రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతిని కలిసిన కెన్యా సుప్రీంకోర్టు ప్రతినిధి బృందం
प्रविष्टि तिथि:
10 MAR 2023 3:25PM by PIB Hyderabad
కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మార్తా కె. కూమీ సారధ్యంలోని ప్రతినిధుల బృందం మార్చి 10 న భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపడు ముర్మూ ను రాష్ట్రపతి భవన్ లో కలుసుకుంది.
ఈ బృందానికి స్వాగతం పలుకుతూ, కెన్యా-భారత్ మధ్య శతాబ్దాల స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేశారు. కెన్యా అభివృద్ధి భాగస్వామిగా భారత్ ఉండటం గర్వకారణమని కూడా అన్నారు. కెన్యా కొత్త ప్రభుత్వంతో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలు నెరపే సంస్కృతి కొనసాగించటానికి భారత్ ఉత్సాహంతో ఉందన్నారు. ద్వైపాక్షిక వర్తక సంబంధాలు మరింత బలోపేతం చేయటానికి రెండు దేశాలూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
కెన్యా సుప్రీంకోర్టుకు జస్టిస్ కూమీ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి కావటం విశేషమన్నారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండేట్టు ఆమె చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. కెన్యాలో మహిళల సాధికారతకు ఆమె చిహ్నమన్నారు.
***
(रिलीज़ आईडी: 1905922)
आगंतुक पटल : 170