ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 1780 కోట్ల రూపాయల కు పైగా విలువైన అభివృద్ధి పథకాల కు శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి


వారాణసీ కంటోన్మెంట్ స్టేశన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు ఆయన శంకుస్థాపన చేశారు

జల్ జీవన్ మిశన్ లోభాగం గా 19 త్రాగునీటి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు

‘‘ప్రజల లో భయాందోళనల ను కాశీ అధిగమించడం తో పాటు నగరాన్ని పరివర్తన చెందింప చేయడం లో సఫలం అయింది’’

‘‘గడచిన 9 ఏళ్ళ లో గంగ  నదిఘాట్ ల రూపు రేఖ లు చాలా వరకు మారడాన్ని అందరు గమనించారు’’

‘‘గత మూడేళ్ళ లో దేశం లో 8 కోట్ల కుటుంబాలు నల్లా నీటి సరఫరా ను అందుకొన్నాయి’’

‘‘అమృత కాలం లో భారతదేశం అభివృద్ధి ప్రయాణం లో ప్రతి ఒక్కపౌరుడు/పౌరురాలు తోడ్పాటు ను అందించేటట్లుగాను, ఏ ఒక్కరు వెనుబడి పోకుండాను ప్రభుత్వం గట్టి గా కృషి చేస్తున్నది’’

‘‘రాష్ట్రం లో ప్రతి ఒక్క రంగం యొక్క అభివృద్ధి లో క్రొత్త పార్శ్వాలను ఉత్తర్ ప్రదేశ్ జోడిస్తున్నది’’

‘‘నిరుత్సాహం తాలూకు నీడల లో నుండి ఉత్తర్ ప్రదేశ్ బయట పడి  ప్రస్తుతం తన ఆశల మరియు ఆకాంక్షలమార్గం లో సాగిపోతున్నది’’ 

Posted On: 24 MAR 2023 3:03PM by PIB Hyderabad

వారాణసీ లో 1780 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ పథకాల లో వారాణసీ కంటోన్మెంట్ స్టేశన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు శంకుస్థాపన చేయడం, నమామి గంగే పథకం లో భాగం గా 55 ఎమ్ఎల్ డి మురుగునీటి శుద్ధి ప్లాంటు ను భగవాన్ పుర్ లో ఏర్పాటు చేయడం, సిగ్ రా స్టేడియమ్ పునరభివృద్ధి పనుల తాలూకు రెండో దశ, మూడో దశ, సేవాపురీ లోని ఇస్ రవర్ గ్రామం లో హిందుస్తాన్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ ఆధ్వర్యం లో నిర్మాణం కాబోయే ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు, భర్ థరా గ్రామం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దుస్తులు మార్చుకొనేందుకు సదుపాయం తో కూడినటువంటి ఒక ఫ్లోటింగ్ జెట్టి తదితర పథకాలు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి ఇంకా జల్ జీవన్ మిశన్ లో భాగం గా 19 త్రాగునీటి పథకాల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు. అవి 63 గ్రామ పంచాయతుల లో 3 లక్షల మంది కి పైగా ప్రజల కు లబ్ధిని చేకూర్చనున్నాయి. ఇదే మిశన్ లో భాగం గా 59 త్రాగునీటి పథకాల కు ఆయన శంకుస్థాపన చేశారు. కర్ ఖియావ్ లో ఒక ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ను సైతం ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ ప్లాంటు లో కాయగూరలు మరియు ఫలాల ను గ్రేడింగ్ చేయడం, సార్టింగ్ చేయడం, ఇంకా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. వారాణసీ స్మార్ట్ సిటీ మిశన్ లో భాగం గా వివిధ పథకాల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇది మంగళప్రదమైనటువంటి నవరాత్రి కాలం, అంతేకాకుండా ఈ రోజు మాత చంద్రఘంట ను ఆరాధించే రోజు కూడాను అని గుర్తు కు తీసుకు వచ్చారు. ఈ విశిష్టమైనటువంటి సందర్భం లో వారాణసీ ప్రజల మధ్య కు విచ్చేయడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆయన అన్నారు. వారాణసీ యొక్క సమృద్ధి లో ఒక కొత్త అధ్యాయం జతపడుతోందని కూడా ఆయన అన్నారు. వారాణసీ సర్వతోముఖ అభివృద్ధి కి గాను ఒక పేసింజర్ రోప్ వే కు శంకుస్థాపన తో పాటు వందల కోట్ల రూపాయల విలువైన మరిన్ని పథకాల కు శుభారంభం జరిగింది. ఈ పథకాల లో త్రాగునీరు, ఆరోగ్యం, విద్య, గంగ నది శుద్ధి, వరదల నియంత్రణ, రక్షకభట సంబంధి సేవలు మరియు క్రీడల సంబంధి సేవలు మొదలైనవి ఉన్నాయి అని ఆయన అన్నారు. బిహెచ్ యు లో మెషీన్ టూల్స్ డిజైన్ కు సంబంధించి ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ప్రపంచ ప్రమాణాల ను కలిగి ఉండే మరొక సంస్థ ను ఈ నగరాని కి జోడిస్తుంది అని కూడా ఆయన అన్నారు. ఈ రోజు న తెర మీద కు వచ్చినటువంటి అభివృద్ధి పథకాల కు గాను వారాణసీ మరియు పూర్వాంచల్ ప్రజల కు అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

