ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో వన్వరల్డ్ టిబి సమిట్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


టిబి-ముక్త్ పంచాయత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, ఇది క్షయవ్యాధి నివారణ చికిత్స మరియుకుటుంబం కేంద్రం గా ఉండే సంరక్షణ నమూనా తాలూకు ఒక చిన్నపాటి కార్యక్రమం; దీనిని భారతదేశం అంతటా ఆధికారికంగా అమలుచేయడం జరుగుతుంది

క్షయవ్యాధి కి చోటు ఉండనటువంటి సమాజాన్ని ఆవిష్కరించే దిశ లో భారతదేశం తనవచనబద్ధత ను పునరుద్ఘాటిస్తోంది

2025 వ సంవత్సరాని కల్లా క్షయ ను నిర్మూలించడానికి సంబంధించి భారతదేశం వద్ద అత్యుత్తమమైన ప్రణాళిక, మహత్వాకాంక్షల తో పాటు గొప్పవైన కార్యక్రమాల ను అమలు పరచే వనరులుఉన్నాయి:  స్టాప్ టిబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

‘‘టిబి వంటి ఒక వ్యాధి కి వ్యతిరేకం గా పోరాటం సాగించడం లో ప్రపంచ సంకల్పాలకు కాశీ నూతన శక్తి ని అందిస్తుంది’’

‘‘వన్ వరల్డ్ టిబి సమిట్ ద్వారా భారతదేశం ప్రపంచ హితం సంబంధి మరొకసంకల్పాన్ని నెరవేర్చుతోంది’’

‘‘భారతదేశం యొక్క ప్రయాస లు టిబి పైప్రపంచ యుద్ధాని కి ఒక నవీన నమూనా అని చెప్పాలి’’

‘‘క్షయవ్యాధి కి వ్యతిరేకం గా జరుగుతున్న యుద్ధం లో ప్రజల భాగస్వామ్యం అనేదిభారతదేశం అందిస్తున్న ప్రధానమైన తోడ్పాటు గా ఉంది’’

‘‘2025 వ సంవత్సరాని కల్లా క్షయ ను నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించడం కోసంభారతదేశం ప్రస్తుతం కృషి చేస్తోంది’’

‘‘అన్ని ప్రచార ఉద్యమాలు, నూతన ఆవిష్కరణ లు మరియు భారతదేశం యొక్క ఆధునికసాంకేతిక విజ్ఞానం.. వీటి తాలూకు లాభాన్ని మరిన్ని దేశాలు అందుకోవాలని నేనుకోరుకొంటున్నాను’’

Posted On: 24 MAR 2023 1:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని రుద్రాక్ష్ కన్ వెన్శన్ సెంటర్ లో జరిగిన వన్ వరల్డ్ టిబి సమిట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇండియాస్ ఏన్యువల్ టిబి రిపోర్ట్ 2023 ను ఆయన ఆవిష్కరించారు; దీనితో పాటు టిబి-ముక్త్ పంచాయత్ వంటి పలు కార్యక్రమాల ను సైతం ఆయన ప్రారంభించారు. టిబి ముక్త్ పంచాయత్ అనేది టిబి ప్రివెంటివ్ ట్రీట్ మెంట్ (టిపిటి) యొక్క ఒక చిన్న నమూనా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆధికారికం గా దేశవ్యాప్తం గా అమలు పరచడం జరుగుతుంది. దీని తో పాటు టిబి కోసం ఉద్దేశించిన ఫ్యామిలి-సెంట్రిక్ కేర్ మాడల్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధాన మంత్రి నేశనల్ సెంటర్ ఫార్ డిజీజ్ కంట్రోల్ ఎండ్ హై కంటైన్ మెంట్ లబారటరి కి శంకుస్థాపన చేశారు. అలాగే, మెట్రోపాలిటన్ పబ్లిక్ హెల్థ్ సర్ వేలన్స్ యూనిటు ను వారాణసీ లో కేటాయించిన ప్రదేశాన్ని కూడా ఆయన పరిచయం చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాల కు/కేంద్రపాలిత ప్రాంతాల కు మరియు జిల్లాల కు టిబి ని నిర్మూలించడం లో పురోగతి ని నమోదు చేసినందుకు గాను పురస్కారాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. ఈ పురస్కారాల ను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతం స్థాయి లో కర్నాటక మరియు జమ్ము & కశ్మీర్ లతో పాటు జిల్లా స్థాయి లో నీలగిరీస్, పుల్ వామా, ఇంకా అనంత్ నాగ్ లు అందుకొన్నాయి.

