రక్షణ మంత్రిత్వ శాఖ
ఎక్సర్‌సైజ్ సీ డ్రాగన్ 23
Posted On:
16 MAR 2023 9:32AM by PIB Hyderabad
"ఎక్సర్‌సైజ్ సీ డ్రాగన్ 23"లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన పీ8I విమానం 14 మార్చి 23న అమెరికాలోని గ్వామ్‌కు చేరుకుంది. దీర్ఘ పరిధి ఎంఆర్ ఏఎస్‌డబ్ల్యూ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం అమెరికా నౌకాదళం నిర్వహించే ఉమ్మడి, బహుళాంశిక విన్యాసాల మూడో ఎడిషన్ ఇది.
మార్చి 15-30 తేదీల్లో విన్యాసాలు సాగుతాయి. సమన్వయంతో కూడిన, జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విన్యాసాలను పాల్గొనే దేశాలు ప్రదర్శిస్తాయి. అధునాతన ఏఎస్‌డబ్ల్యూ డ్రిల్‌ను చేర్చడం వల్ల ఈ విన్యాసాల సంక్లిష్టత, పరిధిని గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా పెరిగింది.
నీటి అడుగున ఉన్న లక్ష్యాలను గుర్తించడంలో యుద్ధ విమాన సామర్థ్యాలను ఈ విన్యాసాలు పరీక్షిస్తాయి, అదే సమయంలో నైపుణ్యాన్ని కూడా పరస్పరం పంచుకుంటాయి. అమెరికా నౌకాదళానికి చెందిన పీ8ఏ, జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి పీ1, రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి సీపీ 140, ఆర్‌వోకేఎన్ నుంచి పీ3సీతో పాటు భారతీయ నౌకాదళం నుంచి పీ8I ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబద్ధతపై ఆధారపడి, మిత్రదేశాల నౌకాదళాల మధ్య ఉన్నత స్థాయి సమన్వయాన్ని సాధించడం ఈ విన్యాసాల లక్ష్యం.
****
(Release ID: 1907596)
Visitor Counter : 225