ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి ‘జీవించడం లో సౌలభ్యాన్ని సాధించడం’ అనే అంశం పై ఏర్పాటైనబడ్జెటు అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘ప్రభుత్వ విధానాల మరియు నిర్ణయాల తాలూకు సకారాత్మకమైనటువంటి ప్రభావం ప్రస్తుతంఅత్యంత అవసరమైన చోట్ల కనిపిస్తున్నది’’

‘‘ప్రభుత్వాన్ని ఒక అడ్డంకి గా ప్రజలు ప్రస్తుతం భావించడం లేదు; అంతకన్నా, వారు మా ప్రభుత్వాన్ని నూతనఅవకాశాల కు ఒక ఉత్ప్రేరకం గా చూస్తున్నారు.  నిశ్చితం గా, ఈ దీనిలో సాంకేతికవిజ్ఞానం ఒక ప్రముఖమైనటువంటి పాత్ర ను తప్పక పోషించింది’’

‘‘పౌరులు వారి అభిప్రాయాల ను సులభం గా ప్రభుత్వాని కి తెలియజేయ గలుగుతున్నారు,మరి వారు పరిష్కారాన్ని వెనువెంటనే పొందగలుగుతున్నారు’’

‘‘మేం భారతదేశం లో ఆధునికమైనటువంటి డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటుచేస్తున్నాం, డిజిటల్ క్రాంతి  యొక్క లాభాలుసమాజం లో ప్రతి ఒక్క వర్గాని కి అందేటట్లు గా కూడాను చూస్తున్నాం’’

‘‘ఎఐ ద్వారా పరిష్కరించగలిగిన 10 సామాజిక సమస్యల ను మనం గుర్తించగలమా’’

‘‘ప్రభుత్వాని కి మరియు ప్రజల కు మధ్య విశ్వాసం కొరవడడం అనేది బానిసమనస్తత్వం యొక్క ఫలితం అని చెప్పాలి’’

‘‘సమాజం లో విశ్వాసాన్ని బలపరచడం కోసం ప్రపంచం లో అత్యుత్తమమైనటువంటిఅభ్యాసాల  నుండి మనం నేర్చుకోవలసిన అవసరం ఉంది’’

Posted On: 28 FEB 2023 11:08AM by PIB Hyderabad

సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ జీవించడం లో సౌలభ్యాన్నిసాధించుకోవడం అనే అంశం పై జరిగిన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావశీలమైన విధం గా అమలు పరచడం కోసం ఉపాయాల ను మరియు సూచనల ను కోరుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ అయిదో వెబినార్ గా ఉంది.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 21వ శతాబ్దం లోని భారతదేశం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ తన పౌరుల కు అదే పని గా సాధికారిత ను సమకూర్చుతోంది అని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలు గా ప్రతి ఒక్క బడ్జెటు సాంకేతిక విజ్ఞానం సహాయం తో ప్రజల జీవన సౌలభ్యం సాధన పై శ్రద్ధ తీసుకొంటోంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం యొక్క బడ్జెటు లో, సాంకేతిక విజ్ఞానాని కి మరియు మానవ ప్రమేయాని కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఇదివరకటి ప్రభుత్వాల ప్రాధాన్యాల లో గల వైరుధ్యాల ను ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ప్రజల లోని ఒక ఫలానా వర్గం వారు ఎల్లప్పడూ ప్రభుత్వ జోక్యం కోసం ఏ విధం గా ఎదురు చూసే వారో మరియు ప్రభుత్వం ప్రజల కు మేలు చేయాలి అని వారు ఆశ పెట్టుకొనే వారో ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ఏమైనప్పటి కీ, ఈ విధమైనటువంటి సదుపాయాలు లభించకుండానే వారి యావత్తు జీవనం గడచిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల లో మరొక వర్గాని కి చెందిన వారు వారి జీవనం లో ముందుకు సాగిపోవాలి అని కోరుకొన్నప్పటికీ ప్రభుత్వ జోక్యం వల్ల ఎదురైన ఆటంకాల తో మరియు ఒత్తిడి తో వారు వెనుక కు లాగివేయబడ్డారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆ తరువాత చోటు చేసుకొన్న మార్పుల ను ప్రధాన మంత్రి చాటి చెప్తూ, ప్రజల జీవితాల ను సరళతరం గా మార్చి జీవన సౌలభ్యాన్ని వృద్ధి చెందింప చేస్తూనే, అత్యంత అవసరం అయినటువంటి చోట్ల విధానాల యొక్క సకారాత్మకమైన ప్రభావాలు ప్రసరించిన సంగతి ని గమనించవచ్చును అని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడమైంది, మరి పౌరులు ప్రభుత్వాన్ని ఒక అడ్డం కి అని భావించడం లేదు అని కూడా ఆయన అన్నారు. దీనికి బదులు గా, పౌరులు ప్రభుత్వాన్ని ఒక ఉత్ప్రేరకం గా చూస్తున్నారు, ఈ ప్రక్రియ లో సాంకేతిక విజ్ఞానం ఒక పెద్ద పాత్ర ను పోషిస్తోంది అని ఆయన అన్నారు.