 

ఈ సందర్భం లో స్టాప్ టిబి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లుసికా దితియు మాట్లాడుతూ, ఈ శిఖర సమ్మేళనం ప్రపంచం లో అత్యంత ప్రాచీన నగరాల లో ఒక నగరం అయినటువంటి వారాణసీ లో జరుగుతోంది. ఈ శిఖర సమ్మేళనం ప్రపంచం లో వేయి సంవత్సరాల నాటి నుండి ఉనికి లో ఉన్న ఒక వ్యాధి అయినటువంటి ట్యూబర్ క్యులోసిస్ లేదా టిబి (క్షయవ్యాధి) ని గురించి చర్చించడాని కి ఏర్పాటు చేసిందని వివరించారు. భారతదేశం లో టిబి వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా ఎక్కువ గా ఉంది. అయితే, ఇక్కడ ఎంతో చక్కటి ప్రణాళిక, మహత్వాకాంక్షలతో పాటు అనుకొన్న కార్యక్రమాల ను తిరుగులేని విధం గా ఆచరణ లోకి తీసుకు రావడం జరుగుతోందని ఆమె అన్నారు. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను స్వీకరించడం ప్రపంచం లోని సంక్షేమ చర్యల లో ఒకటి అని చెప్పాలి అని కూడా ఆమె స్పష్టం చేశారు. ఈ శిఖర సమ్మేళనం కోసం ఎంపిక చేసిన ఇతివృత్తం అయిన - ఒకే ప్రపంచం, ఒకే ఆరోగ్యంయొక్క ప్రాముఖ్యాన్ని గురించి ఆమె సభికుల కు వివరించారు. ప్రధాన మంత్రి నాయకత్వం లో టిబి ని 2025 వ సంవత్సరాని కల్లా ఆనవాలు లేకుండా చేయాలి అనే మార్గం లో భారతదేశం పయనిస్తోందని ఆమె అన్నారు. భారతదేశం వంటి దేశాల ప్రయాస ల కారణం గా రోగ నిర్ధారణ సేవలను మరియు క్షయ సంబంధి చికిత్స లను అందుకొంటున్న ప్రజల సంఖ్య చరిత్ర లో మొట్టమొదటిసారి గా 3 మిలియన్ కు లోపే ఉంది అని ఆమె అన్నారు. టిబి కి ఎదురొడ్డి నిలచే ప్రక్రియ మరియు టిబి ఫ్రీ ఇండియా కార్యక్రమాల ను ఆమె ప్రశంసించారు. 2025 వ సంవత్సరం కల్లా టిబి ని భారతదేశం నిర్మూలించగలదన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. న్యూ యార్క్ లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ లో సెప్టెంబర్ 22 వ తేదీ నాడు క్షయవ్యాధి అంశం పై ఐరాస ఉన్నత స్థాయి సమావేశం జరుగనుందని కూడా ఆమె వెల్లడించారు. ఆ సమావేశాని కి ప్రధాన మంత్రి విచ్చేయాలని ఆమె మనవి చేశారు.

