ఉక్కు మంత్రిత్వ శాఖ
బిజినెస్ ఉమెన్ ఎక్స్‌పో 2023లో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని జరుపుకున్న ఎన్‌ఎండిసి
Posted On:
15 MAR 2023 12:04PM by PIB Hyderabad
మిల్లెట్‌లను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్ ఉమెన్ ఎక్స్‌పో 2023లో ఎన్‌ఎండిసి సూపర్‌ఫుడ్‌ను పంపిణీ చేసింది. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023 నేపథ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలను మిల్లెట్ వ్యాపారాలను నిర్మించడానికి మరియు దేశ ఆహార భద్రతకు దోహదపడేలా ఎన్‌ఎండిసి ప్రేరేపించింది. కంపెనీ తరపున శ్రీ కె ప్రవీణ్ కుమార్, ఈడి (పర్సనల్ అండ్ లా) మరియు సిజిఎం (పర్సనల్) శ్రీ కె మోహన్ మిల్లెట్‌లను పంపిణీ చేశారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం దాని ప్రయోజనాలపై కార్యక్రమంలో పాల్గొన్న వారితో సంభాషించారు.

భారత ప్రభుత్వం పిలుపు మేరకు 2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ క్రమంలో మిల్లెట్ల వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో ఎన్‌ఎండిసి ఇటీవల ఐఐఎంఆర్ గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు చెందిన అహోబిలం ఫుడ్స్‌ను స్మార్ట్ ఫుడ్‌గా - మిల్లెట్స్‌పై సెషన్‌ను నిర్వహించడానికి ఆహ్వానించింది. సెషన్ తరువాత మిల్లెట్ లంచ్ జరిగింది. సిపిఎస్‌ఈ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అవగాహన కల్పించడానికి వాటాదారులతో నిమగ్నమై ఉంది. ప్రజా ప్రాముఖ్యత ఉన్న ప్లాట్‌ఫారమ్‌లలో మిల్లెట్‌లను పంపిణీ చేస్తోంది.
*****
(Release ID: 1907222)
Visitor Counter : 111