుదారులు. వారికి నేను వందనాన్ని ఆచరిస్తున్నాను. ఇంత పెద్ద నిర్ణయం వైపు మీ నాన్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల ను నడిపించారు. ఇది నిజం గా చాలా స్ఫూర్తిదాయకం. తల్లంటే తల్లే అని నేను నమ్ముతున్నాను. తల్లి స్వయం ప్రేరణ పొందుతుంది. తల్లి నేర్పిన సంప్రదాయాలు తరతరాలు గా గొప్ప శక్తి గా మారుతాయి. అవయవ దానాని కి మీ అమ్మ ప్రేరణ ఈరోజు దేశమంతటికీ చేరుతోంది. పవిత్రమైనటువంటి ఈ గొప్ప కార్యం విషయం లో మీ మొత్తం కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు అభిజీత్ గారూ.. మీ నాన్న గారి కి మా నమస్కారాలు తెలియ జేయండి.

అభిజీత్ గారు: తప్పకుండా సర్. ధన్యవాదాలు.

సహచరులారా, 39 రోజుల వయస్సు కలిగిన అబాబత్ కౌర్ కానీయండి. లేదా 63 ఏళ్ల వయస్సు కలిగిన స్నేహలత చౌధరి కానీయండి. వారి వంటి దాతలు మనకు జీవనానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి తెలియజెప్పారు. మన దేశం లో ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఆశించి, అవయవ దాత కోసం ఎదురుచూసే వారు పెద్ద సంఖ్య లో ఉన్నారు. అవయవ దానాన్ని సులభతరం చేయడానికి, ప్రోత్సహించడానికి ఒక విధానం రూపొందనుండడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ దిశ లో అవయవ స్వీకర్త ఆయా రాష్ట్రాలలోనే నివాసం ఉండాలన్న నిబంధన ను తొలగించాలని కూడా నిర్ణయించారు. అంటే.. ఇప్పుడు రోగి దేశం లోని ఏ రాష్ట్రానికి అయినా వెళ్లి అవయవాన్ని స్వీకరించడానికి నమోదు చేసుకోగలుగుతారు. అవయవ దానానికి 65 ఏళ్ల లోపు వయస్సు పరిమితి ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ ప్రయత్నాల మధ్య అవయవ దాత లు గరిష్ట సంఖ్య లో ముందుకు రావాలి అని దేశ ప్రజలను నేను కోరుతున్నాను. మీ ఒక్క నిర్ణయం ఎంతో మంది ప్రాణాల ను కాపాడుతుంది. జీవనాన్ని నిలబెడుతుంది.

ప్రియమైన నా దేశప్రజలారా, ఇది నవరాత్రుల సమయం. శక్తి ని ఆరాధించే సమయం. నేడు భారతదేశం యొక్క సామర్థ్యం కొత్త పుంత లు తొక్కుతోంది. అందులో మన మహిళా శక్తి పాత్ర కీలకం. ఇటీవల ఇటువంటి ఉదాహరణ లు చాలానే మన ముందుకు వచ్చాయి. ఆసియా లో తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్‌ గారి ని మీరు సామాజిక ప్రసార మాధ్యాల లో చూసే ఉంటారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కు తొలి మహిళా లోకో పైలట్‌ గా కూడా సురేఖ గారు మరో రికార్డు ను సృష్టించారు. ఈ నెలలో నిర్మాత గుణీత్ మోంగా గారు, దర్శకురాలు కార్తికీ గొంజాల్వెస్ గారు వారి డాక్యుమెంటరీ ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ కు ఆస్కర్ ను గెలుచుకొని దేశాని కి పేరు తెచ్చారు. భాభా అణు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త, సోదరి జ్యోతిర్మయి మొహంతి గారు కూడా దేశాని కి మరో ఘనత ను సాధించారు. జ్యోతిర్మయి గారి కి కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగం లో ఐయుపిఎసి ప్రత్యేక పురస్కారం దక్కింది. ఈ ఏడాది ఆరంభం లో భారత అండర్‌-19 మహిళా క్రికెట్‌ జట్టు టి-20 ప్రపంచ కప్‌ ను గెలిచి కొత్త చరిత్ర ను సృష్టించింది. రాజకీయాల ను పరిశీలిస్తే నాగాలాండ్‌లో కొత్త విశేషం చోటుచేసుకుంది. నాగాలాండ్‌లో 75 ఏళ్ల తర్వాత తొలిసారి గా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు గెలిచి విధాన సభ లో అడుగుపెట్టారు. వారిలో ఒకరికి నాగాలాండ్ ప్రభుత్వం లో మంత్రి పదవి కూడా లభించింది. అంటే ఆ రాష్ట్ర ప్రజల కు తొలిసారి గా మహిళా మంత్రి సేవల ను పొందే అవకాశం లభించింది.