కాశీ అభివృద్ధి ని గురించి అంతటా చర్చించుకోవడం జరుగుతోంది, మరి ప్రతి ఒక్క సందర్శకుడు/ప్రతి ఒక్క సందర్శకురాలు సరికొత్త శక్తి తో తిరిగి వెళ్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల భయాందోళనల ను కాశీ అధిగమించడం తో పాటుగా నగరం యొక్క రూపురేఖ లను మార్చివేయడం లో కూడా సఫలీకృతం అయింది అని ఆయన అన్నారు.

కాశీ లో పాత కాశీ ని మరియు కొత్త కాశీ ని ఏక కాలం లో దర్శించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్, గంగ నది యొక్క ఘాట్ ల పనుల తో పాటు అతి పొడవైన నదీవిహారం వంటి వాటి ప్రసక్తి ప్రపంచం అంతటా మారుమోగుతోంది అని ఆయన అన్నారు. కేవలం ఒక సంవత్సర కాలం లో 7 కోట్ల మంది కి పైగా సందర్శకులు కాశీ ని సందర్శించారు. ఈ యాత్రికులు నగరం లో ఉపాధి తో పాటు సరిక్రొత్త ఆర్థిక అవకాశాల ను కూడా అందిస్తున్నారు అని ఆయన అన్నారు.

పర్యటన కు మరియు నగర సుందరీకరణ కు సంబంధించిన నూతన అభివృద్ధి పథకాల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘రహదారులు కావచ్చు, వంతెనలు కావచ్చు, రైలు మార్గాలు లేదా విమానాశ్రయాలు కావచ్చు - వాటితో వారాణసీ కి కనెక్టివిటీ పూర్తి గా సులభతరం గా మారింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సరిక్రొత్తదైన రోప్ వే ప్రాజెక్టు నగరం లో కనెక్టివిటీ ని ఒక నవీన స్థాయి కి తీసుకుపోనుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది యాత్రికుల కు ఒక కొత్త ఆకర్షణ ను ఇవ్వడం తో పాటు నగరం లో సదుపాయాల ను మరో మెట్టు పైకి తీసుకు పోతుంది అని ఆయన తెలిపారు. రోప్ వే నిర్మాణం ఒకసారి పూర్తి అయింది అంటే ఇక అప్పుడు బనారస్ కంటోన్మెంట్ రైల్ వే స్టేశన్ కు మరియు కాశీ-విశ్వనాథ్ కారిడార్ కు మధ్య దూరం నిమిషాల వ్యవధి కి పరిమితం అయిపోతుంది; అంతేకాదు, కంటోన్మెంట్ స్టేశన్ మరియు గోదౌలియా మధ్య ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది అని ఆయన వివరించారు.

చుట్టుప్రక్కల నగరాల నుండి మరియు రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చే ప్రజలు తక్కువ కాలం లో నగరాన్ని చుట్టి రాగలుగుతారు అని ప్రధాన మంత్రి చెప్పారు. రోప్ వే కోసం జత చేసే ఆధునిక సదుపాయాలు ఆర్థిక కార్యకలాపాల తాలూకు ఒక కొత్త కేంద్రాన్ని ఏర్పరుస్తాయి అని ఆయన స్పష్టం చేశారు.

