మంత్రిమండలి
01.01.2023 నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అదనపు వాయిదాను విడుదల చేయడానికి ఆమోదం తెలిపిన క్యాబినెట్
प्रविष्टि तिथि:
24 MAR 2023 9:12PM by PIB Hyderabad
01.01.2023 నుండి అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అదనపు వాయిదాను విడుదల చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ ధరల పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రాథమిక చెల్లింపు/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 38% రేటు కంటే 4% పెరుగుదలను సూచిస్తుంది.
డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి కారణంగా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ.12,815.60 కోట్లుగా ఉంటుంది.
దీని వల్ల దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
ఈ పెరుగుదల 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములర్‌కు అనుగుణంగా ఉంటుంది.
*****
(रिलीज़ आईडी: 1910535)
आगंतुक पटल : 539
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam