నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

28న దిబ్రూఘర్‌లో తన తొలి ప్రయాణాన్ని ముగించనున్న 'ఎంవీ గంగా విలాస్'


- గమ్యస్థానం చేరుకోనున్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ 'ఎంవీ గంగా విలాస్'

- క్రూయిజ్ నౌక స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్న శ్రీ సర్బానంద

- జ‌న‌వ‌రి 13న వార‌ణాసిలో క్రూయిజ్ నౌకకు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ

- భారతదేశం- బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల ద్వారా 50 రోజుల పాటు ప్రయాణం సాగించిన 'ఎంవీ గంగా విలాస్'

- ప్రపంచంలోని ఒకే నది ఓడ ద్వారా ఒకే పొడవైన నది ప్రయాణం

- ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ భారత ఉపఖండంలో పర్యాటకులకు కొత్త విధానాన్ని పరిచయం చేసింది

- 'ఎంవీ గంగా విలాస్'లో వచ్చే రెండేండ్ల సమయానికి సంబంధించిన బుకింగులు ఇప్పటికే పూర్తి

- గౌహతి తర్వాత మొత్తం ఈశాన్య భారతానికి సేవలందించే రెండవ వ్యాపార కేంద్రంగా దిబ్రూగర్ అవతరణ

Posted On: 25 FEB 2023 3:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జ‌న‌వ‌రి 13న వార‌ణాసి నుండి ప్రారంభించిన, ప్రపంచంలోనే అతి పొడవైన న‌దీ విహార యాత్ర నౌక ‘ఎమ్‌వీ గంగా విలాస్’  ఫిబ్రవరి 28న దిబ్రూఘర్‌కు చేరుకొని తన తొలి ప్రయాణాన్ని ముగించనుంది. అదే రోజు డిబ్రూఘర్‌లో భారత ప్రభుత్వ నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఏఐ) ఈ క్రూయిజ్ నౌకకు స్వాగత వేడుకను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల (ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు) మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, దౌత్యవేత్తలు మరియు ఐడబ్ల్యుఏఐ & ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు అధికారులు హాజరుకానున్నారు. భారతదేశంలో తయారు చేయబడిన 'ఎంవీ గంగా విలాస్' క్రూయిజ్ నౌకకు ఈ ఏడాది జనవరి 13న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.. ఆ తర్వాత వారణాసి నుండి ఈ నౌక తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ క్రూయిజ్ 50 రోజులలో 3,200 కి.మీల దూరం ప్రయాణించి పాట్నా సాహిబ్, బోధ్ గయ, విక్రమశిల, ఢాకా, సుదర్‌బన్స్ మరియు కాజిరంగా జాతీయ ఉద్యానవనాల మీదుగా ఫిబ్రవరి 28న డిబ్రూఘర్ చేరుకుంటుంది.

 

భవిష్యత్తు దృష్టితో ప్రత్యేకమైన డిజైన్ ద్వారా నిర్మించబడిన ఈ క్రూయిజ్‌లో మూడు డెక్‌లు, 18 సూట్‌లు ఉంటాయి. మొత్తం 36 మంది పర్యాటకుల సామర్థ్యం దీని సొంతం.  రాబోయే రెండేళ్ల కాలానికి ఈ క్రూయిజ్ నౌకలో ప్రయాణించేందుకు సంబంధించిన బుకింగ్లు పూర్తయ్యాయి.

కొత్త అధ్యాయాన్ని తెరతీస్తుంది..

మంత్రి శ్రీ సోనోవాల్ మాట్లాడుతూ ''ఎంవీ గంగా విలాస్' భారతదేశం, బంగ్లాదేశ్‌లను రివర్ క్రూయిజ్ మ్యాప్‌లో నిలిపిందని, తద్వారా భారత ఉపఖండంలో పర్యాటకం మరియు సరుకు రవాణా కోసం కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఆధ్యాత్మికతను కోరుకునే పర్యాటకులు కాశీ, బోధ్ గయ, విక్రమశిల, పాట్నా సాహిబ్ వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది మరియు ప్రకృతి వైవిధ్యాన్ని చూసే ఆసక్తి కలిగినవారు సుందర్‌బన్స్ మరియు కాజిరంగా వంటి గమ్యస్థానాలను కూడా ఈ క్రూయిజ్ ప్రయాణం  కవర్ చేస్తుంది. ఈ మార్గం భారతదేశం మరియు బంగ్లాదేశ్‌కు అంతర్గత జలమార్గాల ద్వారా సరుకు రవాణాకు కొత్త అధ్యాయాన్ని తెరతీస్తుంది. ఇప్పుడు ఈ ప్రయాణం ద్వారా, పర్యాటకులు అనుభవపూర్వకమైన జలయానంలో ప్రయాణించడానికి, భారతదేశం మరియు బంగ్లాదేశ్ యొక్క కళ, సంస్కృతి, చరిత్ర మరియు ఆధ్యాత్మికతను తెలుసుకొనేందుకు  అవకాశం కలిపిస్తుంది. ”  అని అన్నారు. జాతీయ జలమార్గాల (ఎన్.డబ్ల్యు) ద్వారా సరుకు రవాణాకు ఈశాన్య భారతానికి భారీ సామర్థ్యం ఉంది. ఈ జాతీయ జలమార్గాలు అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోతట్టు ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తాయి. ఈ రాష్ట్రాలను భారతదేశ ప్రధాన భూభాగంతో మరియు ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గం ద్వారా కోల్‌కతా మరియు హల్దియా సముద్ర ఓడరేవులతో కలుపుతుంది. ఈశాన్య ప్రాంతంలో ఐడబ్ల్యుఏఐ ద్వారా ఫెయిర్‌వే, టెర్మినల్స్ మరియు నావిగేషన్ ఎయిడ్స్ వంటి అంతర్గత జల రవాణా అవస్థాపన అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులు పూర్తయ్యాయి, వాటిలో కొన్ని పురోగతిలో ఉన్నాయి. 2017 సంవత్సరంలో నిర్వహించిన ఐ.డబ్ల్యు.ఎ.ఐ అంతర్గత అధ్యయనం ప్రకారం, 49 ఎంఎంటీపీఏల కార్గోను ఈశాన్య ప్రాంతం నుంచి ఎగుమతి, దిగుమతి అవుతుంటుంది. స్థాయినిక ఈశాన్య ప్రాంతానికి సంబంధించే ~30 ఎంఎంటీపీఏల కార్గో తరలిస్తుంది.

****


(Release ID: 1902423) Visitor Counter : 203