ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన మహమ్మారి నిధి పై అవగాహన సదస్సు ను నిర్వహించింది


మహమ్మారి నిధి ని అమలు చేసే సంస్థలుగా భారతీయ ఆరోగ్య సంస్థల సామర్థ్యాన్ని చర్చలు అన్వేషించాయి

జీ 20 ప్రెసిడెన్సీ వర్ధమాన ప్రపంచం కోసం మహమ్మారి నిధి ని ఉపయోగించుకోవడం చర్చించారు

Posted On: 02 MAR 2023 10:30AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ది పాండమిక్ ఫండ్ సహకారంతో ఒక సెమినార్‌ను నిర్వహించింది. అవగాహన సదస్సు మహమ్మారి నిధి ఇటీవల ప్రకటించిన మొదటి ప్రతిపాదనల పనితీరుపై దృష్టి సారించింది. ఇంకా మహమ్మారి నిధి  అమలు సంస్థలుగా భారతీయ ఆరోగ్య సంస్థలు పోషించిగల పాత్రను అన్వేషించడానికి కూడా చర్చలు జరిగాయి. ఈ సదస్సుకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ అధ్యక్షత వహించారు.  సెమినార్‌లో ది పాండమిక్ ఫండ్ సెక్రటేరియట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ శ్రీమతి. ప్రియా బసు కూడా పాల్గొన్నారు.

 

శ్రీ రాజేష్ భూషణ్ ప్రపంచ ఆరోగ్య సహకారం మరియు ముఖ్యంగా పేద దేశాలకు లకు విజ్ఞానం మరియు వనరులను పంచుకోవడం ఆవశ్యకతను నొక్కి చెప్పారు. మహమ్మారి నిధిలో ఎంటిటీలను అమలు చేయడంలో వారి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి వ్యాధి నిఘా మరియు మహమ్మారి  పీ పీ ఆర్ లో భారతీయ ఆరోగ్య సంస్థల నైపుణ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు.

 

ఆగ్నేయాసియా ప్రాంతంలో వ్యాధి పర్యవేక్షణ మరియు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం లో భారతదేశం ఇప్పటికే అందించిన మద్దతుపై   కార్యదర్శి  నొక్కిచెప్పారు. కోవిడ్-19 మహమ్మారి విపత్తు లో భారతదేశం యొక్క సమగ్ర నిర్వహణను ఉటంకిస్తూ, శ్రీ భూషణ్ వ్యాధి పర్యవేక్షణ మరియు పీ పీ ఆర్ లో భారతదేశం  సామర్థ్యం ఉన్నత స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయంలో  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన కోవిన్  ఆరోగ్య సేతు మరియు ఈసంజీవని పీ ఎం - అభిం  వంటి కార్యక్రమాలను ఆయన హైలైట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య విధానం సామర్ధ్యం  మరియు ప్రయోజనానికి సరిపోయేలా నిర్మించాలనే తపనలో ఇది ఒక ముఖ్యమైన చొరవగా పేర్కొంటూ, మహమ్మారి నిధి ని రూపొందించడానికి వివిధ లబ్దిదారులు చేసిన అవిశ్రాంతమైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

 

మహమ్మారి నిధి యొక్క ప్రతిపాదనల లో భారతదేశం యొక్క జీ 20 ఆరోగ్య ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రత్యేకించి, అందరికీ సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యమైన మరియు సరసమైన వైద్య ప్రక్రియల (VTDలు) లభ్యత మరియు లభ్యతను నిర్ధారించడం కోసం  ప్రపంచ ఆరోగ్య ఆద్యంత సంరక్షణ సమన్వయ వేదిక ను రూపొందించవలసిన అవసరాన్ని ఆయన ను నొక్కి చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీ అధ్యక్షుడిగా, ఆరోగ్య సహకారంలో నిమగ్నమై ఉన్న వివిధ బహులపక్ష వేదికల మధ్య చర్చలు మరియు ప్రయత్నాలలో ఐక్యతను సాధించడం మరియు సమగ్ర చర్య కోసం పని చేయడం భారతదేశం లక్ష్యంగా ఉందని ఆయన నొక్కి చెప్పారు.

