ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్-బంగ్లా ‘ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌’కు వర్చువల్ మార్గంలో


రెండు దేశాల ప్రధాన మంత్రులసంయుక్త ప్రారంభోత్సవం

Posted On: 16 MAR 2023 6:55PM by PIB Hyderabad

  భారత్-బంగ్లా ‘ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌’కు 2023 మార్చి 18న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు రెండు దేశాల ప్రధానమంత్రులు శ్రీ నరేంద్ర మోదీ, షేక్‌ హసీనా వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా సంయుక్త ప్రారంభోత్సవం చేస్తారు. ఇది రెండు దేశాల సరిహద్దుల మీదుగా నిర్మించనున్న తొలి ఇంధన పైప్‌లైన్‌ కావడం ఈ సందర్భంగా గమనార్హం. భారత కరెన్సీలో రూ.377 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో  బంగ్లాదేశ్‌ వాటా రూ.285 కోట్లు కాగా, భారత్‌ ఆ మొత్తాన్ని తనవాటా ఆర్థిక సాయం కింద అందజేస్తుంది.

   ఈ పైప్‌లైన్‌ ఏడాదికి మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటిపిఎ) హై స్పీడ్‌ డీజిల్‌ రవాణా సామర్థ్యంగలది కాగా, తొలివిడతలో ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఏడు జిల్లాలకు ఇంధన సరఫరా చేస్తుంది. బారత్‌ – బంగ్లాదేశ్‌ ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌ కార్యకలాపాల ప్రారంభంతో భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు సుస్థిర, విశ్వసనీయ, చౌక, పర్యావరణహిత రవాణా పద్ధతిలో హై స్పీడ్‌ డీజిల్‌ సరఫరా అవుతుంది. దీంతోపాటు రెండు దేశాల మధ్య ఇంధన భద్రత సహకారం మరింత విస్తరిస్తుంది.

*****



(Release ID: 1907981) Visitor Counter : 136