 

క్షయవ్యాధి కి వ్యతిరేకం గా సాగుతున్న ఈ సమరం లో ముందు వరుస లో నిలబడి ప్రపంచం లోని ఇతర నాయకుల కు ప్రేరణ ను అందించాలని ప్రధాన మంత్రి కి ఆమె విజ్ఞప్తి చేశారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘వన్ వరల్డ్ టిబి సమిట్వారాణసీ లో జరుగుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు లో ఈ నగరాని కి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. కాశీ నగరం ఒక చిరకాల ప్రవాహం వంటిది, ఈ నగరం వేల సంవత్సరాలు గా మానవ జాతి యొక్క కఠోర శ్రమ మరియు ప్రయాసల కు సాక్షి గా ఉందని ఆయన అన్నారు. ‘‘ఎటువంటి అవరోధం ఎదురైనప్పటికీ కూడాను,సబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నాల)తో సరిక్రొత్త దారుల ను తెరవవచ్చని కాశీ ఎల్లవేళలా నిరూపిస్తూ వచ్చింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్షయ వంటి వ్యాధుల కు వ్యతిరేకం గా జరుగుతూ ఉన్న పోరాటం లో ప్రపంచ సంకల్పాల కు కాశీ నూతన శక్తి ని ప్రసాదించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ఒక దేశం గా భారతదేశం యొక్క ఆదర్శాన్ని వసుదైవ కుటుంబకమ్అనే భావన లో దర్శించవచ్చని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. వసుదైవ కుటుంబకమ్అంటే యావత్తు ప్రపంచం ఒక కుటుంబం అని భావం. ఈ ప్రాచీన సిద్ధాంతం ఈ నాటి పురోగామి ప్రపంచాని కి ఒక ఏకీకృత దృష్టికోణాన్ని, అలాగే ఏకీకృత పరిష్కార మార్గాల ను ప్రసాదిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. జి-20 అధ్యక్ష స్థానం లో ఉన్న భారతదేశం ఈ తరహా విశ్వాసాల పై ఆధారపడి ‘‘ఒకే కుటుంబం, ఒకే ప్రపంచం, ఒకే భవిష్యత్తు’’ ఇతివృత్తాన్ని ఎంపిక చేసుకొందని ఆయన అన్నారు. ‘‘జి20 యొక్క ఇతివృత్తం పూర్తి ప్రపంచం తాలూకు ఉమ్మడి భవిష్యత్తు కు సంబంధించిన సంకల్పం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యందృష్టికోణం తో భారతదేశం ఈ ప్రపంచం లో ముందంజ వేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. వన్ వరల్డ్ టిబి సమిట్ ను నిర్వహించడం ద్వారా ప్రపంచ హితం తాలూకు సంకల్పాల ను భారతదేశం చేతల లో చూపిస్తోంది అని ఆయన నొక్కిచెప్పారు.

 

2014 వ సంవత్సరం తరువాతి కాలం లో క్షయవ్యాధి కి ఎదురొడ్డి నిలవడం లో భారతదేశం చాటుతూ వచ్చిన నిబద్ధత మరియు దృఢనిశ్చయం మునుపు ఎన్నడు ఎరుగని రీతి లో ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం చేస్తున్న కృషి ముఖ్యమైంది. ఎందుకంటే, ఇది క్షయవ్యాధి పై ప్రపంచవ్యాప్తం గా జరుగుతున్న యుద్ధాని కి ఒక క్రొత్త నమూనా గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన 9 సంవత్సరాల లో క్షయవ్యాధి కి వ్యతిరేకం గా అనుసరిస్తూ వచ్చిన బహుముఖ వైఖరి ని గురించి ఆయన వివరించారు. ప్రజల భాగస్వామ్యం, పోషణ సంబంధి జ్ఞానాన్ని వివరించడం కోసం ప్రత్యేక ఉద్యమం, చికిత్స కై కొంగొత్త పద్ధతులు, సాంకేతిక విజ్ఞానాన్ని అధికంగా వినియోగించుకోవడం, వెల్ నెస్ పట్ల వ్యాధి నివారణ పట్ల శ్రద్ధ ను పెంచడం తో పాటు ఫిట్ ఇండియా, యోగ, ఖేలో ఇండియా వంటి ప్రచార ఉద్యమాల ద్వారా క్షయవ్యాధి నివారణ కు పాటుపడడాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.

