యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మూడు రోజుల ఆలిండియా తైక్వాండో ఛాంపియన్ షిప్ ను రేపు ప్రారంభించనున్న శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


కొరియా-భారత్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఛాంపియన్ షిప్ నిర్వహణ

కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్శిటీ పెర్ఫార్మెన్స్ టీం ప్రత్యేక ప్రదర్శనలు, ఇరు దేశాల మధ్య తైక్వాండో పునరుజ్జీవనం కోసం ఎంవోయూ సంతకాల కార్యక్రమం

Posted On: 23 FEB 2023 2:22PM by PIB Hyderabad

2023లో కొరియా-భారత్ దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ సంయుక్తంగా ఆల్ ఇండియా ఇంటర్ ఎస్ ఎ ఐ  తైక్వాండో ఛాంపియన్ షిప్ ను నిర్వహిస్తున్నాయి.

 

ఈ సారి అఖిల భారత తైక్వాండో ఛాంపియన్ షిప్ ను ఇరు దేశాల మధ్య స్పోర్ట్స్ ఎక్స్ఛేంజ్ ఈవెంట్ గా ఫిబ్రవరి 24 (శుక్రవారం) నుంచి ఫిబ్రవరి 26 (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలోని కేడీ జాదవ్ ఇండోర్ రెజ్లింగ్ హాల్ లో నిర్వహించనున్నారు. కొరియా, భారత్ మధ్య దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మహమ్మారి సమయం నుంచి స్తంభించిపోయిన తైక్వాండోను పునరుజ్జీవింపజేసేందుకు, ఇరు దేశాల మధ్య ప్రధాన క్రీడా కార్యక్రమంగా భవిష్యత్తుకు పునాది వేసేందుకు ఈ ఛాంపియన్ షిప్ నిర్వహణకు రూపకల్పన చేశారు.

 

ఫిబ్రవరి 24న ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, భారత్ లో కొరియా రాయబారి చాంగ్ జే బోక్, డిప్యూటీ మినిస్టర్ అండ్ పబ్లిక్ డిప్లొమసీ అంబాసిడర్ లీ సంగ్ హ్వా, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ చాన్స్ లర్ అహ్న్ యోంగ్ క్యూ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో ఇరు దేశాల మధ్య క్రీడా మార్పిడి రంగంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీకి చెందిన ప్రదర్శన బృందాలచే ప్రత్యేక ప్రదర్శనలు, కొరియన్ నృత్యం (సాంప్రదాయ, ఆధునిక, ఆచరణాత్మక), తైక్వాండో ప్రదర్శన ,కె-పాప్ కవర్ నృత్యం ఉంటాయి.

 

మూడు రోజుల పాటు జరిగే తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు పూమ్సే , క్యోరుగి అని పిలువబడే స్పారింగ్ అనే రెండు భాగాలుగా జరుగుతాయి: స్పారింగ్, క్యోరుగి విభాగం క్రీడాకారుల వయస్సు, బరువులో ప్రపంచ తైక్వాండో సమాఖ్య పోటీ నియమాల ప్రకారం విభజించబడుతుంది .పూమ్సే విభాగాన్ని పురుషులు మహిళల విభాగాలుగా మాత్రమే విభజిస్తారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 79 ప్రాంతీయ కేంద్రాలు, ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలో నమోదైన ఎలైట్ తైక్వాండో క్రీడాకారులు మాత్రమే స్పారింగ్ విభాగంలో పాల్గొంటారు, పూమ్సే కేటగిరీ లో కుక్కివోన్-సర్టిఫైడ్ తైక్వాండో డాన్ సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రతి విభాగంలో బంగారు పతకాలు సాధించిన 10 క్యోరుగి, 2 పూమ్సే విజేతలు కొరియా ప్రభుత్వ మద్దతుతో కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని సందర్శించి, ఉత్తమ ప్రొఫెసర్ల నుండి సుమారు 3 వారాల పాటు విద్య శిక్షణ కార్యక్రమాన్ని బహుమతిగా అందుకుంటారు.

 

ఫిబ్రవరి 24 న ఆల్ ఇండియా తైక్వాండో టోర్నమెంట్ ఈవెంట్ ప్రారంభోత్సవం తరువాత, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ,ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మిరాండా హౌస్ మధ్య మరొక అవగాహన ఒప్పందంపై సంతకం కార్యక్రమం ,కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రత్యేక ప్రదర్శనలు మిరాండా హౌస్ ఆడిటోరియంలో జరుగుతాయి.

 

కొరియా ప్రభుత్వం ఢిల్లీ విశ్వవిద్యాలయాన్ని భారతదేశంలోని ఉత్తమ, అతిపెద్ద విశ్వవిద్యాలయంగా గుర్తించింది, ఇది మొత్తం 91 కళాశాలలను కలిగి ఉంది.  మిరాండా హౌస్ 2017 నుండి 2021 వరకు వరుసగా ఐదుసార్లు భారత విద్యా మంత్రిత్వ శాఖ మూల్యాంకనం ఆధారంగా భారతదేశంలో ఉత్తమ ,ప్రాతినిధ్య కళాశాలగా ఎంపికైంది. రెండు జాతీయ ప్రాతినిధ్య ఉన్నత విద్యా సంస్థల మధ్య అవగాహన ఒప్పందంపై ఆధారపడిన మొదటి ప్రాజెక్టుగా, కొరియా నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ నుండి పంపిన ప్రొఫెసర్ ఈ సంవత్సరం ప్రథమార్ధం నుండి మిరాండా హౌస్ లో తైక్వాండో ప్రొఫెషనల్ థియరీ ,ప్రాక్టీస్ తరగతులను నిర్వహిస్తారు.

 

కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా డైరెక్టర్ హ్వాంగ్ ఇల్ యోంగ్ మాట్లాడుతూ, "ఈ తైక్వాండో ఛాంపియన్ షిప్ ఈవెంట్ , రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం కొరియా- భారతదేశం మధ్య క్రీడా మార్పిడిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తునట్టు చెప్పారు. ‘మిరాండా హౌస్‌లో టైక్వాండోను ఒక కోర్సుగా ఎంపిక చేయడం ప్రారంభించి, భారతీయ అగ్రశ్రేణి మేధావి స్త్రీ ,విద్యకు గుండెకాయగా, టైక్వాండో సబ్జెక్ట్ క్రమంగా భారతదేశంలోని విద్యా రంగం అంతటా ఒక సాధారణ సబ్జెక్ట్ కోర్సుగా వ్యాప్తి చెందుతుందని ఆశిస్తున్నాము‘ అన్నారు.

 

*****


(Release ID: 1901874) Visitor Counter : 168