ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'వృద్ధి అవకాశాలను సృష్టించడం కోసం ఆర్థిక సేవల సామర్థ్యాన్ని పెంచడం' అనే అంశంపై రేపు బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రసంగించనున్న ప్రధాని


బడ్జెట్ ప్రకటనల అమలు కోసం ఆలోచనల అన్వేషణలో భాగంగా నిర్వహిస్తున్న 12 పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్ల సిరీస్‌లో భాగంగా రేపు 10వ పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్

ఆర్థిక రంగానికి సంబంధించిన బడ్జెట్ ప్రకటనలను కవర్ చేసే విధంగా ఈ వెబ్‌నార్‌లో 6 బ్రేక్అవుట్ సెషన్‌లు ఉంటాయి. బడ్జెట్‌ ప్రకటనల అమలు మరియు ముందుకు వెళ్లే మార్గాలపై సూచనలు ఉన్నాయి.

प्रविष्टि तिथि: 06 MAR 2023 7:08PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు ఉద‌యం 10.00 గంట‌ల‌కు వీడియో సందేశం ద్వారా “వృద్ధి అవకాశాలను సృష్టించడానికి ఆర్థిక సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడం” అనే అంశంపై పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌లో ప్రసంగించనున్నారు.

బడ్జెట్ అనంతర వెబ్‌నార్ అనేది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఆలోచనలు మరియు సూచనలను పొందేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న 12 పోస్ట్-బడ్జెట్ వెబ్‌నార్ల శ్రేణిలో ఒక భాగం.కేంద్ర బడ్జెట్ ఏడు ప్రాధాన్యతలను స్వీకరించింది. అవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. అంతే కాకుండా అమృత్ కాల్ ద్వారా మనకు మార్గనిర్దేశం చేసే 'సప్తఋషి'గా పనిచేస్తాయి. ప్రభుత్వం యొక్క ఏడు ప్రాధాన్యతలలో ఆర్థిక రంగం ఒకటి.

వెబ్‌నార్ కింది థీమ్‌ల క్రింద ఆరు బ్రేక్అవుట్ సెషన్‌లను కలిగి ఉంటుంది:

1. జిఐఎఫ్‌టి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో వృద్ధి అవకాశాలను సృష్టించడం

2. ఎంఎస్‌ఎంఈల కోసం సీమ్‌లెస్ క్రెడిట్ ఫ్లో క్రెడిట్ గ్యారెంటీని సులభతరం చేయడం

3. ఖాతా తెరవడం & డిజిటల్ చెల్లింపుల కోసం కస్టమర్ సౌలభ్యాన్ని మెరుగుపరచడం

4. సెంట్రల్ డేటా ప్రాసెసింగ్ సెంటర్ ద్వారా సులభంగా వ్యాపారం చేయడం మరియు షేర్లు మరియు డివిడెండ్‌లను తిరిగి పొందడం

5. అమృత్ కాల్ అవసరాలకు అనుకూలమైన నిబంధనలు

6. ఎన్‌ఎఫ్‌ఐఆర్ మరియు సెక్యూరిటీస్ మార్కెట్‌లో కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఆర్థిక రంగ  సామర్థ్యాన్ని పెంపొందించడం

సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల మంత్రులు మరియు కార్యదర్శులతో పాటు నియంత్రకులు, మార్కెట్ భాగస్వాములు మరియు పరిశ్రమల ప్రతినిధులతో సహా ఆర్థిక రంగానికి చెందిన అనేక మంది వాటాదారులు ఈ వెబ్‌నార్‌లకు హాజరవుతారు. బడ్జెట్ ప్రకటనలను మెరుగ్గా అమలు చేయడానికి అవసరమైన సూచనలకు సహకరిస్తారు.

 

****


(रिलीज़ आईडी: 1904760) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , हिन्दी , English , Urdu , Marathi , Kannada