 

ప్రజల భాగస్వామ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘ని-క్షయ్ మిత్ర్ ప్రచార ఉద్యమంటిబి రోగుల కు సాయపడుతోందని పేర్కొన్నారు. దాదాపు గా 10 లక్షల మంది టిబి వ్యాధిగ్రస్తుల ను పౌరులు దత్తత తీసుకొన్నారు, పదేళ్లు- పన్నెండేళ్ల వయస్సు కలిగిన బాలలు సైతం ఈ విషయం లో ముందడుగు వేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగం గా క్షయ రోగుల కు అందిస్తున్న ఆర్థిక సహాయం ఒక వేయి కోట్ల రూపాయల వరకు చేరుకొందని ఆయన వివరించారు. ఈ ఉద్యమం ప్రేరణ ను ఇచ్చేదిగా ఉందని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమం లో ప్రవాసీ భారతీయులు కూడా పాలుపంచుకొంటున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

 

క్షయ (టిబి) రోగులకు పౌష్టికాహారం అందించడం ప్రధాన సవాల్ గా పేర్కొంటూ, టిబి రోగులకు సహాయం చేయడంలో ని-క్షయ్ మిత్ర క్యాంపెయిన్ పాత్రను ప్రధాన మంత్రి ప్రముఖంగా వివరించారు. 2018లో ప్రభుత్వం టీబీ రోగుల కోసం ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) పథకాన్ని ప్రకటించిందని, ఫలితంగా వారి చికిత్స కోసం సుమారు రూ.2000 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయని, దీని ద్వారా సుమారు 75 లక్షల మంది టీబీ రోగులు లబ్ధి పొందారని వివరించారు. "ని-క్షయ్ మిత్రలు ఇప్పుడు టిబి రోగులందరికీ ఒక కొత్త శక్తి వనరుగా మారారు " అని ప్రధాన మంత్రి అన్నారు. కాలం చెల్లిన పద్ధతులను ఆచరించడం ద్వారా కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా కష్టమని పేర్కొన్న ప్రధాన మంత్రి, టిబి రోగులు చికిత్స నుండి వైదొలగకుండా ప్రభుత్వం కొత్త వ్యూహాలతో పనిచేసిందని అన్నారు. టీబీ స్క్రీనింగ్, చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించడం, దేశంలో టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్యను పెంచడం, టీబీ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలను లక్ష్యంగా చేసుకుని ప్రాంతాల వారీగా పని విధానాలను రూపొందించడం వంటి ఉదాహరణలను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే తరహాలో నేడు 'టీబీ ముక్త్ పంచాయత్ అభియాన్' పేరుతో కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు.

టీబీ నివారణకు 6 నెలల కోర్సుకు బదులుగా 3 నెలల చికిత్సా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు. గతంలో రోగులు రోజుకు 6 నెలల పాటు మందులు తీసుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు కొత్త విధానంలో రోగి వారానికి ఒకసారి మాత్రమే మందులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

 

క్షయ రహిత భారత దేశం (టీబీ ఫ్రీ ఇండియా) క్యాంపెయిన్ లో సాంకేతికత అనుసంధానం (టెక్ ఇంటిగ్రేషన్) గురించి ప్రధాన మంత్రి తెలియచేస్తూ, ఈ విషయంలో ని-క్షయ్ పోర్టల్, డేటా సైన్స్ వినియోగం ఎంతగానో దోహద పడుతున్నాయన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ-ఐసిఎంఆర్ సబ్-నేషనల్ డిసీజ్ నిఘా కోసం ఒక కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిందని, ఇది డబ్ల్యూహెచ్ఓతో పాటు ఈ రకమైన నమూనాను కలిగి ఉన్న ఏకైక దేశంగా భారతదేశాన్ని మార్చిందని ఆయన అన్నారు.

