సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
31వ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో తన పుస్తకాలను, జర్నళ్ళను ప్రదర్శించనున్న పబ్లికేషన్స్ డివిజన్
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 25 ఫిబ్రవరి నుంచి 5 మార్చి, 2023 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించనున్న మెగా పుస్తక ప్రదర్శనలో విస్తృతమైన పుస్తక, జర్నళ్ళ సంగ్రహాలను ప్రదర్శించేందుకు సంసిద్ధంగా ఉన్న సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, పబ్లికేషన్స్ డివిజన్
Posted On:
24 FEB 2023 4:20PM by PIB Hyderabad
దేశంలోనే అత్యంత ప్రాచుర్యం, ప్రశంసలు పొందిన పుస్తక ప్రదర్శనలలో ఒకటైన న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 31వ ప్రదర్శనలో భారత ప్రభుత్వానికి చెందిన ప్రధాన ప్రచురణ సంస్థ పబ్లికేషన్స్ డివిజన్ ఉత్తమమైన తమ పుస్తకాలను, జర్నళ్ళను ప్రదర్శించనుంది. సాగే ఈ మెగా పుస్తక ప్రదర్శనను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 25 ఫిబ్రవరి నుంచి 5 మార్చి 2023వరకు, తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్‌తో కలిసి నిర్వహిస్తోంది.
భారత స్వాతంత్రోద్యమం ప్రధానంగా, దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్ర సమరయోధులనను గుర్తు చేసుకునే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పుస్తక సంగ్రహాలను పబ్లికేషన్స్ డివిజన్ ప్రదర్శించనుంది. ప్రదర్శించనున్న ఈ పుస్తకాలలో చరిత్ర, కళ, సంస్కృతి, గాంధీ సాహిత్యం, భూమి, ప్రజలు, వ్యక్తిత్వాలు, జీవితచరిత్రలు, సినిమా, పిల్లల సాహిత్యంతో ఇంకా అనేక అంశాలతో కూడిన శీర్షికలు కూడా ఉండనున్నాయి. ఇవే కాకుండా, కేవలం పబ్లికేషన్స్ డివిజన్ మాత్రమే ప్రచురించే రాష్ట్రపతి భవన్ సిరీస్ పుస్తకాలతో పాటు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రుల ఉపన్యాసాలను డివిజన్ అందచేయనుంది. సమాచారమే ప్రధానంగా ఉండే ఈ సంగ్రహాల శీర్షికలు భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని గురించి లోతైన అవగాహనను కల్పించడంతో పాటు, సమకాలీన సమస్యలపై అంతర్దృష్టిని అందిస్తాయి.
పుస్తకాలు మాత్రమే కాకుడా డివిజన్ ప్రచురించే యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్ వంటి ప్రముఖ జర్నళ్ళు కూడా ఈ బుక్‌స్టాల్‌లో అందుబాటులో ఉంటాయి. పిల్లల పత్రిక బాలభారతి కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఉంటుంది. దీనితో పాటుగా డివిజన్ ప్రచురించే అత్యంత డిమాండ్‌లో ఉండ వారాంతపు ఎంప్లాయ్‌మెంట్ దినపత్రిక ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (రోజ్‌గార్ సమాచార్) కూడా అందుబాటులో ఉంటుంది.
పబ్లికేషన్స్ డివిజన్ తన పుస్తకాలను, జర్నళ్ళను న్యూఢిల్లీలోని, ప్రగతి మైదాన్‌లో హాల్ నెం.5, స్టాల్ నెం. 171 -186లో ప్రదర్శించనుంది.
పబ్లికేషన్స్ డివిజన్ గురించిః
భారతీయ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలను పట్టి చూపే పుస్తకాలు, జర్నళ్ళ కోశాగారం పబ్లికేషన్స్ డివిజన్. 1941లో ఏర్పాటైన పబ్లికేషన్స్ డివిజన్ అభివృద్ధి, భారత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, జీవిత చరిత్రలు, సైన్సు, టెక్నాలజీ, పర్యావరణం, ఉపాధి వంటి భిన్న ఇతివృత్తాలతో వివిధ భాషలలో పుస్తకాలను, జర్నళ్ళను అందించే భారత ప్రభుత్వ ప్రధాన ప్రచురుణ సంస్థ.
పాఠకులు, ప్రచురుణ కర్తలలో విశ్వసనీయతను కలిగి ఉండటమే కాక, విషయాంశాల వాస్తవిక పట్ల గుర్తింపు కలిగిన సంస్థ ఈ డివిజన్.
డివిజన్ ప్రతిష్ఠాత్మక ప్రచురణలలో ప్రాచుర్యం పొందిన మాసపత్రికలైన యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్‌తో పాటుగా వారాంతపు ఎంప్లాయ్‌మెంట్ పత్రిక ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్ ఉన్నాయి. వీటికి అదనంగా, పబ్లికేషన్ డివిజన్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఉల్లేఖ పుస్తకమైన వార్షిక ఇండియా ఇయర్ బుక్‌ను పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురిస్తుంది.
***
(Release ID: 1902310)
Visitor Counter : 179