కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 మార్చి 19, 20 తేదీల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరగనున్న 1వ లేబర్ 20 (ఎల్‌20) సమావేశం

प्रविष्टि तिथि: 05 MAR 2023 3:59PM by PIB Hyderabad

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 2023 మార్చి 19, 20 తేదీల్లో 1వ లేబర్ 20 (ఎల్‌20) సమావేశం జరగనుంది. జీ20 కింద ఏర్పాటైన బృందాల్లో ఎల్‌20 ఒకటి. కార్మిక సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి విశ్లేషణలు, విధానపర సిఫార్సులను అందించే జీ20 దేశాల వాణిజ్య సంఘాల నాయకులు, ప్రతినిధులను కలిగి ఉంటుంది. జీ20 దేశాలకు భారతదేశం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో, భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్‌) ఎల్‌20 సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతోపాటు, ఎల్‌20 సమావేశంలో పాల్గొనేవారికి అమృత్‌సర్ సాంస్కృతిక వారసత్వాన్ని చూపించేందుకు వివిధ ప్రదేశాలకు తీసుకువెళతారు.

*******


(रिलीज़ आईडी: 1904460) आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Tamil