వ్యవసాయ మంత్రిత్వ శాఖ
తొలి అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఢిల్లీలో నిర్వహించినందుకు భారత ప్రధానమంత్రిని ప్రశంసించిన కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయానా అధ్యక్షుడు డాక్టర్ మహమద్ ఇర్ఫాన్ ఆలీ
Posted On:
18 MAR 2023 12:21PM by PIB Hyderabad
కీలకాంశాలు
ప్రపంచ ప్రధాన సవాలు అయిన ఆహార అభద్రత సవాలును పరిష్కరించడంలో ఈ సమావేశం సహాయకారి అవుతుందని తన వీడియో సందేశంలో పేర్కొన్న డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ
ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ - ఐవైఒఎం) గా ప్రకటించినందుకు గౌరవార్ధంగా తమ దేశంలో ప్రత్యేకంగా చిరుధాన్యాలను పండించేందుకు 200 ఎకరాల భూమిని ఇస్తానన్న డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ
మిరెకిల్ మిల్లెట్స్ (ఉప్పు భూమిలో పండే చిరుధాన్యాలు) ఉత్పత్తి, ప్రోత్సాహం కోసం ప్రపంచ ప్రభుత్వాలను, విధానకర్తలను ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల సదస్సు ఉత్సాహపరుస్తుందని మరొక వీడియో సందేశంలో పేర్కొన్న ఇథియోపియా అధ్యక్షురాలు సాహ్లె వర్క్ జెవ్దే
ఇథియోపియా వంటి ఉప సహారా దేశంలోనే కాకుండా మొత్తం ఆఫ్రికా ఖండంలో ఆహార భద్రతా సవాళ్ళను పరిష్కరించడంలో చిరుధాన్యాలు అత్యంత సహాయకారి అవుతాయన్న సహ్లె వర్క్ జెవ్దె
తొలి అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సులోని భావనలు 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రూపుదిద్దేందుకు కూడా తోడ్పడతాయిః సహ్లె వర్క్ జెవ్దె
తొలి అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును న్యూఢిల్లీలోని పియుఎస్ఎ (పూసా)లో నిర్వహించినందుకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీని కొనియాడుతూ, ప్రపంచ ప్రధాన సవాలు అయిన ఆహార అభద్రతను పరిష్కరించడంలో ఈ సదస్సు సహాయకారిగా ఉంటుందని శనివారంనాడు అభిప్రాయపడ్డ కోఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గుయానా అధ్యక్షుడు డాక్టర్ మహమద్ ఇర్ఫాన్ ఆలీ.
గుయానా నుంచి వీడియో సందేశం ఇస్తూ, ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ - ఐవైఒఎం) గా ప్రకటించినందుకు గౌరవార్ధంగా తమ దేశంలో ప్రత్యేకంగా చిరుధాన్యాలను పండించేందుకు 200 ఎకరాల భూమిని ఇస్తానన్న డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ . ఇందుకు బదులుగా ఈ అద్భుత ఆహారపు పంట ఉత్పత్తిని, ఉత్పాదనను భారతదేశం సాంకేతికతను, సాంకేతిక మద్దతును ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
చిరుధాన్యాలు అందుబాటు ధరలో ఉండటమే కాక పౌష్టికాహార ఎంపిక అని, అంతేకాక ఇవి వాతావరణ మార్పుల సమయంలో కూడా స్థితిస్థాపకంగా ఉంటాయని డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ అన్నారు. మొత్తం 17 కెరేబియన్ దేశాలలో చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రోత్సహానికి తోడ్పాటునిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తత్ఫలితంగా కెరేబియన్ సమాజంలో చిరుధాన్యాలు ప్రాచుర్యంలోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
చిరుధాన్యాల ఉత్పత్తి, ఎగుమతులలో కూడా భారత్ ప్రపంచ నాయకుడిగా ఉందని, చిరుధాన్యాల అంతర్జాతీయ ఉత్పత్తి, ప్రాచుర్యంలో ప్రధాన పాత్ర పోషించగలదని డాక్టర్ ఇర్ఫాన్ ఆలీ అన్నారు.
మరొక వీడియో సందేశంలో ఇథియోపియా అధ్యక్షురాలు సహ్లె వర్క్ జెవ్దె మాట్లాడుతూ, చిరుధాన్యాల పై అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నందుకు ప్రధానమంత్రి మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈ అద్భుత చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రోత్సాహానికి ప్రపంచ ప్రభుత్వాలను, విధానకర్తలను ఉత్సాహపరుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇథియోపియా వంటి ఉప సహారా దేశానికే కాక మొత్తం ఆఫ్రికా కండంతో పాటు ప్రపంచ ఆహార భద్రతా సవాళ్ళను పరిష్కరించడంలో చిరుధాన్యాలు అత్యంత సహాయకారిగా ఉండగలవని సహ్లె వర్క్ జెవ్దె అన్నారు. ఈ సదస్సు నుంచి వచ్చిన భావనలు 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను రూపకల్పన చేయడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.
***
(Release ID: 1908447)
Visitor Counter : 193