పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రేపు రాష్ట్రాలతో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సమావేశం


- 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ సంస్థల ఆన్‌లైన్ ఆడిట్, నిధుల విడుదల ప్రక్రియపై చర్చ

Posted On: 09 MAR 2023 11:26AM by PIB Hyderabad

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ సంస్థల ఆన్‌లైన్ ఆడిట్ మరియు నిధుల విడుదల ప్రక్రియపై చర్చించేందుకు గాను.. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల వారితో సంప్రదింపుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సునీల్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు., అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్ర శేఖర్ కుమార్, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ ప్రేమ్ నగర్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగుతుంది. ఈ సమావేశంలో డైరెక్టరేట్ ఆఫ్ లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్) కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలకు పదిహేనవ ఆర్థిక సంఘం గ్రాంట్‌లను విడుదల చేస్తుంది. పదిహేనవ ఆర్థిక సంఘం పబ్లిక్ డొమైన్‌లో ఆన్‌లైన్‌లో తాత్కాలిక / ఆడిట్ చేయబడిన రెండు ఖాతాలను కలిగి ఉన్న రాష్ట్రాలు/ ఆర్ఎల్బీలు మాత్రమే 2021-22 ఆర్థిక సంవత్సరపు గ్రాంట్‌లను అందుకోవాలని సూచించింది. పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 2021-22 మరియు 2022-23 సంబంధించిన నిధుల కోసం రాష్ట్రాలు కనీసం 25% ఆర్ఎల్బీలు మునుపటి సంవత్సరానికి బోట్ తాత్కాలిక ఖాతాలను కలిగి ఉన్నాయని, అంతకు ముందు సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఖాతాలను పబ్లిక్ డొమైన్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చూసుకొని పూర్తి గ్రాంట్లకు అర్హత కలిగి ఉండాలి. 2023-24 నుండిపబ్లిక్ డొమైన్లో అంతకుముందు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సంవత్సరానికి ముందు సంవత్సరానికి, ఆడిట్ చేయబడిన ఖాతాలను కలిగి ఉన్న ఆర్.ఎల్.బిలకు మాత్రమే మునుపటి సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక ఖాతాలు ఉన్నందున రాష్ట్రాలు మొత్తం గ్రాంట్లను స్వీకరిస్తాయిపదిహేనవ ఆర్థిక సంఘం కూడా 2024-25 నుండి స్థానిక సంస్థలకు గ్రాంట్లు విడుదల చేయడానికి గాను రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటును (ఎస్ఎఫ్సీకూడా ఒక అవసరమైన షరతుగా నిర్దేశించిందిఎస్ఎఫ్సీ ఏర్పాటు చేయని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఎస్ఎఫ్సీలను ఏర్పాటు చేసివారి సిఫార్సులపై చర్య తీసుకోవాలి. మార్చి, 2024 లేదా అంతకు ముందు శాసనసభ ముందు ఏటీఎర్ ను వేయాలిమార్చి, 2024 తర్వాతరాజ్యాంగ నిబంధనను పాటించని రాష్ట్రానికి గ్రాంట్లు విడుదల చేయబడవు దిశగా అనేక రాష్ట్రాలు ఇంకా గణనీయమైన పురోగతిని సాధించలేదని గుర్తించబడింది రెండు కీలకమైన సిఫార్సుల వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను చర్చించడానికి,,  విషయంలో రాష్ట్రాల వ్యూహం మరియు సంసిద్ధతను నిర్ధారించడానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ  ఒక రోజు సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తోంది సమావేశంలోపైన పేర్కొన్న సిఫార్సులకు సంబంధించి రాష్ట్రాలు తమ వ్యూహాన్ని మరియు సంసిద్ధతను పంచుకుంటాయి.

*****


(Release ID: 1905296) Visitor Counter : 198