శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రయోగశాల, పరిశ్రమ మరియు మార్కెట్‌లో రైతులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు: డా. ఎన్. కలైసెల్వి,డిజీ,సిఎస్‌ఐఆర్
Posted On:
17 MAR 2023 8:47AM by PIB Hyderabad
హర్యానాలోని గురుగ్రామ్ విశ్వవిద్యాలయంలో మార్చి 15-16 తేదీల్లో "సైన్స్ కాన్క్లేవ్ మరియు ఆగ్రో-టెక్ ఎక్స్‌పో 2023" నిర్వహించబడింది. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చిన అపూర్వ కార్యక్రమం ఇది. ఈ సైన్స్ కాన్‌క్లేవ్‌లో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, విద్యార్థులు, రైతులు, పారిశ్రామికవేత్తలు మరియు టెక్నాలజీ డెవలపర్లు చురుకుగా పాల్గొన్నారు. గురుగ్రామ్ విశ్వవిద్యాలయం సిఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ & పాలసీ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్), న్యూఢిల్లీ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, హర్యానా సహకారంతో ఈ చాలా ఉపయోగకరమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉన్నత్ భారత్ అభియాన్ (యూబీఏ) మరియు విజ్ఞాన భారతి (విభా) ఈ కార్యక్రమానికి విజ్ఞాన భాగస్వాములుగా ముందుకు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మరియు స్థిరమైన అభివృద్ధి కోసం రైతులు మరియు విద్యార్థులకు సిఎస్‌ఐఆర్ సాంకేతికతలను పరిచయం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. కార్యక్రమానికి వచ్చిన విశిష్ట అతిథులు ఎగ్జిబిషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.
గురుగ్రామ్ యూనివర్శిటీలో జరిగిన సైన్స్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగిస్తున్న సిఎస్‌ఐఆర్ డిజీ డాక్టర్ ఎన్. కలైసెల్వి
భారత ప్రభుత్వ డిఎస్‌ఐఆర్ కార్యదర్శి & సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డా.ఎన్.కళైసెల్వి ప్రారంభ సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా డాక్టర్ కైలాష్ చంద్ర శర్మ, వైస్ చైర్మన్, హర్యానా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, పంచకుల, హర్యానా; ప్రొ. రంజన అగర్వాల్, డైరెక్టర్, సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్, న్యూఢిల్లీ; మరియు ప్రో. దినేష్ కుమార్, ప్రోగ్రాం చైర్మన్, గురుగ్రామ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌లు హాజరయ్యారు.
కార్యక్రమంలో డాక్టర్ కలైసెల్వి ప్రసంగిస్తూ..ప్రయోగశాల, పరిశ్రమ మరియు మార్కెట్‌లో రైతులు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పరిశోధన మరియు సాంకేతికత వినియోగం/సామాన్యులకు వర్తించే వాటిపై ఆమె ప్రధాని దృష్టి సారించారు.ఈ సందర్భంగా రైతులకు అండగా నిలిచిన నిర్వాహకులను ఆమె అభినందించారు. అన్ని సీఎస్‌ఐఆర్ ల్యాబ్‌లు వన్ వీక్ వన్ ల్యాబ్ ప్రచారం చేస్తున్నాయని ఆమె తెలిపారు. సమీపంలోని సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లోని శాస్త్రవేత్తలతో మాట్లాడటానికి వారితో కరచాలనం చేయడానికి మరియు సైన్స్‌లో అనేక విషయాలను తెలుసుకోవడానికి ఆమె ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను ప్రేరేపించారు.
ప్రొ. రంజన అగర్వాల్, డైరెక్టర్, సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్
గురుగ్రామ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.దినేష్ కుమార్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమం రైతులు మరియు విద్యార్థులు మొదలైన ఆసక్తిగల వాటాదారుల మధ్య శాస్త్ర మరియు సాంకేతికతతో వారి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి వీలు కల్పించే వాతావరణాన్ని అందించడానికి ఉద్దేశించబడిందని చెప్పారు.సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్. రంజన అగర్వాల్ సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ లక్ష్యాలను చర్చించారు మరియు ఈ సైన్స్ కాన్క్లేవ్ & ఆగ్రో-టెక్ ఎక్స్‌పో వెనుక ఉన్న భావన మరియు ఆలోచనను వివరించారు.
