యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 మార్చి 2న 4వ జాతీయ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో ప్రసంగించనున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా


యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కూడా కార్యక్రమంలో ప్రసంగం

"ఉత్తమ భవిష్యత్ కోసం ఆలోచనలు: ప్రపంచం కోసం భారతదేశం" అనే ఇతివృత్తంతో 4వ ఎడిషన్ నేషనల్
యూత్ పార్లమెంట్ ఫెస్టివల్, 2023

Posted On: 28 FEB 2023 5:25PM by PIB Hyderabad
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2023 మార్చి 2వ తేదీన 4వ ఎడిషన్ నేషనల్ యూత్ పార్లమెంటరీ ఫెస్టివల్ (ఎన్ వై పి ఎఫ్) వేడుకనుద్దేశించి న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 10:30 గంటలకు ప్రసంగిస్తారు. ఈ ఉత్సవంలో ముగ్గురు జాతీయ విజేతలు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్,  యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిషిత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.  
 

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ (ఎన్ వై పి ఎఫ్) లక్ష్యం రాబోయే సంవత్సరాల్లో ప్రజా సేవలతో సహా వివిధ కెరీర్‌లలో చేరబోయే యువత ప్రేరణాత్మక పాత్ర పోషించడం. ఎన్ వై పి ఎఫ్ అనేది 31 డిసెంబర్ 2017న ప్రధాన మంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో అందించిన ఆలోచన ఆధారంగా రూపొందించబడింది. ఈ ఆలోచన నుండి ప్రేరణ పొంది,  ఎన్ వై పి ఎఫ్ - 2019 మొదటి  ఎడిషన్ “బీ ద వాయిస్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ ఫైండ్ సొల్యూషన్స్ అండ్ ఫైండ్” అనే థీమ్‌తో నిర్వహించారు. 88,000 మంది యువత దీనిలో భాగస్వామ్యం అయ్యారు. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2021 రెండవ ఎడిషన్ “ యువ ఉత్సాహ్ - నయే భారత్ కా” అనే థీమ్‌తో నిర్వహించారు.  దీనిని వర్చువల్ మోడ్‌లో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది యువత, వాటాదారులు వీక్షించారు. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్-2022లో 2.44 లక్షలకు పైగా యువత భాగస్వామ్యంతో “న్యూ ఇండియా వాయిస్‌గా ఉండండి, పరిష్కారాలను కనుగొనండి, విధానానికి సహకరించండి” అనే థీమ్‌తో నిర్వహించారు. 

నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 4వ ఎడిషన్, 2023 "ఉత్తమ భవిష్యత్ కోసం ఆలోచనలు: ప్రపంచం కోసం భారతదేశం" అనే థీమ్‌తో ప్రారంభం అయింది. 2023 జనవరి 25 నుండి 29 వరకు జిల్లా యూత్ పార్లమెంట్‌లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 150 వేదికలలో అన్ని రాష్ట్రాలు యుటీలలోని 748 జిల్లాల నుండి 2.01 లక్షల మంది యువత పాల్గొన్నారు. జిల్లా యూత్ పార్లమెంట్ (డివైపి) 1వ, 2వ స్థానం సాధించిన వారు 2023 ఫిబ్రవరి 3  నుండి 7  వరకు రాష్ట్ర యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి యువజన పార్లమెంటుల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర యూత్ పార్లమెంట్ (ఎస్ వై పి)లో ఇరవై తొమ్మిది (29) విజేతలుతో కూడిన జాతీయ జ్యూరీ ముందు మార్చి ఒకటో తేదీన మాట్లాడే అవకాశం లభించింది. జ్యూరీ లో ఎంపీ లు అనురాగ్ శర్మ,  శ్రీ మనోజ్ తివారీ, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్,  సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు శ్రీ కంచన్ గుప్తా ఉన్నారు. 

 

********


(Release ID: 1903313) Visitor Counter : 115