పర్యటక మంత్రిత్వ శాఖ
2023 ఫిబ్రవరి 26న జమ్మూలోని భదేర్వాలో మొదటి స్నో మారథాన్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
స్నో మారథాన్ లో పాల్గొన్న 130 మందికి పైగా రన్నర్లు
Posted On:
27 FEB 2023 11:58AM by PIB Hyderabad
రియల్ స్పోర్ట్స్ ఇండియా, స్థానిక యంత్రాంగం , అమేజింగ్ భదెర్వా టూరిజం అసోసియేషన్ (ఎబిటిఎ) సహకారంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ (ఉత్తరం ) 2023 ఫిబ్రవరి 26న జమ్మూలోని భదేర్వాలో మొదటి స్నో మారథాన్ నిర్వహించింది. తొలిసారిగా నిర్వహించిన జమ్మూ స్నో రన్ సఫారీ ని డిఓడిఎ డిప్యూటీ కమిషనర్ /డిఎం శ్రీ విశేష్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించారు.మారథాన్ లో పాల్గొన్న వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మారథాన్ నిర్వాహకులు, మారథాన్లో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడారు. మారథాన్ వంటి సాహస క్రీడా కార్యక్రమాలు ప్రోత్సహించాలని కోరిన శ్రీ మహాజన్ క్రీడాభిమానులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గుల్దండా (భదేర్వా) వద్ద స్నో రన్ సఫారీ వంటికార్యక్రమాలు నిర్వహించడానికి సౌకర్యాలున్నాయని ఆయన అన్నారు.
కో-రాష్ట్రీయ రైఫిల్స్, ఎస్ఎస్పీ- దోడా, సిక్కిం పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పర్యాటక ప్రభుత్వ ప్రతినిధి, కేంద్ర పర్యాటక శాఖ ( ఉత్తరం), భదేర్వా అభివృద్ధి సంస్థ వంటి వివిధ శాఖల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్నో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జీ-20 అధ్యక్ష హోదాలో వ్యవహరిస్తున్న సమయంలో దేఖో అప్నా దేశ్, యువ టూరిజం క్లబ్ , ఫిట్ ఇండియా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్నో మారథాన్ కార్యక్రమాన్నినిర్వహించారు. స్నో మారథాన్ పట్ల పర్యాటకులు,సాహస ఔత్సాహికులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటైన కార్యక్రమం మారథాన్ సాహస స్ఫూర్తిని పెంచుతుంది. జిల్లా అభివృద్ధి మండలి, జిల్లా యంత్రాంగం, ఇండియన్ ఆర్మీ, జమ్మూ విశ్వవిద్యాలయం భదేర్వా క్యాంపస్ సహకారంతో స్నో మారథాన్ నిర్వహించారు. స్నో మారథాన్ కార్యక్రమాన్ని అనేక మంది పాఠశాల విద్యార్థులు తిలకించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి యువ టూరిజం క్లబ్ లను ఏర్పాటు చేయాలని, యువత భాగస్వామ్యంతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని పాఠశాల/ కళాశాల ఉపాధ్యాయులు/ లెక్చరర్లకు అధికారులు సూచించారు.
స్నో మారథాన్ లో దేశం నలుమూలల నుంచి 130 మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. గుల్దండా నుంచి మారథాన్ ప్రారంభమయ్యింది. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మరియు 25 కిలోమీటర్లు దూరాన్ని క్రీడాకారులు పూర్తి చేశారు. భదేర్వాను కప్పి ఉంచిన మంచు అందరి కళ్ళకు ఆహ్లాదాన్ని, విందును ఇచ్చింది. స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారిని ఉత్సాహపరిచారు. రాబోయే సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పర్యాటక మంత్రిత్వ శాఖ భావిస్తోంది
***
(Release ID: 1902769)
Visitor Counter : 143