 

దీనిలో సాంకేతిక విజ్ఞానం పాత్ర ఏ విధం గా ఉన్నదీ ప్రధాన మంత్రి వివరిస్తూ వన్ నేశన్ - వన్ రేశన్ కార్డ్, జెఎఎమ్ (జన్ ధన్-ఆధార్-మొబైల్) త్రయం, ఆరోగ్య సేతు, కోవిన్ ఏప్, రైల్ వే రిజర్వేశన్ మరియు కామన్ సర్వీస్ సెంటర్ స్ వంటి ఉదాహరణల ను ఇచ్చారు. ఈ నిర్ణయాల ద్వారా, ప్రభుత్వం పౌరుల యొక్క జీవన సౌలభ్యాన్ని పెంచివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రభుత్వాని కి విషయాల ను తెలియ జేయడం సులభం గా ఉంది అనేటటువంటి భావన ప్రజల లో కలగడం గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించి, ఈ పక్షాలు రెండిటి మధ్య సంభాషణ సులభం అయిపోయింది మరి ప్రజలు సత్వర పరిష్కారాల ను అందుకొంటున్నారు అని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను వ్యవస్థ కు సంబంధించిన ఇబ్బందుల ను మానవ ప్రమేయాని కి తావు లేకుండా పరిష్కరిస్తున్న ఉదాహరణల ను ఆయన ఇచ్చారు. ‘‘ప్రస్తుతం మీ యొక్క ఇక్కట్టు లు మరియు వాటి నివారణల కు మధ్య ఏ వ్యక్తీ ఉండడం లేదు, ఈ సంకటాన్ని సాంకేతిక విజ్ఞానం ఒక్కటే తప్పిస్తున్నది’’ అని ఆయన అన్నారు. వారి సమస్యల ను పరిష్కరించడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు (ఈ ప్రక్రియ లో) ప్రపంచ ప్రమాణాల ను చేరుకోవడం గురించి సామూహికం గా ఆలోచనల ను చేయవలసిందంటూ వేరు వేరు విభాగాల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ‘‘ఒక అడుగు ముందుకు వేసి, మనం ప్రభుత్వం తో సంభాషణ ను మరింత సాఫీ గా మలచ గలిగేందుకు ఆస్కారం ఉన్నటువంటి రంగాల ను గుర్తించ వచ్చును.’’ అని ఆయన అన్నారు.

 

మిశన్ కర్మయోగి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు పౌర సేవ కు పెద్ద పీట వేసేటటువంటి సిబ్బంది గా ఉండాలి అనే ఉద్దేశ్యం తో వారి కి శిక్షణ ను ఇవ్వడం జరుగుతోంది అని తెలియ జేశారు. శిక్షణ పద్ధతుల ను ఎప్పటికప్పుడు సరిక్రొత్తవి గా మలచవలసిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా ఆయన నొక్కి చెప్పారు. పౌరుల వద్ద నుండి అభిప్రాయాల ను సేకరించి, తదనుగుణం గా తగిన మార్పు చేర్పుల ను గనుక ఆచరణ లోకి తీసుకు వస్తే చెప్పుకోదగిన స్థాయి మెరుగుదల ను గమనించవచ్చు అని ఆయన చెప్పారు. శిక్షణ కు మెరుగులు దిద్దడం కోసం తోడ్పడే అభిప్రాయ సేకరణ ను సులభతరం గా మార్చివేసేటటువంటి ఒక వ్యవస్థ ను రూపొందించాలంటూ ప్రధాన మంత్రి సలహా ను ఇచ్చారు.

 

సాంకేతిక విజ్ఞానం ప్రతి ఒక్కరి కి సమానమైన అవకాశాల ను అందిస్తున్నది అని ప్రధాన మంత్రి ఉద్ఘాటిస్తూ, ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానం పరం గా పెద్ద ఎత్తున డబ్బు ను పెట్టుబడి గా పెడుతోందన్నారు. ఆధునికమైన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అందుబాటు లోకి తీసుకు రావడం తోపాటు తత్సంబంధి ప్రయోజనాలు అందరికీ అందేటట్లు గా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం చేపట్టేటటువంటి సేకరణ ల ప్రక్రియ లో చిన్న వ్యాపారస్తుల కు మరియు వీధుల లో తిరుగుతూ సరకుల ను విక్రయించే వారి కి సైతం స్థానాన్ని కల్పిస్తున్న జిఇఎమ్ ( GeM ) పోర్టల్ ను గురించి ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. ఇదే మాదిరి గా వేరు వేరు ప్రాంతాల కు చెందిన కొనుగోలుదారుల తో రైతులు లావాదేవీల ను జరపడాన్ని ఇ-ఎన్ఎఎమ్ ( e-NAM ) సుసాధ్యం చేస్తోంది అని ఆయన అన్నారు.