సహచరులారా, కొద్ది రోజుల క్రితం తుర్కియె లో విధ్వంసకర భూకంపం తరువాత ప్రజల కు సహాయం చేయడానికి వెళ్లిన ఆ ధైర్యవంతులైన కుమార్తెల తో కూడా నేను భేటీ అయ్యాను. వీరందరినీ ఎన్ డిఆర్‌ఎఫ్ దళం లో చేర్చారు. వారి ధైర్యకౌశలాల కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశం యుఎన్ మిశన్ లో భాగం గా శాంతిసేన లో అందరుమహిళ లే ఉండేటటువంటి క చిన్న సైనిక బృందాన్ని కూడా మోహరించింది.

ప్రస్తుతం మన త్రి విధ సైనిక దళాల లో దేశం ఆడపడుచు లు వారి శౌర్య పతాకాన్ని ఎగురవేస్తున్నారు. గ్రూపు కెప్టెన్ శాలిజ ధామి యుద్ధ విభాగం లో కమాండ్ అపాయింట్‌మెంట్ ను పొందినటువంటి మొదటి మహిళా వాయుసేన అధికారి గా నిలచారు. ఆమె కు దాదాపు మూడు వేల గంటల విమానయాన అనుభవం ఉంది. భారతదేశ సైన్యం లోని ధైర్యశాలి కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్‌ లో నియామకం లభించిన తొలి మహిళా అధికారి అయ్యారు. సియాచిన్ లో ఉష్ణోగ్రత మైనస్ అరవై డిగ్రీల కు పడిపోతుంటుంది. అక్కడ శివ మూడు నెలల పాటు విధినిర్వహణ లో ఉన్నారు.

సహచరులారా, ఈ జాబితా ఎంత పొడవైంది గా ఉంది అంటే అందరి ని గురించి చర్చించడం కూడా కష్టమే మరి. అటువంటి మహిళలు అందరు, మన కుమార్తె లు ; ఇవాళ, భారతదేశాని కి మరియు భారతదేశం యొక్క స్వప్నాల కు వీరు శక్తి ని ఇస్తున్నారు. నారీశక్తి తాలూకు ఈ శక్తి యే వికసిత భారతావని కి ప్రాణవాయువు గా ఉంది.

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ రోజుల లో ప్రపంచం అంతటా పరిశుభ్రమైన శక్తి, నవీకరణ యోగ్య శక్తి ని గురించి చాలా చర్చే జరుగుతోంది. నేను ప్రపంచం లో ఇతర ప్రాంతాల ప్రజల ను కలుసుకొన్నప్పుడు వారు ఈ రంగం లో భారతదేశం సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడి తీరుతారు. ముఖ్యం గా సౌర శక్తి రంగం లో భారతదేశం వేగం గా ముందుకు సాగుతున్న తీరు దానంతట అదే ఒక పెద్ద విజయం. భారతదేశం ప్రజల కు శతాబ్దాలుగా సూర్యుని తో ప్రత్యేక సంబంధం ఉంది. సూర్యుని శక్తి నొ గురించి మనకున్న శాస్త్రీయ అవగాహన, సూర్యుడి ని పూజించే సంప్రదాయాలు ఇతర ప్రాంతాల లో చాలా అరుదు గా కనిపిస్తాయి. ఈ రోజు ప్రతి దేశవాసీ సౌరశక్తి ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. స్వచ్ఛ శక్తి వనరుల కు కూడా సహకరించాలని భావిస్తున్నారు నేడు భారతదేశం సోలర్ మిశన్‌ ను ముందుకు నడిపిస్తోంది ‘సబ్ కా ప్రయాస్’ (అందరి కృ షి) తాలూకు ఈ స్ఫూర్తి యే. మహారాష్ట్ర లోని పుణె లో అటువంటి అద్భుతమైన ప్రయత్నం నా దృష్టి ని ఆకర్షించింది. ఇక్కడి ఎమ్ ఎస్ ఆర్- ఆలివ్ హౌసింగ్ సొసైటీ ప్రజలు ఇప్పుడు సొసైటీ లో తాగునీరు, లిఫ్ట్, లైట్లు వంటి సాధారణ అవసరాల కు సౌర శక్తి ని మాత్రమే ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు. దీని కి తరువాయి గా అంతా కలసి ఆ సొసైటీ లో సోలర్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ సోలర్ ప్యానెల్స్ నుండి ఏటా దాదాపు 90 వేల కిలోవాట్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దీంతో ప్రతి నెల దాదాపు 40 వేల రూపాయల డబ్బు ఆదా అవుతోంది. ఈ పొదుపు ప్రయోజనాల ను సొసైటీ లోని ప్రజలందరూ పొందుతున్నారు.