 

క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కర్ణాటక, జమ్ముకశ్మీర్ లకు ఈ రోజు అవార్డు రావడం గురించి మాట్లాడుతూ, 2030 ప్రపంచ లక్ష్యానికి భిన్నంగా 2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించడానికి భారతదేశం చేసిన మరో ప్రధాన తీర్మానాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మహమ్మారి సమయంలో సామర్ధ్యం , ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపును ప్రస్తావిస్తూ, వ్యాధిపై పోరాటంలో ట్రేస్, టెస్ట్, ట్రాక్, ట్రీట్ , టెక్నాలజీని అధికంగా

ఉపయోగించినట్టు ప్రధాన మంత్రి చెప్పారు. "భారతదేశ ఈ ప్రాంతీయ దృక్పథం లో భారీ ప్రపంచ సామర్థ్యం ఉంది" అని ఆయన అన్నారు, ఆ సామర్థ్యాన్ని సమిష్టిగా ఉపయోగించ వలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 80 శాతం టీబీ మందులు భారత్ లోనే తయారవుతున్నాయని తెలిపారు. ‘భారతదేశ ఇటువంటి ప్రచార కార్యక్రమాలు,ఆవిష్కరణలు ,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి మరిన్ని దేశాలు ప్రయోజనాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ ఇందుకు ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. మా ఈ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను - అవును, మనం టిబిని అంతం చేయగలం" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

కుష్టువ్యాధి నిర్మూలనకు మహాత్మాగాంధీ చేసిన కృషిని గుర్తు చేస్తూ, అహ్మదాబాద్ లో కుష్టువ్యాధి ఆసుపత్రిని ప్రారంభించడానికి గాంధీజీని పిలిచినప్పుడు జరిగిన ఒక సంఘటనను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా పంచుకున్నారు. తలుపులకు తాళం వేలాడుతూ కనిపిస్తే సంతోషిస్తానని గాంధీజీ ఈ సందర్భంగా అక్కడున్న వారితో చెప్పారని ప్రధాని గుర్తు చేశారు.

దశాబ్ధాల తరబడి ఆసుపత్రి ఇలాగే కొనసాగిందని, కుష్టువ్యాధికి అంతం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.

కుష్టువ్యాధికి వ్యతిరేకంగా 2001లో గుజరాత్ ప్రజలు తనకు అవకాశం ఇచ్చారని, గుజరాత్ లో కుష్టువ్యాధి రేటు 23 శాతం నుంచి 1 శాతం కంటే తక్కువకు తగ్గిందని తెలిపారు. 2007లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుష్టువ్యాధి ఆసుపత్రిని మూసివేశారని గుర్తు చేశారు. ఇందులో సామాజిక సంస్థల పాత్ర, ప్రజల భాగస్వామ్యం గురించి కూడా ఆయన ప్రస్తావించారు అలాగే టిబికి వ్యతిరేకంగా భారతదేశం విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "నేటి నవ భారతం తన లక్ష్యాలను సాధించడంలో ప్రసిద్ధి చెందింది" అని ప్రధాన మంత్రి అన్నారు బహిరంగ మలవిసర్జన రహితంగా ఉండాలనే ప్రతిజ్ఞను సాధించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం, నిర్ణీత శాతం పెట్రోల్ లో ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని నిర్ణీత సమయానికి ముందే సాధించడం ఇందుకు ఉదాహరణలుగా పేర్కొన్నారు.

"ప్రజా భాగస్వామ్యం శక్తి యావత్ ప్రపంచం విశ్వాసాన్ని పెంచుతోంది", అని ఆయన వ్యాఖ్యానించారు. టిబికి వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం కారణమని ఆయన పేర్కొన్నారు. టీబీ రోగులకు వ్యాధిపై అవగాహన కల్పించడంపై అందరూ సమాన శ్రద్ధ చూపాలని కోరారు.

