గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
భూమి సంవాద్ IV: "నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటలైజింగ్ అండ్ జియోరెఫరెన్సింగ్ ఇండియా విత్ భూ-ఆధార్" (యూఎల్‌పీఐఎన్)
Posted On:
15 MAR 2023 4:02PM by PIB Hyderabad
భూమికి విశిష్ట భూ గుర్తింపు సంఖ్య (యూఎల్‌పీఐఎన్) లేదా భూ-ఆధార్ అమలుపై "నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటలైజింగ్ అండ్ జియోరెఫరెన్సింగ్ ఇండియా విత్ భూ-ఆధార్" (యూఎల్‌పీఐఎన్) - భూమి సంవాద్ IVను 17 మార్చి 2023న న్యూదిల్లీలో భూ వనరుల విభాగం నిర్వహిస్తోంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ శాఖ సహాయ మంత్రులు శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, సాధ్వి నిరంజన్ జ్యోతి, శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ కూడా హాజరవుతారు.
మూడు సెషన్లుగా ఈ సదస్సు సాగుతుంది:
i) “భూమి రికార్డుల సమాచారం, మాతృభూమి ప్రజాస్వామ్యీకరణ
ii) “సులభతర వాణిజ్యం (ఈవోడీబీ), జీవన సౌలభ్యంలో భూ-ఆధార్ పాత్ర
iii) జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్తమ పద్ధతులు (జియోరెఫరెన్సింగ్/సర్వే/ భూ-ఆధార్ వినియోగం, ముందుక తీసుకెళ్లడం)
వివిధ కేంద్ర, రాష్ట్ర/యూటీ ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రాంతీయ సంస్థలు, వ్యాపార సంఘాలు, పౌర సమాజం, సెంటర్ ఫర్ ల్యాండ్ గవర్నెన్స్, జియోస్పేషియల్ వరల్డ్, ఎరిస్ ఇండియా టెక్నాలజీస్, మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫారెస్ట్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ రూర్కీ, మ్యాప్‌మైఇండియా సహా ఇతర సంబంధిత వర్గాల వారు ఈ సదస్సులో పాల్గొంటారు. కింది ప్రధానాంశాలపై సదస్సులో చర్చలు ఉంటాయి:
i) భూ భాగాలు/కాడాస్ట్రల్ మ్యాప్‌ల భౌగోళిక స్థితి, భూ-ఆధార్ తయారీ, దాని సంతృప్తత కోసం యుద్ధప్రాతిపదిక వ్యూహం.
ii) ప్రయోజనాలు, వినియోగం, వివిధ సేవలు/పథకాలు/రంగాల్లో యుఎల్‌పిఐఎన్ లేదా భూ-ఆధార్ పాత్ర, ఉత్తమ పద్ధతులు, భూ యజమానులు/సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు, వాటికి సంబంధించిన సమస్యలు.
*****
(Release ID: 1907220)