సహచరులారా, పుణె మాదిరి గానే ఒక ప్రత్యేక జిల్లా అయినటువంటి దమన్- దీవ్ లో ప్రజలు కూడాను అద్భుతమైన పని ని చేతలలో చూపెట్టారు. సోమనాథ్ సమీపం లో దీవ్ ఉంది అనే విషయం మీకు తెలిసి ఉండవచ్చు. పగటి వేళల్లో వంద శాతం క్లీన్ ఎనర్జీ ని అన్ని అవసరాలకు ఉపయోగిస్తున్న భారతదేశం లోని మొదటి జిల్లా గా దీవ్ నిలచింది. దీవ్ సాధించిన ఈ విజయాని కి మంత్రం కూడా అందరి కృషి. ఒకప్పుడు విద్యుదుత్పత్తి కి వనరుల కొరత ఉండేది. ఈ సమస్య ను పరిష్కరించడానికి ప్రజలు సౌరశక్తి ని ఎంచుకొన్నారు. అక్కడ బంజరు భూమి తో పాటు అనేక భవనాలపై సౌర ఫలకాల ను ఏర్పాటు చేశారు. ఈ సోలర్ ప్యానెల్స్ నుండి దీవ్ లో పగటిపూట అవసరమైన దాని కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ఈ సోలర్ ప్రాజెక్టు కారణం గా విద్యుత్ కొనుగోలు తో అయ్యే దాదాపు 52 కోట్ల రూపాయల ఖర్చు మిగిలింది. దీని వల్ల పర్యావరణానికి కూడా చాలా రక్షణ లభించింది.

సహచరులారా, పుణె, ఇంకా దీవ్ చేసి చూపించినటువంటి ప్రయత్నాలు దేశవ్యాప్తం గా చాలా చోట్ల జరుగుతున్నాయి. పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల భారతీయులమైన మనం ఎంత సున్నితంగా ఉంటామో, మన దేశం భవిష్యత్ తరాల పట్ల ఎంత స్పృహ తో ఉందో ఇది తెలియజేస్తుంది. అటువంటి ప్రయత్నాలన్నింటిని హృదయ పూర్వకం గా అభినందిస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, మన దేశంలో కాలక్రమేణా పరిస్థితులకు అనుగుణంగా అనేక సంప్రదాయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సంప్రదాయాలు మన సంస్కృతి కి బలాన్ని పెంపు చేస్తాయి. ప్రతి రోజూ కొత్త శక్తి ని కూడా ఇస్తాయి. కొన్ని నెలల క్రితం కాశీ లో అటువంటి సంప్రదాయం ఒకటి మొదలైంది. ‘కాశీ- తమిళ సంగమమ్’ సమయం లో కాశీ-తమిళ ప్రాంతాల మధ్య శతాబ్దాల నాటి చారిత్రిక, సాంస్కృతిక సంబంధాల ను ఉత్సవం గా జరుపుకోవడమైంది. ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి మన దేశాని కి బలాన్ని ఇస్తుంది. మనం ఒకరి ని గురించి మరొకరం తెలుసుకొన్నప్పుడు, ఒకరి నుండి మరొకరం నేర్చుకొన్నప్పుడు ఈ ఏకత్వ భావన మరింత గా బలపడుతుంది. ఈ ఐక్యత స్ఫూర్తి తో వచ్చే నెల లో గుజరాత్‌ లోని వివిధ ప్రాంతాల్లో ‘సౌరాష్ట్ర-తమిళ సంగమమ్’ జరుగుతుంది. ‘సౌరాష్ట్ర-తమిళ సంగమమ్’ ఏప్రిల్ 17 వ తేదీ నుండి 30 వ తేదీ వరకు కొనసాగుతుంది. గుజరాత్‌ లోని సౌరాష్ట్ర కు తమిళ నాడు తో సంబంధం ఏమిటి అని ‘మన్ కీ బాత్’ ( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం శ్రోతలు కొందరు ఆలోచిస్తుండవచ్చు. నిజానికి శతాబ్దాల క్రితమే సౌరాష్ట్ర కు చెందిన చాలా మంది తమిళ నాడు లోని వివిధ ప్రాంతాల లో స్థిరపడ్డారు. వారికి ఇప్పటికీ 'సౌరాష్ట్రీ తమిళులు' గానే గుర్తింపు ఉంది. నేటికీ వారిలో సౌరాష్ట్ర ఆహారపు అలవాటు లు, జీవన శైలి, సామాజిక ఆచారాల ను చూడవచ్చును. ఈ వేడుక కు సంబంధించి తమిళ నాడు కు చెందిన చాలా మంది నన్ను అభినందిస్తూ లేఖల ను వ్రాశారు. మదురై లో నివసించే జయచంద్రన్ గారు చాలా భావోద్వేగం తో కూడిన విషయాన్ని వ్రాశారు. ‘‘వేయి సంవత్సరాల తరువాత, ఈ సౌరాష్ట్ర-తమిళ సంబంధాల ను గురించి ఎవరైనా ఆలోచించారా అని సౌరాష్ట్ర నుండి వచ్చి తమిళ నాడు లో స్థిరపడిన ప్రజలను అడిగాను’’ అని ఆయన రాశారు. జయచంద్రన్ గారి మాట లు వేల కొద్దీ తమిళ సోదరీమణుల, తమిళ సోదరుల భావాల వ్యక్తీకరణ అని చెప్పుకోవచ్చు.