బాబత్ పుర్ విమానాశ్రయం లో సరిక్రొత్త ఎటిసి టవర్ కాశీ కి వాయు మార్గ సంధానాన్ని బలపరచడం కోసం చేపట్టిన చర్య అని ప్రధాన మంత్రి వివరించారు. ఫ్లోటింగ్ జెట్టి ని అభివృద్ధి పరుస్తున్న సంగతి ని ఆయన ప్రస్తావించి, తీర్థయాత్రికుల అవసరాల ను మరియు పర్యటకుల అవసరాల ను తీర్చడమే దీనిలోని ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. నమామి గంగే మిశన్ లో భాగం గా గంగ నది తీరాన అన్ని నగరాల లో మురుగునీటి శుద్ధి సంబంధి నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడమైంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘గడచిన 9 సంవత్సరాల లో గంగ ఘాట్ ల ముఖచిత్రం లో వచ్చిన మార్పు ను ప్రతి ఒక్కరు గమనించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గంగ నది కి రెండు ప్రక్కల ఒక వినూత్న పర్యావరణ పరమైన ప్రచార ఉద్యమం సాగుతున్నది. దీని లో భాగం గా ప్రభుత్వం అయిదు కిలో మీటర్ ల మేర ప్రాకృతిక వ్యవసాయాని కి ప్రోత్సాహాన్ని అందిస్తోందని ఆయన వివరించారు. దీని కోసం ఈ సంవత్సరం బడ్జెటు లో ప్రత్యేకంగా కేటాయింపు చేయడమైందని ఆయన అన్నారు. ప్రాకృతిక వ్యవసాయం విషయానికి వస్తే, క్రొత్త కేంద్రాల ను అభివృద్ధి పరచి మరీ రైతుల కు సహాయం అందించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

కేంద్రం లోని, ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వాలు పేదల సేవను విశ్వసిస్తున్నాయని, ప్రజలు తనను 'ప్రధాన మంత్రి' అని పిలిచినప్పటికీ, తాను మాత్రం ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నట్టు నమ్ముతున్నానని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకుముందు వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో తాను జరిపిన సంభాషణలను గుర్తు చేసుకున్న ప్రధాని, వారణాసికి చెందిన వేలాది మంది పౌరులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. 2014కు ముందు బ్యాంకు ఖాతా తెరవడం చాలా క్లిష్టమైన పని అని, నేడు దేశంలో నిరుపేదలకు కూడా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, చెల్లింపుల రూపంలో సహాయాన్ని ప్రభుత్వం నేరుగా ఆ ఖాతాలలో జమ చేస్తోందని ప్రధాని తెలిపారు. "చిన్న రైతు అయినా, వ్యాపారవేత్త అయినా, మహిళా స్వయం సహాయక సంఘాలైనా ముద్ర యోజన ద్వారా రుణం పొందడం చాలా సులభమైంది" అని ప్రధాన మంత్రి అన్నారు. పశువులు, చేపల పెంపకందారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని, వీధి వ్యాపారులు పీఎం స్వనిధి యోజన ద్వారా రుణాలు అందు కుంటున్నారని, భారత దేశం లోని విశ్వకర్మలకు పీఎం-విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టామని తెలిపారు. "అమృత్ కాల్ లో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి పౌరునికి సహకారం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది , ఎవరూ వెనుకబడరు" అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

లక్ష మంది అథ్లెట్లు పాల్గొన్న ఖేలో బనారస్ పోటీల విజేతలతో తాను జరిపిన ముఖాముఖిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇందులో పాల్గొన్న వారిని, విజేతలను ప్రధాని అభినందించారు. బెనారస్ యువతకు కొత్త క్రీడా సౌకర్యాలను గురించి ఆయన ప్రస్తావించారు.  సిగ్రా స్టేడియం ఫేజ్ 2, 3 విస్తరణకు నేడు శంకుస్థాపన జరిగింది. వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని కూడా ఆయన తెలిపారు.

 

"ఈ రోజు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రతి అభివృద్ధి రంగానికి కొత్త కోణాలను జోడిస్తోంది" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం రేపు, మార్చి 25 న రెండవ పదవీకాలానికి మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోందని, శ్రీ యోగి రాష్ట్రానికి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొత్త రికార్డు సృష్టించారని ఆయన పేర్కొన్నారు. "ఉత్తరప్రదేశ్ నిరాశ ఛాయల నుండి బయటపడింది. ఇప్పుడు తన ఆకాంక్షలు, ఆశయాల మార్గంలో నడుస్తోంది" అని ఆయన వ్యాఖ్యానించారు. భద్రత, సేవాభావానికి ఉత్తర్ ప్రదేశ్ స్పష్టమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, ఈ రోజు ప్రారంభించిన నూతన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రగతి మార్గాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరినీ మరోసారి అభినందించారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ అనాదిబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ , ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు ఈ కార్యక్రమానికి

హాజరయ్యారు.

నేపథ్యం

గత తొమ్మిదేళ్లలో వారణాసి రూపురేఖలను మార్చడం, నగరం, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడంపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ, సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని రూ.1780 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ప్రధాన మంత్రి వారణాసి కంటోన్మెంట్

స్టేషన్ నుంచి గొడోలియా వరకు ప్యాసింజర్ రోప్ వే కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.645 కోట్లు. రోప్ వే వ్యవస్థ ఐదు స్టేషన్లతో 3.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనివల్ల పర్యాటకులు, యాత్రికులు, వారణాసి వాసులకు రాకపోకలు సులభతరం అవుతాయి.