 

కాశీలో కూడా ఆరోగ్య సేవల విస్తరణకు తీసుకున్న చర్యలను ప్రధాని వివరించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారణాసి శాఖను ఈ రోజు ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ సర్వైలెన్స్ యూనిట్ కూడా పనిచేయడం ప్రారంభించింది. బి హెచ్ యు లోని చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్, బ్లడ్ బ్యాంకుల ఆధునీకరణ, మోడ్రన్ ట్రామా సెంటర్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 70 వేల మందికి పైగా రోగులు చికిత్స పొందిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్ గురించి కూడా ప్రధాని తెలిపారు.

కబీర్ చౌరా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, డయాలసిస్ సౌకర్యాలు, సిటి స్కాన్ సౌకర్యాలు, కాశీ గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవల విస్తరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. వారణాసిలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద 1.5 లక్షల మందికి పైగా రోగులకు ఉచిత చికిత్స లభించింది. 70 కి పైగా జన ఔషధి కేంద్రాలు రోగులకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయి.

 

ప్రసంగాన్ని ముగిస్తూ, అనుభవం, నైపుణ్యం ,సంకల్ప శక్తిని ఉపయోగించడం ద్వారా టిబిని నిర్మూలించే ప్రచారంలో భారతదేశం నిమగ్నమై ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. అవసరమైన ప్రతి దేశానికి సహాయం చేయడానికి భారతదేశం నిరంతరం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 'సబ్ కా ప్రయాస్ (అందరి కృషి)తోనే టీబీకి వ్యతిరేకంగా మా ఉద్యమం విజయవంతమవుతుంది.

ఈ రోజు మన ప్రయత్నాలు మన సురక్షిత భవిష్యత్తు పునాదిని బలోపేతం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను, మన భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అప్పగించే స్థితిలో మనం ఉంటాము" అని ప్రధాన మంత్రి ముగించారు.

 

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ అనాదిబెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రిజేష్ పాఠక్, స్టాప్ టిబి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ లూసికా డిటియు తదితరులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం

సందర్భంగా ప్రధాన మంత్రి ఒక ప్రపంచ టీబీ సమ్మిట్ ను ఉద్దేశించి

ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, స్టాప్ టీబీ భాగస్వామ్యం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. 2001 లో ఏర్పాటయిన స్టాప్ టిబి పార్టనర్ షిప్ అనేది ఐక్యరాజ్యసమితి నిర్వహించే ఒక సంస్థ, ఇది టిబి బారిన పడిన ప్రజలు, కమ్యూనిటీలు , దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

 

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి టీబీ ముక్త్ పంచాయత్ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలను ప్రారంభించారు. షార్ట్ టిబి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ (టిపిటి) అధికారిక పాన్-ఇండియా విడుదల; టిబి కోసం కుటుంబ-కేంద్రీకృత సంరక్షణ నమూనా, భారతదేశ వార్షిక టిబి నివేదిక 2023 విడుదల. టీబీని అంతమొందించే దిశగా పురోగమించినందుకు ఎంపిక చేసిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలకు అవార్డుల ప్రదానంలో ప్రధాన మంత్రి పాల్గొన్నారు.

 

మార్చి 2018లో, న్యూఢిల్లీలో జరిగిన ఎండ్ టిబి సమ్మిట్ సందర్భంగా, నిర్ణీత సమయం కంటే ఐదు సంవత్సరాలు ముందుగా, 2025 నాటికి టిబి సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ప్రధాన మంత్రి భారతదేశానికి పిలుపునిచ్చారు. దేశం తన టిబి నిర్మూలన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు సాగుతున్నప్పుడు లక్ష్యాలను మరింత చర్చించడానికి ఈ ప్రపంచ టిబి సమ్మిట్ ఒక అవకాశాన్ని అందించింది. జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమాల నుండి నేర్చుకున్న విషయాలను ప్రదర్శించడానికి కూడా ఇది ఒక అవకాశం. ఈ సదస్సుకు 30 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులు హాజరు అవుతున్నారు.

 

 

***

DS/TS


(Release ID: 1910346) Visitor Counter : 239