విజ్ఞాన భారతి మెంటర్ డాక్టర్ శంకర్ రావు తత్వవాడి మరియు హర్యానా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కైలాష్ చంద్ర శర్మ కూడా ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆగ్రో-టెక్ ఎక్స్‌పోలో సిఎస్‌ఐఆర్‌కు చెందిన 8 ల్యాబ్‌లు తమ సాంకేతికతలు మరియు ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ ఎక్స్‌పో రైతులతో పాటు విద్యార్థులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎక్స్‌పోలోని స్టాల్స్‌లో రైతులు అత్యాధునిక పంట రకాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు వివిధ సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో అభివృద్ధి చేసిన అత్యాధునిక పరికరాల గురించి తెలుసుకున్నారు.
సైంటిస్ట్ అండ్ ఫార్మర్ ఇంటరాక్షన్, రూరల్ డెవలప్‌మెంట్ & ఆత్మనిర్భర్ భారత్‌పై ఫోకస్ చేసిన టెక్నికల్ సెషన్‌లతో పాటు సైన్స్ మెంటలిజం షో, సైన్స్ కార్టూన్ షో, సౌర్ మండల్ కి సైర్‌పై ప్రత్యేక ఉపన్యాసం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎక్స్‌పో ప్రాంతంలో పప్పెట్ షో మరియు స్టాల్స్‌ను వీక్షిస్తున్న ప్రముఖులు
సిఎస్‌ఐఆర్ ప్రముఖ సైన్స్ మ్యాగజైన్‌లు 'సైన్స్ రిపోర్టర్' (ఇంగ్లీష్) మరియు 'విజ్ఞాన్ ప్రగతి' (హిందీ) ఆవిష్కరణలు మరియు మిల్లెట్ సంవత్సరంపై ప్రత్యేక సంచికలను ప్రచురించాయి. సైన్స్ కాన్క్లేవ్ సందర్భంగా సిఎస్‌ఐఆర్ డిజి డా. ఎన్. కలైసెల్వి;వీసి, గురుగ్రామ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. దినేష్ కుమార్; డైరెక్టర్, సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపీఆర్ ప్రొఫెసర్. రంజనా అగర్వాల్,జేఎస్, సిఎస్‌ఐఆర్ డాక్టర్ మహేంద్ర గుప్తా మరియు ఇతర అతిథులు మార్చి 2023 సంబంధించిన రెండు సైన్స్ మ్యాగజైన్‌ల సంచికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఈ పత్రికల సంపాదకులు శ్రీ హసన్ జవైద్ ఖాన్ మరియు డాక్టర్ మనీష్ మోహన్ గోర్ కూడా పాల్గొన్నారు.
సిఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రముఖ సైన్స్ మ్యాగజైన్స్ సైన్స్ రిపోర్టర్ మరియు విజ్ఞాన్ ప్రగతి విడుదల
కార్యక్రమంలో ‘సుస్థిర అభివృద్ధి’పై ‘ఆన్ ది స్పాట్ పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్’, విద్యార్థుల కోసం ‘ఆత్మనిర్భర్ భారత్’పై సైన్స్ మోడల్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. సైన్స్ కాన్‌క్లేవ్ జరిగిన రెండు రోజులూ పప్పెట్ షో నిర్వహించారు. తోలుబొమ్మల నిపుణుడు శ్రీ నారాయణ్ శ్రీవాస్తవ రోజువారీ జీవితంలోని విభిన్న కథల ఆధారంగా అనేక బొమ్మల ప్రదర్శనలను ప్రదర్శించారు. తోలుబొమ్మల ప్రదర్శనను ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారు.
వైభవోత్సవ సభలో ప్రముఖులు
16 మార్చి, 2023న స్టార్టప్ ఒడిశా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఓంకార్ రాయ్ మరియు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ,సిసిఆర్‌యుఎం డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అసిమ్ అలీ ఖాన్ సదస్సులో పాల్గొన్నారు. చుట్టుపక్కల జిల్లాల నుండి వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, రైతులు మరియు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.
<><><><><>
(Release ID: 1908079)
Visitor Counter : 128