నమామి గంగ పథకం కింద భగవాన్ పూర్ లో రూ.300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న 55 ఎంఎల్ డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా సిగ్రా స్టేడియం పునర్నిర్మాణ 2, 3 దశల పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సేవాపురిలోని ఇసార్వార్ గ్రామంలో నిర్మించనున్న ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. భర్తర గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మారే గదులతో కూడిన ఫ్లోటింగ్ జెట్టీ సహా పలు ఇతర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

జల్ జీవన్ మిషన్ కింద 63 గ్రామ పంచాయతీల్లోని 3 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చే 19 మంచినీటి పథకాలను ప్రధాని అంకితం చేశారు. గ్రామీణ మంచినీటి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, మిషన్ కింద మరో 59 మంచినీటి పథకాలకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

వారణాసి చుట్టుపక్కల గల రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారుల కోసం కార్ఖియాన్ వద్ద నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ లో పండ్లు, కూరగాయల గ్రేడింగ్, సార్టింగ్, ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా ప్రధాని ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇది వారణాసి , పరిసర ప్రాంతాల వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి సహాయపడుతుంది.

వారణాసి స్మార్ట్ సిటీ మిషన్ కింద రాజ్ ఘాట్, మహ్మూర్ గంజ్ ప్రభుత్వ పాఠశాలల పునర్నిర్మాణ పనులు,  అంతర్గత నగర రహదారుల సుందరీకరణ; నగరంలోని 6 పార్కులఅభివృద్ధి, చెరువుల పునర్నిర్మాణం సహా

వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి అంకితం చేశారు.  లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏటీసీ టవర్ , భేలుపూర్ లోని వాటర్ వర్క్స్ ఆవరణలో 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్; కోనియా పంపింగ్ స్టేషన్ వద్ద 800 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్; సారనాథ్ వద్ద కొత్త కమ్యూనిటీ హెల్త్ సెంటర్; చాంద్ పూర్ లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ యొక్క మౌలిక సదుపాయాల మెరుగుదల; కేదారేశ్వర్, విశ్వేశ్వర్, ఓంకారేశ్వర్ ఖండ్ పరిక్రమ తదితర ఆలయాల పునరుద్ధరణ సహా పలు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన అంకితం చేశారు.

 

వారాణసీ తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతాలన్నీ వ్యవసాయాని కి మరియు వ్యవసాయ సంబంధి ఎగుమతుల కు ఒక కేంద్రం వలె మారుతున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారాణసీ లో ఏర్పాటైన ప్రాసెసింగ్, రవాణా మరియు నిలవ సదుపాయాల ను గురించి ఆయన ప్రస్తావించి, ఆ సదుపాయాలు వారాణసీ లో లంగ్ డారకం మామిడి పండ్లు; ఘాజీపుర్ రకం బెండకాయలు’, ‘పచ్చి మిర్చి’; జౌన్ పుర్ రకం ముల్లంగి, ఖర్బూజా’ లు అంతర్జాతీయ బజారుల కు చేరుకోవడానికి నవీన జవసత్త్వాల ను సమకూర్చుతున్నాయన్నారు.

స్వచ్ఛమైన త్రాగునీటి అంశాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంచుకొన్న అభివృద్ధి మార్గం లో సేవ, సానుభూతి .. ఈ రెండూ జతపడ్డాయన్నారు. స్వచ్ఛమైన త్రాగునీటి కి సంబంధించి అనేక పథకాల కు ఈ రోజు న శంకుస్థాపన జరిగింది అంతేకాకుండా వివిధ పథకాల ను ప్రారంభించడమైంది అన్నారు. హర్ ఘర్ నల్ సే జల్’ (అంటే ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటి సరఫరా) ప్రచార ఉద్యమాన్ని గురించి ఆయన ప్రముఖం గా పేర్కొంటూ, దేశం లో 8 కోట్ల కుటుంబాలు గత మూడు సంవత్సరాల లో నల్లా ద్వారా నీటి సరఫరా ను పొందాయని వివరించారు. ఉజ్జ్వల యోజన ను గురించి ఆయన ప్రస్తావిస్తూ, సేవాపురీ లో ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంటు లబ్ధిదారుల కు ప్రయోజనకరం గా ఉండడం ఒక్కటే కాకుండా ఉత్తర్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం లో, బిహార్ లోని పశ్చిమ ప్రాంతం లో గ్యాస్ సిలిండర్ ల సంబంధి అవసరాల ను కూడా తీర్చుతుందని తెలిపారు.

 

 

***

DS/TS



(Release ID: 1910580) Visitor Counter : 121