సహచరులారా, అసమ్ కు సంబంధించిన ఒక వార్త ను గురించి ‘మన్ కీబాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు తెలియజేయాలి అని అనుకొంటున్నాను. ఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి ని కూడా బలపరుస్తుంది. వీర్ లాసిత్ బోర్ ఫుకన్ గారి 400 వ జయంతి వేడుకల ను జరుపుకొటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ధైర్యవంతుడు అయిన లాసిత్ బోర్ ఫుకన్ అత్యాచారి ముగల్ సామ్రాజ్యం బారి నుండి గువాహాటీ కి స్వేచ్ఛ ను సాధించిపెట్టాడు. ఈ మహాయోధుని అలుపెరుగని ధైర్యం, సాహసాల ను గురించి ప్రస్తుతం జాతి తెలుసుకొంటున్నది. కొన్ని రోజుల క్రితం లాసిత్ బోర్ ఫుకన్ జీవనం పై వ్యాస రచన కోసం ప్రచారం మొదలైంది. దీని కోసం సుమారు 45 లక్షల మంది వ్యాసాలు పంపారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అది గిన్నిస్‌ రికార్డ్‌ గా నిలచిందని కూడా తెలిస్తే మీరు సంతోషిస్తారు. వీరుడు లాసిత్ బోర్ ఫుకన్ పై రాసిన ఈ వ్యాసాల లో దాదాపు 23 విభిన్న భాషల లో రాసిన వ్యాసాలు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులో అసమియా భాష కాకుండా ప్రజలు హిందీ, ఇంగ్లిషు, బాంగ్లా, బోడో, నేపాలీ, సంస్కృతం, సంతాలి వంటి భాషల లో వ్యాసాలు వ్రాసి పంపించారు. ఈ ప్రయాస లో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరికి నేను మనసారా అభినందనల ను తెలియ జేస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, కశ్మీర్ లేదా శ్రీనగర్ విషయానికి వస్తే, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి మైదానాలు, డల్ సరస్సు. మనలో ప్రతి ఒక్కరూ డల్ సరస్సు వీక్షణ ను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే డల్ సరస్సు లో మరో ప్రత్యేకత ఉంది. డల్ సరస్సు రుచికరమైన తామరకాడల కు కూడా ప్రసిద్ధి చెందింది. దేశం లోని వివిధ ప్రాంతాల లో తామర కాడల ను వివిధ పేరుల తో గుర్తిస్తారు. కశ్మీర్‌ లో వాటిని నాదరూ అని అంటారు. కశ్మీర్ నాదరూ కు గిరాకీ నానాటికీ పెరుగుతున్నది. ఈ డిమాండు ను దృష్టి లో పెట్టుకొని డల్‌ సరస్సు లో నాదరూ సాగు చేస్తున్న రైతులు ఎఫ్‌పీఓ గా ఏర్పడ్డారు. ఈ ఎఫ్‌పీఓ లో దాదాపు 250 మంది రైతులు చేరారు. ప్రస్తుతం ఈ రైతులు వారి నాదరూ ను విదేశాల కు పంపడం మొదలుపెట్టారు. కొంతకాలం కిందట ఈ రైతులు రెండు లోడుల నాదరూ ను యుఎఇ కి పంపించారు. ఈ విజయం కశ్మీర్‌ కు పేరు ను తీసుకు రావడం ఒక్కటే కాకుండా వందల కొద్దీ రైతుల ఆదాయాన్ని పెంచింది కూడాను.

