ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్ భారతీయ జన్ ఔషధి పరియోజన భారతదేశం లో కోట్ల కొద్దీ వ్యక్తుల వైద్యఖర్చుల కు సంబంధించిన ఆందోళనల ను తొలగించింది:  ప్రధాన మంత్రి

Posted On: 07 MAR 2023 2:04PM by PIB Hyderabad

పిఎమ్ భారతీయ జన్ ఔషధి పరియోజన (పిఎమ్ బిజెపి) యొక్క కార్యసిద్ధులు ఎంతో సంతృప్తికరం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం వైద్య చికిత్స కు అయ్యే ఖర్చుల విషయం లో దేశం లోని కోట్ల కొద్దీ ప్రజల ను ఆందోళనల బారి నుండి విముక్తం చేయడం ఒక్కటే కాకుండా వారి జీవనాల ను సులభతరం గా కూడా మార్చివేసింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

రసాయనాలు మరియు ఎరువులు శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియ దేశ ప్రజలు ఈ రోజు న అయిదో జన్ ఔషధి దివస్ ను జరుపుకొంటున్న సంగతి ని అనేక ట్వీట్ లలో తెలియ జేశారు. ఈ పథకం భారతదేశం లో సామాన్య ప్రజానీకం జీవనం లో ఒక ప్రత్యక్ష సకారాత్మక ప్రభావాన్ని కలుగజేసింది. దేశం లో 12 లక్షల మంది కి పైగా పౌరులు జన్ ఔషధీ కేంద్రాల ద్వారా ప్రతి నిత్యం మందుల ను కొనుగోలు చేస్తున్నారు. ఆ కేంద్రాల లో మందు లు బజారు ధర కంటే 50 శాతం నుండి 90 శాతం వరకు చౌక గా దొరుకుతున్నాయి.

కేంద్ర మంత్రి ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ -

‘‘భారతీయ జన్ ఔషధి పరియోజన యొక్క కార్యసిద్ధులు చాలా సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. దీనితో చికిత్స సంబంధి ఖర్చుల విషయం లో దేశం లోని కోట్ల మంది కి బాధలు దూరం కావడం ఒక్కటే కాకుండా, వారి జీవనం సైతం సులభతరం గా మారింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

******

DS/ST

 

 



(Release ID: 1904875) Visitor Counter : 166