రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భార‌తీయ నావికాద‌ళ అతిపెద్ద యుద్ధ క్రీడ టిఆర్ఒపిఇఎక్స్ (ట్రోపెక్స్‌) థియేట‌ర్ స్థాయి కార్యాచ‌ర‌ణ సంసిద్ధ‌త విన్యాసం

Posted On: 09 MAR 2023 9:25AM by PIB Hyderabad

 దాదాపు నాలుగు నెల‌ల కాలం, అంటే న‌వంబ‌ర్ 2022 నుంచి మార్చి 2023 వ‌ర‌కు సాగిన ఐఒఆర్ వ్యాప్తంగా సాగిన భార‌తీయ నావికాద‌ళ ప్ర‌ధాన కార్యాచ‌ర‌ణ స్థాయి 2023వ సంవ‌త్స‌ర‌పు టిఆర్ఒపిఇఎక్స్ (ట్రోపెక్స్‌) విన్యాసాలు అరేబియా స‌ముద్రంలో ముగిసాయి.  ఈ మొత్తం విన్యాసాల న‌మూనాలో కోస్ట‌ల్ డిఫెన్స్ ఎక్సర్‌సైజ్ (తీర‌ప్రాంత ర‌క్ష‌ణ విన్యాసం) సీ విజిల్, ఆంఫీబియ‌స్ ఎక్స్‌ర్‌సైజ్ (జ‌ల స్థ‌ల విన్యాసాలు) ఎఎంపిహెచ్ఇఎక్స్ - ఆంఫెక్స్ ఉన్నాయి. మొత్తంగా ఈ విన్యాసాల‌లో భార‌తీయ సైన్యం, భార‌తీయ వాయుద‌ళం, కోస్ట్ గార్డ్ పాలుపంచుకోవ‌డం క‌నిపించింది.
అరేబియా స‌ముద్రం, బంగాళాఖాతం స‌హా హిందూ మ‌హాస‌ముద్ర‌మే విన్యాసాల‌కు కార్యాచ‌ర‌ణ వేదిక‌గా సాగాయి. ఈ విన్యాసాలు ఉత్త‌రం నుంచి ద‌క్షిణానికి దాదాపు 4300 నాటిక‌ల్ మైళ్ళ‌, 35 డిగ్రీల ద‌క్షిణ అక్షాఆంశం వ‌ర‌కు,  5000 నాటిక‌ల్ మైళ్ళ మేర‌కు ప‌శ్చిమాన ప‌ర్షియ‌న్ గ‌ల్ఫ్ నుండి తూర్పున ఉత్త‌ర ఆస్ట్రేలియా తీరం వ‌ర‌కు 21 మిలియ‌న్ చ‌ద‌ర‌పు నాటిక‌ల్ మైళ్ళ విస్తీర్ణంలో సాగాయి. ట్రాపెక్స్ 23లో దాదాపు 70 భార‌తీయ నావికాద‌ళ ఓడ‌లు, ఆరు జ‌లాంత‌ర్గాములు, సుమారు 75 విమానాలు పాలుపంచుకున్నాయి.
ట్రాపెక్స్ 23 న‌వంబ‌ర్ 2022న ప్రారంభ‌మైన‌ భార‌తీయ నావికాద‌ళ తీవ్ర కార్యాచ‌ర‌ణ ద‌శ‌కు ముగింపు ప‌లికాయి. అంతిమ ఉమ్మ‌డి ద‌శ‌లో భాగంగా, ఇటీవ‌లే ప్రారంభించిన దేశీయ ఎయిర్‌క్రాఫ్ట్ కారియ‌ర్ విక్రాంత్‌పై  06 మార్చి 2023న గౌర‌వ‌నీయ ర‌క్ష‌ణ మంత్రి ఒక‌పూర్తి రోజును గ‌డిపారు. భార‌తీయ నావికాద‌ళ కార్యాచ‌ర‌ణ, భౌతిక సంసిద్ధ‌త‌ను ఆయ‌న స‌మీక్షించారు. కాగా, నావికాద‌ళం కార్యాచ‌ర‌ణ విన్యాసాల‌ను,  దేశీయ ఎల్‌సిఎ డెక్ ఆప‌రే ష‌న్లు, ప్ర‌త్య‌క్ష ఆయుధాల కాల్పులు స‌హా  పోరాట ప‌టిమ వివిధ కోణాల‌ను ప్ర‌ద‌ర్శించింది. నౌకాద‌ళాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ భార‌తీయ నావికాద‌ళం కార్యాచ‌ర‌ణ సంసిద్ధ‌త‌ను ఆయ‌న కొనియాడారు.నేటికాలంలో యుద్ధ‌పోరాటాల‌ను కొన‌సాగించ‌డం క‌ష్ట‌మైన నేప‌థ్యంలో మ‌న శత్రువుల యుద్ధ సామ‌ర్ధ్యాల‌కు విఘాతం క‌లిగించి, ఆర్థిక జీవ‌నమార్గాలు కొన‌సాగేలా చూసేందుకు దేశం యావ‌త్ నావికాద‌ళంపై ఆధార‌ప‌డుతుంది. స‌ముద్ర ప్రాంతంలో భార‌త‌దేశ జాతీయ ప్ర‌యోజ‌నాల‌ను  ప‌రిర‌క్షించ‌డంలో భార‌త నావికాద‌ళం పూర్తి స‌మ‌ర్ధ‌వంతంగా ఉంద‌ని, భార‌త శాంతియుత ఉనికికి ముప్పు క‌లిగించే సంభావ్య శ‌త్రువుల దుష్ట యోజ‌న‌ల‌ను తిప్పికొట్ట‌గ‌ల‌మ‌నే హామీ ఇస్తుంద‌ని  ఆయ‌న పేర్కొన్నారు.  మేక్ ఇన్ ఇండియా చొర‌వ‌లో ముందంజంలో ఉండి ఆత్మ‌నిర్భ‌ర‌త మార్గాన్ని పోరాటానికి సంసిద్ధ‌త‌తో, విశ్వ‌స‌నీయంగా, స‌మ్మిళితంగా, భ‌విష్య‌త్ ప్ర‌మాణంగా వినియోగించుకుంటున్న భార‌త నావికాద‌ళాన్ని గౌర‌వ‌నీయ ర‌క్ష‌ణ‌మంత్రి అభినందించారు. 

 

*****


(Release ID: 1905295) Visitor Counter : 253