ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ 36వ బోర్డ్ మీటింగ్‌కు అధ్యక్షత వహించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా
భారతదేశంలో టిబిని అంతం చేయడానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరుగులేని నిబద్ధతను మనం చూశాము. . టీబీకి వ్యతిరేకంగా జరిగే సహకార పోరాటంలో మేము ముందు ఉండి నాయకత్వం వహించడానికి, గ్లోబల్ సౌత్‌కు వాయిస్‌ని అందించడానికి సిద్ధంగా ఉన్నాము: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
"కేస్ ఫైండింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్, డిజిటల్ ఇంటర్వెన్షన్స్, నిఘాలో ఆవిష్కరణల ద్వారా భారతదేశం క్షేత్ర స్థాయిలో అసాధారణమైన పని చేస్తోంది"
ప్రజలకు ఆరోగ్య సంరక్షణను మరింత చేరువ చేసేందుకు భారతీయ ఆవిష్కరణలు, ఆలోచనలు, వ్యూహాలను ప్రపంచం అనుకరించాలి: డాక్టర్ లూసికా డిటియు
Posted On:
25 MAR 2023 11:41AM by PIB Hyderabad
“భారతదేశంలో టిబిని అంతం చేయడానికి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరుగులేని నిబద్ధతను మేము చూశాము. టీబీ కి వ్యతిరేకంగా సహకార పోరాటంలో మేము ముందు ఉండి నాయకత్వం వహించడానికి, గ్లోబల్ సౌత్ వాయిస్‌గా ఉండటానికి సిద్ధంగా ఉన్నాము" అని ఈ రోజు ఇక్కడ స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ 36వ బోర్డు మీటింగ్‌లో ప్రసంగిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అన్నారు. ఆయనతో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ మాండవియ మాట్లాడుతూ, “భారతదేశం జి20 ప్రెసిడెన్సీ క్రింద 3 ముఖ్యమైన ఆరోగ్య ప్రాధాన్యతలను గుర్తించింది. ఇవన్నీ సార్వత్రిక ఆరోగ్య కవరేజీపై దృష్టి సారించాయి. టీబీ నిర్మూలనకు మా ప్రతిస్పందనకు సంబంధించినవి. "కేస్ ఫైండింగ్, మ్యాథమెటికల్ మోడలింగ్, డిజిటల్ ఇంటర్వెన్షన్స్, నిఘాలో ఆవిష్కరణల ద్వారా క్షేత్ర స్థాయిలో చాలా అసాధారణమైన పని జరుగుతోంది" అని ఆయన అన్నారు. "ఇటువంటి మంచి పద్ధతులను పునరావృతం చేయడానికి ఇతర దేశాలతో సాంకేతిక సహాయాన్ని పంచుకోవడానికి భారతదేశం సంతోషంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
కోవిడ్ నుండి పుంజుకోవడమే కాకుండా ప్రపంచంలో ఒక రకమైన ఉద్యమంగా మారిన ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ వంటి వినూత్న వ్యూహాలను కూడా తీసుకురావడానికి కృషి జరుగుతోందని డాక్టర్ మాండవ్య నొక్కి చెప్పారు. టీబీని అంతమొందించేందుకు సంఘాలను చైతన్యవంతం చేసేందుకు కార్యాచరణకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
వ్యాధికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో టీబీ వ్యాక్సిన్ కీలకమైన ప్రాముఖ్యతను ప్రస్తావించిన కేంద్ర ఆరోగ్య మంత్రి, ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌పై యూఎన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ విషయాన్ని చర్చించాలని కోరారు. "టిబి వ్యాక్సిన్ అత్యవసరం" అని ఆయన ఉద్ఘాటించారు. దాని అభివృద్ధిని వేగంగా ట్రాక్ చేయడం, తయారీ సామర్థ్యాలను విస్తరించడం, సులభంగా యాక్సెస్‌లో దేశాలకు సహాయం చేయడం కూడా చాలా ముఖ్యం అని డాక్టర్ మాండవ్య సూచించారు.
"టిబిని నిర్మూలించడంలో భారతదేశానికి కీలక పాత్ర ఉంది, ఎందుకంటే భారతదేశం పురోగతి ప్రపంచాన్ని నడిపిస్తుంది" అని స్టాప్ టీబీ పార్ట్నెర్షిప్ డైరెక్టర్ డాక్టర్ లూసికా డిటియు ఉద్ఘాటించారు. భారతదేశం "వారి ని-క్షయ్ డేటాతో చాలా అధునాతన మోడలింగ్ చేస్తున్నందుకు" ఆమె ప్రశంసించారు. "ప్రజలకు ఆరోగ్య సంరక్షణను చేరువ చేసేందుకు వారి ఆవిష్కరణలు, ఆలోచనలు, వ్యూహాలు ప్రపంచం మొత్తం అనుకరించగలవు" అని ఆమె పేర్కొంది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిశ్రీమతి రోలీ సింగ్, , డబ్ల్యూహెచ్ఓ సౌత్-ఈస్ట్ ఏషియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ వైస్-ఛైర్ ఆస్టిన్ అరింజ్ ఒబిఫునా ; ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అశోక్ బాబు, ; సెంట్రల్ టిబి విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర జోషి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ; డాక్టర్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, సెంట్రల్ టిబి విభాగం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
(Release ID: 1910920)
Visitor Counter : 149