 

శ్రీమతి ప్రియా బసు మహమ్మారి నిధి ని పరిచయం చేసారు మరియు ఫండ్ యొక్క పని మరియు దాని ప్రాధాన్యతా అంశాలపై అవగాహనను అందించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు వ్యవస్థలను బలోపేతం చేయడానికి మరియు ప్రపంచ ఆరోగ్య సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడానికి భారతదేశం యొక్క వినూత్న కార్యక్రమాలకు ఆమె అభినందనలు తెలిపారు. మహమ్మారి నిధి ఏర్పాటులో భారతదేశం యొక్క సహకారాన్ని మరియు పాత్రను ఉదహరిస్తూ, భవిష్యత్‌లో భారతీయ ఆరోగ్య సంస్థలతో కలిసి పని చేయడంలో  ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు  మొదటి ఫండింగ్ కాల్ కోసం భారతదేశం నుండి ప్రతిపాదనలు అందుకోవడానికి ఎదురు చూస్తున్నామాని శ్రీమతి.బసు తెలిపారు  ఆమె ఉపన్యాసం లో మొదటి ప్రతిపాదన లకోసం ఆహ్వానం మరియు మహమ్మారి నిధి యొక్క అమలు చేసే సంస్థల అక్రిడిటేషన్ ఫ్రేమ్‌వర్క్ గురించి వివరించారు.

 

ఐ సీ ఎం ఆర్ మరియు ఎన్ సీ డీ సీ కి చెందిన అధికారులు వ్యాధుల నిఘా మరియు మహమ్మారి సంసిద్ధతలో భారతదేశం యొక్క పురోగతి ని ప్రదర్శించారు. మహమ్మారి నిధి  అమలు చేసే సంభావ్య సంస్థలుగా విరాళం ఇవ్వగల సాధ్యమైన రంగాలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.  మాల్దీవులు మరియు తైమూర్-లెస్టేలో దేశాల్లో వ్యాధి నిఘా మరియు  సామర్థ్యాలను పెంపొందించడానికివారు చేసిన పనిని వివరించడం ద్వారా సంస్థలు తమ ప్రపంచ ఆరోగ్య సహకార ప్రయత్నాలను కూడా ప్రదర్శించాయి.

 

సెమినార్ హాజరైన వారికి భారతదేశం యొక్క విశిష్టమైన సమగ్ర ఆరోగ్య సమాచార వేదిక  (IHIP) డెమో ఇవ్వబడింది, ఇది వెబ్ ఆధారిత నిజ కాల ఎలక్ట్రానిక్ ఆరోగ్య సమాచార మరియు వ్యాధి వ్యాప్తి మరియు సంబంధిత వనరులను నిర్వహించడానికి నిఘా. హాజరైన వారికి అత్యాధునికమైన  అత్యవసర వైద్య ఎమర్జెన్సీ సేవా కేంద్రం మరియు పబ్లిక్ హెల్త్ అబ్జర్వేటరీలో టూర్ కూడా ఇవ్వబడింది.

 

భారతీయ ఆరోగ్య సంస్థలు మరియు పాండమిక్ ఫండ్ మధ్య సహకారం కోసం సంభావ్య ప్రాంతాలు మరియు అవకాశాలపై ప్రోత్సాహకరమైన చర్చలు మరియు ఏకాభిప్రాయంతో సెమినార్ ముగిసింది.

 

పాండమిక్ ఫండ్ ఇండోనేషియా జీ 20 ప్రెసిడెన్సీ సమయంలో ప్రారంభించబడింది ఇది దాత దేశాలు, సహ-పెట్టుబడిదారులు (నిధులను స్వీకరించడానికి అర్హత ఉన్న దేశాలు),ఫౌండేషన్‌లు, ఆర్థిక సహాయం చేసే పౌర సమాజ సంస్థల మధ్య సహకార భాగస్వామ్యం. పాండమిక్ నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్పందన (PPR)సామర్థ్యాలు బలోపేతం చేయడానికి క్లిష్టమైన పెట్టుబడులు సమకూర్చే సంస్థ.  తక్కువ మరియు మధ్య-ఆదాయ (LMIC) దేశాలపై దృష్టి సారించే సంస్థ.

 

డాక్టర్ అతుల్ గోయెల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, శ్రీ రజత్ కె మిశ్రా, అదనపు కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సీనియర్ అధికారులు కూడా సెమినార్‌లో పాల్గొన్నారు.

***


(Release ID: 1903602) Visitor Counter : 164