సహచరులారా, కశ్మీర్ ప్రజల వ్యవసాయాని కి సంబంధించిన అటువంటి ఒక ప్రయత్నం ఈ రోజుల్లో దాని విజయ పరిమళాన్ని వెదజల్లుతోంది. విజయ పరిమళం అని నేను ఎందుకు అంటున్నాను అని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఈ విషయం పరిమళాని కి సంబంధించింది. సుగంధాని కి సంబంధించిన విషయమే! నిజానికి జమ్ము- కశ్మీర్‌ లోని డోడా జిల్లా లో 'భదర్ వాహ్' అనే పట్టణం ఉంది. అక్కడి రైతులు దశాబ్దాలు గా సంప్రదాయం గా మొక్కజొన్న ను సాగు చేస్తుండగా కొంత మంది రైతులు అందుకు భిన్నం గా ఏదైనా చేయాలి అని తలపోశారు. వారు ఫ్లోరీ కల్చర్ వైపు అంటే పూల సాగు వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం దాదాపు రెండున్నర వేల మంది రైతులు అక్కడ లావెండర్ ను సాగు చేస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం అరోమ మిశన్ నుండి సహకారం సైతం లభించింది. ఈ కొత్త సాగు రైతుల ఆదాయాన్ని బాగా పెంచింది. నేడు లావెండర్‌ తో పాటు వారి విజయ పరిమళం కూడా సుదూర ప్రాంతాల కు వ్యాపిస్తోంది.

సహచరులారా, కశ్మీర్ ను గురించి మాట్లాడేటప్పుడు, కమలం గురించి మాట్లాడేటప్పుడు, పువ్వుల గురించి మాట్లాడేటప్పుడు, సుగంధ పరిమళం గురించి మాట్లాడేటప్పుడు- తామర పువ్వు పై కూర్చున్న శారద మాత గుర్తు కు రావడం చాలా సహజం. కొన్ని రోజుల క్రితమే కుప్ వాడా లో శారద మాత యొక్క భవ్య ఆలయాన్ని ప్రారంభించారు. గతం లో శారద పీఠాన్ని సందర్శించేందుకు వెళ్లే మార్గం లోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాని కి స్థానికులు ఎంతో సహకరించారు. ఈ శుభ కార్యాని కి జమ్ము- కశ్మీర్ ప్రజలకు నేను చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, ఈసారి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇంతే. ఇక ‘మన్ కీ బాత్’ ( ‘మనసు లో మాట’ ) కార్యక్రమం వందో భాగం లో కలుసుకొందాం. మీరంతా మీ మీ సూచనల ను తప్పక పంపగలరు. ఈ మార్చి నెల లో మనం హోలీ నుండి నవరాత్రి వరకు అనేక పర్వాలు, పండుగ ల సందడి తో ఉన్నాం. పవిత్రమైనటువంటి రమ్ జాన్ మాసం కూడా ఆరంభం అయింది. మరికొద్ది రోజుల్లో శ్రీరామ నవమి మహా పర్వదినం కూడా వస్తోంది. తరువాత మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లు కూడా వస్తాయి. ఏప్రిల్ లో మనం భారతదేశం లోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతిని కూడా జరుపుకుంటాం. ఆ ఇద్దరు మహా పురుషులు మహాత్మ జ్యోతిబా ఫులే, బాబా సాహెబ్ ఆంబేడ్ కర్. సమాజం లో వివక్ష ను తొలగించేటందుకు ఈ మహానుభావులు ఇరువురు అపూర్వమైన కృషి ని చేశారు. స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం లో, మనం అటువంటి మహనీయుల నుండి నేర్చుకోవాలి. వారి నుండి నిరంతరం స్ఫూర్తి ని పొందుతూ ఉండవలసిన అవసరం ఉంది. మన కర్తవ్యానికి అన్నిటి కంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. సహచరులారా, ఈ కాలం లో కొన్ని చోట్ల కరోనా కూడా విస్తరిస్తోంది. అందుకే మీరందరు జాగ్రత గా ఉండండి; పరిశుభ్రత విషయం లో కూడాను శ్రద్ధ తీసుకొంటూ ఉండండి. వచ్చే నెల ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 100 వ ఎపిసోడ్‌ లో మనం అందరమూ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. ధన్యవాదాలు. నమస్కారం.

***


(Release ID: 1910925) Visitor Counter : 386