ప్రధాన మంత్రి కార్యాలయం
రక్షణ రంగం లో భారతదేశాన్ని స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దడం కోసం అదే పని గా సాగుతున్న ప్రయాసల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
17 MAR 2023 12:46PM by PIB Hyderabad
భారతదేశం లో రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధం గా తీర్చిదిద్దడం కోసం అదే పని గా సాగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. రక్షణ రంగం లో స్వయంసమృద్ధి కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం అంటే అది భారతదేశం లోని ప్రతిభావంతుల పట్ల మన విశ్వాసాన్ని పునరుద్ఘాటించేదే అని ఆయన అన్నారు.
70,500 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనల తో పాటు ఆర్థిక సంవత్సరం 23 లో 2.71 లక్షల కోట్ల రూపాయల కు పైగా ప్రభుత్వ కొనుగోళ్ళ కు ఆమోదం తెలపడం (వీటిలో 99 శాతం కొనుగోళ్ళ ను భారతదేశ పరిశ్రమల నుండే సేకరించడం జరుగుతుంది) ద్వారా భారతదేశం రక్షణ రంగాన్ని స్వయంసమృద్ధి కలిగినటువంటిది గా తీర్చిదిద్దడం కోసం నిరంతర ప్రయాస జరుగుతున్నది అంటూ రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేశారు. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘రక్షణ రంగం లో స్వయంసమృద్ధి కి ఉత్తేజాన్ని ఇవ్వడం భారతదేశం లో గల ప్రతిభ పట్ల మన విశ్వాసాన్ని రూఢిపరచేదే.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1908004)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam