వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో తేయాకు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు సమస్యల పరిష్కారానికి ప్రణాళిక


ప్రపంచ బ్రాండ్‌ గా గుర్తింపు సాధించడానికి చర్యలు

Posted On: 02 MAR 2023 1:15PM by PIB Hyderabad

దేశంలో తేయాకు దిగుబడి పెంచడానికి , భారతీయ టీ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చూసేందుకు  ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తేయాకు రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోంది. 

ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. బ్లాక్ టీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ స్థానంలో అగ్ర స్థానంలో ఉంది.1350 ఎం కేజీ ల తేయాకు ఉత్పత్తి అవుతోంది. దేశంలో  అవసరాలు, ఎగుమతులకు సరిపోయే తేయాకు ఉత్పత్తి చేస్తున్న భారతదేశం తేయాకు రంగంలో స్వయం సమృద్ధి సాధించింది. 

బ్లాక్ టీ వినియోగంలో భారతదేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి  అవుతున్న బ్లాక్ టీలో 18% బ్లాక్ టీ భారతదేశంలో వినియోగిస్తున్నారు. టీ ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. భారతదేశం నుంచి వివిధ రకాల టీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. అనేక దేశాల ప్రజలు భారతీయ టీ రుచిని ఆస్వాదిస్తున్నారు.  
భారతీయ తేయాకు పరిశ్రమలో  దాదాపు 1.16 మిలియన్ల మంది కార్మికులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. దాదాపు సమాన సంఖ్యలో ప్రజలు పరోక్షంగా తేయాకు రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు. .
దేశంలో ఉత్పత్తి అవుతున్న తేయాకులో దాదాపు 52% తేయాకును  చిన్న తేయాకు సాగు దారులు ఉత్పత్తి చేస్తున్నారు. తేయాకు ఉత్పత్తి రంగంలో దాదాపు 2.30 లక్షల మంది చిన్న తేయాకు సాగుదారులు ఉన్నారు.

  చిన్న తేయాకు సాగుదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం క్రింది చర్యలు అమలు చేస్తోంది. 
* కేంద్ర  ప్రభుత్వం టీ బోర్డు ద్వారా 352 స్వయం సహాయక బృందాలు,  440 రైతు ఉత్పత్తిదారుల సంస్థలు , 17 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది. 

* నాణ్యత గల తేయాకు సేకరణ, సామర్ధ్య పెంపుదల, పంటల సంరక్షణ కోసం ఎస్ టీ జీ ల సహకారం తో  సదస్సులు సమావేశాలు జరిగాయి. 

* ఆకులు కత్తిరించడానికి, పంట వేయడానికి  అవసరమైన  యంత్రాలు సమకూర్చుకోవడానికి సహాయం.
*  వ్యవస్థాపకులు, నిరుద్యోగ యువతకు మినీ టీ ఫ్యాక్టరీలు స్థాపించడానికి సహకారం 
*· తయారీదారులు, పెంపకందారుల మధ్య జరిగే  పచ్చి ఆకుల లావాదేవీలకు తగిన ధర నిర్ణయించడం కోసం ధరల భాగస్వామ్య విధానంలో  టీ బోర్డు టెండర్‌ను విడుదల చేసింది.  శాస్త్రీయ పద్ధతిలో అమలు జరిగే ఈ ప్రక్రియ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. చిన్న తేయాకు పెంపకందారులు వాస్తవిక ధరల సమాచారం, ఇతర సమాచారం తెలుసుకునేలా చూడడానికి  “చాయ్ సహయోగ్” పేరుతో ఒక   మొబైల్ యాప్ అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం యాప్  అభివృద్ధి దశలో ఉంది. పథకాన్ని రూపొందించింది.

* 2022-23 సంవత్సరంలో 2023 జనవరి వరకు ఈ పథకం కింద 3.25 కోట్ల రూపాయలను 2845 మంది లబ్ధిదారులకు అందించారు. 

అంతర్జాతీయ మార్కెట్లో గట్టి పోటీ పోటీ ఎదుర్కొంటున్న భారత టీ ఎగుమతులు  తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సాధించాయి.2022-23 లో వివిధ భౌగోళిక-రాజకీయ, భౌగోళిక-ఆర్థిక, రవాణా రూపంలో సవాళ్లు ఎదురైనప్పటికీ   $883 మిలియన్ల విలువ చేసే భారత టీ ఎగుమతులు జరిగాయి.  95% మించి లక్ష్యాల మేరకు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని అంచనా.ఎగుమతి చేయాల్సిన సరకు సరఫరాలో జరుగుతున్న జాప్యం,  కంటైనర్ల లభ్యత మొదలైన సమస్యలు పరిష్కారం అయ్యాయి. 

 టీ పరిశ్రమకు సహాయం చేయడానికి ఈ క్రింది చర్యలు అమలు జరిగాయి:
· *  విదేశాల్లో ఉన్న భారత రాయబార కేంద్రాల సహకారంతో మార్కెట్ సమాచారం సేకరించడానికి కొనుగోలుదారు-విక్రేతల మధ్య  సమావేశాలు జరుగుతున్నాయి. టీ ఎగుమతులు మరింత ఎక్కువ చేయడానికి అనుసరించాల్సిన చర్యలను సమావేశాల్లో చర్చిస్తున్నారు.  ముఖ్యంగా ఇరాక్, సిరియా, సౌదీ అరేబియా, రష్యా లాంటి దేశాలకు ఎగుమతులు ఎక్కువ చేసే అంశంపై దృష్టి సారించారు.   మలేషియాకు కూడా BSM ఉంది.

*  టీ ఎగుమతుల కోసం RoTDEP రేటును కిలోకు రూ.6.70 గా నిర్ణయించడం జరిగింది. టీ బోర్డు అమలు చేసిన చర్యల వల్ల ధర పెరిగింది. గతంలో ధర  కిలోకు రూ.3.60గా  ఉండేది. 

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2022 డిసెంబర్ వరకు 188.76 మిలియన్ కేజీల టీ ఎగుమతులు జరిగాయి. ఎగుమతుల  విలువ $ 641.34 మిలియన్ డాలర్ల వరకు ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఎగుమతులు    33.37 మిలియన్  కేజీల వృద్ధి  ( 21.47% పెరుగుదల) నమోదు చేశాయి. ఎగుమతుల ద్వారా లభించిన ఆదాయం $ 70.93 మిలియన్ డాలర్ల మేరకు (12.43% వృద్ధి) పెరిగింది.  

*  భారతీయ టీ బ్రాండింగ్ కోసం మీడియా ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తదితర అంశాలు ఆధారంగా ప్రచార కార్యక్రమాలు రూపొందాయి.

* టీ బోర్డు పాల్గొంటున్న అన్ని కార్యక్రమాల్లో ప్రత్యేక టీ లోగోలను  ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు.  మార్గదర్శకాలకు అనుగుణంగా లోగోలను ఉపయోగిస్తున్న వారిని టీ బోర్డు సన్మానిస్తోంది. 

భారతదేశం దేశం నుంచి ఎగుమతి అవుతున్న టీ రకాల్లో డార్జిలింగ్ టీ ప్రత్యేక స్థానం కలిగి ఉంది.  డార్జిలింగ్ టీ జిఐ గుర్తింపు పొందింది.  నమోదు చేయబడింది.  డార్జిలింగ్ జిల్లా కొండ ప్రాంతంలో 87 తేయాకు తోటల్లో  డార్జిలింగ్ టీ సాగు అవుతోంది. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల 70% కంటే ఎక్కువ పొదలను  తేయాకు తోటలు  కలిగి ఉంటాయి. తోటల  వయస్సు ప్రభావం ఉత్పత్తిపై ఎక్కువగా ఉంటుంది.   ప్రస్తుతం    డార్జిలింగ్ టీ ఉత్పత్తి 6-7 ఎం కేజీల మధ్య ఉంది. తక్కువ ధరకు నేపాల్ టీ లభించడం వల్ల ఎదురవుతున్న సమస్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించడానికి టీ బోర్డు ప్రత్యేక కమిటీ ని ఏర్పాటు చేసింది.  డార్జిలింగ్ టీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కమిటీ లో  డార్జిలింగ్ టీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. సమస్యల పరిష్కారానికి అమలు చేయాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. చౌకగా దిగుమతి చేసుకున్న టీ నాణ్యత తనిఖీల కోసం టీ బోర్డు , మంత్రిత్వ శాఖ వివిధ చర్యలు తీసుకుంటోంది.


 “టీ డెవలప్‌మెంట్ అండ్ ప్రమోషన్ స్కీమ్, 2021-26”లో  సవరణలు చేయాలని టీ బోర్డు  సూచించింది.  టీ పరిశ్రమ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని టీ బోర్డు సవరణలు ప్రతిపాదించింది.  లబ్ధిదారుల ఎంపిక,గుర్తింపు,  పంపిణీలో  పారదర్శకత కోసం “సర్వీస్ ప్లస్ పోర్టల్” కింద ఆన్‌లైన్ విధానం అమలు జరుగుతున్నది. 

***


(Release ID: 1903686) Visitor Counter : 277