ఉక్కు మంత్రిత్వ శాఖ
పీఎల్‌ఐ పథకం కింద ఎంపిక చేసిన కంపెనీలతో మార్చి 17న ఎంఓయుపై సంతకం చేయనున్న ఉక్కు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
16 MAR 2023 4:23PM by PIB Hyderabad
ప్రత్యేకమైన స్పెషాలిటీ స్టీల్ కోసం పీఎల్‌ఐ పథకం కింద ఎంపిక చేసిన కంపెనీలతో ఉక్కు మంత్రిత్వ శాఖ మార్చి 17, 2023 (శుక్రవారం) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా సంస్థలతో ఏర్పాటు చేసుకున్న అవగాహన ఒప్పందంపై (ఎంఓయుపై) సంతకం చేయనుంది. ఈ సందర్భంగా 20 సబ్ కేటగిరీలను కవర్ చేసే 27 కంపెనీల నుంచి 57 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కేంద్ర ఉక్కు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం, సింధియా, ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
****
(रिलीज़ आईडी: 1907808)
आगंतुक पटल : 180