 

5జి మరియు ఎఐ (ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్) ను గురించి, అవి పరిశ్రమ పైన, వైద్యం పైన, విద్య పైన మరియు వ్యవసాయం పైన ప్రసరింప చేస్తున్నటువంటి ప్రభావాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ కొన్ని లక్ష్యాల ను పెట్టుకోవలసిన అవసరం ఉందన్నారు. సామాన్య పౌరుల సంక్షేమం కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాల ను ఏయే మార్గాల లో ఉపయోగించుకోవచ్చు. శ్రద్ధ వహించవలసినటువంటి రంగాలు ఏమేమిటి అనే అంశాల పై సలహాల ను, సూచనల ను తెలియ జేయవలసింది అంటూ ఆయన అడిగారు. ‘‘ఎఐ ద్వారా పరిష్కరంచ గలిగే సామాజిక సమస్య లు పదింటి ని మనం గుర్తించవచ్చునా’’ అని ఆయన తెలుసుకో గోరారు.

 

ప్రభుత్వం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ఉపయోగాని కి సంబంధించిన కొన్ని ఉదాహరణల ను ప్రధాన మంత్రి ఇస్తూ, కంపెనీ లు మరియు సంస్థ లు వాటి దస్తావేజుల ను భద్రపరచుకోగలిగిన మరియు వాటి ని అవసరం వచ్చినప్పుడు గవర్నమెంటు ఏజెన్సీల కు అందించడాని కి అనువు గా ఉండే డిజిలాకర్ సర్వీసుల ను గురించి మాట్లాడారు. ఈ తరహా సేవల ను విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయా అనేది గమనించాలి, అదే గనుక జరిగితే వీటి ద్వారా మరింత మంది ప్రయోజనాల ను అందుకోవచ్చును అని ఆయన సూచన లు చేశారు.

 

గత కొన్నేళ్ళ లో సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) కు దన్ను గా నిలవడం కోసం అనేకమైన చర్యల ను తీసుకోవడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ఎమ్ఎస్ఎమ్ఇ స్ కు ఎదురవుతున్న అవరోధాలు ఏమేమిటో గుర్తించడాని కి గాను మేధోమథనాన్ని చేపట్టవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారపరం గా చూసినప్పుడు కాలం అత్యంత విలువైంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, చిన్న వ్యాపార సంస్థల కు నియమాల పాలన తాలూకు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని వివరించారు. ప్రభుత్వం నలభై వేల కు పైగా నియమ పాలన సంబంధి అగత్యాల ను ఇదివరకు రద్దు పరచింది; అందువల్ల అవసరం లేనటువంటి నియమాలు ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది పరిశీలన జరపడాని కి ఇదే సరి అయిన తరుణం అని ఆయన సూచించారు.

 

‘‘ప్రజల కు మరియు ప్రభుత్వాని కి మధ్య విశ్వాసం కొరవడడం అనేది బానిస మనస్తత్వం తాలూకు పర్యవసానం’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. చిన్న చిన్న అపరాధాల ను నేరాల పట్టిక లో నుండి తొలగించడం ద్వారా ను, ఎమ్ఎస్ఎమ్ఇ స్ కు రుణ సంబంధి పూచీదారు గా నిలబడడం ద్వారా ను పౌరుల యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వం మళ్లీ సంపాదించింది అని ఆయన చెప్పారు. పౌరుల కు మరియు ప్రభుత్వాని కి మధ్య విశ్వాసాన్ని పాదుకొలపడం కోసం ఇతర దేశాల లో అమలు పరుస్తున్న పద్ధతుల గురించి, మరి ఆయా పద్ధతుల లో అత్యుత్తమమైనటువంటి విధానాల నుండి పాఠాల ను నేర్చుకోవలసి ఉంది అని కూడా ఆయన నొక్కి చెప్పారు.

 

సాంకేతిక విజ్ఞానం యొక్క పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, తుది రూపు ను దిద్దుకొన్న ఒక ఉత్పాదన అనేది ప్రపంచ బజారు లోకి అడుగు పెట్టడం లో సాంకేతిక విజ్ఞానం సాయపడగలదన్నారు. ఎవరైనా ఇంటర్ నెట్ మీదో, డిజిటల్ టెక్నాలజీ మీదో మాత్రమే ఆధారపడకూడదు అంటూ ఆయన సలహా ను ఇచ్చారు. బడ్జెటు గాని, లేదా ప్రభుత్వ విధానం ఏదైనా గాని దాని యొక్క సాఫల్యం దానిని ఎంత బాగా తయారు చేయడమైంది అనే అంశం పైనే గాక సదరు అంశాని కి ప్రజలు సహకరించడం ముఖ్యమనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చాటి చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. భారతదేశం లో ప్రతిభ గల యువత, నైపుణ్యం కలిగిన శ్రమ శక్తి, సాంకేతిక విజ్ఞానాన్ని అక్కున చేర్చుకోవడాని కి పల్లెలు ముందుకు వస్తూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ అంశాల నుండి మరింత గా ప్రయోజనాల ను అందుకోగలిగే మార్గాల ను అన్వేషించాలని సూచించారు. ‘‘బడ్జెటు నుండి అత్యధిక ప్రయోజనాల ను పొందడం ఎలాగ అనే విషయం పైన మీరు తప్పక చర్చించాలి సుమా’’ అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

 

***

DS/TS

 

 (Release ID: 1903037) Visitor Counter : 90