నౌకారవాణా మంత్రిత్వ శాఖ

ఓడరేవుల్లో 60% పెరగనున్న పునరుత్పాదక ఇంధన వాటా : శ్రీ సర్బానంద సోనోవాల్


హైడ్రోజన్ హబ్ లుగా మూడు ప్రధాన రేవులు- పారాదీప్ పోర్టు, దీన్ దయాళ్ పోర్టు,వీవో చిదంబరనార్ పోర్టుల  అభివృద్ధి: సోనోవాల్

Posted On: 21 FEB 2023 2:37PM by PIB Hyderabad

ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎం ఒ పి ఎస్ డబ్ల్యూ)

సలహాసంప్రదింపుల కమిటీ ఈ రోజు ముంబైలో 'గ్రీన్ పోర్ట్ అండ్ గ్రీన్ షిప్పింగ్' పై చర్చలు జరిపింది. ఈ సమావేశంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్, ఎంపీ, దక్షిణ ముంబై శ్రీ అరవింద్ జి. సావంత్, ఎంపీ, ముంబై నార్త్ ఈస్ట్ శ్రీ మనోజ్ కోటక్, ఎంపీ, కాకినాడ శ్రీమతి గీతా విశ్వనాథ్ వంగ, ఎం ఒ పి ఎస్ డబ్ల్యూ కార్యదర్శి శ్రీ సుధాంష్ పంత్, ముంబై పోర్టు చైర్మన్ రాజీవ్ జలోటా, జె ఎన్ పీఏ చైర్మన్ సంజయ్ సేథీ, శ్రీ మధు ఎస్ నాయర్, చైర్మన్, సిఎస్ఎల్; -కెప్టెన్ బినేష్ కుమార్ త్యాగి, చైర్మన్, ఎస్ సి ఐ , డాక్టర్ జార్జ్ యేసు వేద విక్టర్, ఎండీ, డీసీఐ , ఎంవోపీఎస్ డబ్ల్యూ అదనపు కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సిన్హా, ఎంఒపిఎస్ డబ్ల్యు జాయింట్ సెక్రటరీ శ్రీ సుశీల్ కుమార్ సింగ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

 

ఎం ఐ వి గ్రీన్ షిప్పింగ్, గ్రీన్ షిప్పింగ్ చొరవ కింద 2030 ప్రధాన నౌకాశ్రయాలు పోర్ట్ , షిప్పింగ్ రంగం నుండి జి హెచ్ జి (గ్రీన్ హౌస్ వాయువులు) ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే వివిధ కార్యకలాపాలను అమలు చేశాయి ప్రారంభించాయి. సముద్ర రంగాన్ని హరిత, సుస్థిరంగా మార్చడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో సహాయ పడ్డాయి. షోర్-టు-షిప్ పవర్, విద్యుత్తుతో నడిచే పోర్ట్ పరికరాల వాడకం, ప్రోత్సాహం, ఎల్ఎన్ జి/ సిఎన్ జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం, ఎల్ఎన్ జి/ సిఎన్ జి హైడ్రోజన్, అమ్మోనియా మొదలైన పర్యావరణ అనుకూల ఇంధనాల కోసం నిల్వ, బంకరింగ్ సౌకర్యాలు, సౌర శక్తి, పవన శక్తి, టైడల్ పవర్ తో సహా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మార్పు వంటి కార్యకలాపాలను దేశంలోని పలు మేజర్ పోర్టుల లో ఇప్పటికే ప్రారంభించారు.

 

శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ పునరుత్పాదక ఇంధన వాటాను దాని ప్రతి ప్రధాన నౌకాశ్రయం మొత్తం విద్యుత్ డిమాండ్ లో 10% కంటే తక్కువ వాటా నుండి 60% కు పెంచాలని భావిస్తోంది. 2030 నాటికి ప్రతి టన్ను సరుకు రవాణాలో కార్బన్ ఉద్గారాలను 30% తగ్గించాలని నౌకాశ్రయాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధాన మంత్రి విడుదల చేసిన మారిటైమ్ విజన్ డాక్యుమెంట్-2030, సుస్థిరమైన సముద్ర రంగం ,శక్తివంతమైన నీలి ఆర్థిక వ్యవస్థపై భారతదేశ దృక్పథంతో కూడిన 10 సంవత్సరాల బ్లూప్రింట్‘‘ అని అన్నారు.

 

నేషనల్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ను నిర్వహించడానికి, నిల్వ చేయడానికి ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ హబ్ లుగా అభివృద్ధి చేసేందుకు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ పారాదీప్ పోర్ట్, దీన్ దయాళ్ పోర్ట్ విఓ చిదంబరార్ పోర్టులను గుర్తించి నామినేట్ చేసిందని శ్రీ సోనోవాల్ తెలిపారు.

 

ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రధాన ఓడరేవులలో గ్రీన్ పోర్ట్ కార్యక్రమాలను చేపట్టింది, తద్వారా వాటి పర్యావరణ పనితీరును మెరుగుపరచవచ్చు. పర్యావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి పరికరాల సేకరణ, ధూళి అణచివేత వ్యవస్థల కొనుగోలు, ఓడరేవులు, నౌకల కోసం ఎస్టీపీ చెత్త తొలగింపు వ్యవస్థ ఏర్పాటు, నౌకల నుంచి వచ్చే వ్యర్థాల కోసం తీర రిసెప్షన్ సదుపాయాన్ని అభివృద్ధి చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఇంధన ఉత్పత్తి కోసం ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం, బెర్తుల వద్ద నౌకలకు తీర విద్యుత్తును అందించడం, అన్ని పోర్టుల్లో ఆయిల్ స్పిల్ రెస్పాన్స్ (టైర్-1) సామర్థ్యాలను సృష్టించడం ,హార్బర్ నీటి నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం, టెర్మినల్ డిజైన్, అభివృద్ధి కార్యకలాపాలలో స్థిరమైన పద్ధతులను చేర్చడం, పోర్టు ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం మొదలైన చర్యలు ఉన్నాయి.

 

గ్రీన్ షిప్పింగ్ వాటాను పెంచడానికి, భారతదేశంలోని అతిపెద్ద నౌకానిర్మాణం, నిర్వహణ సదుపాయమైన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా వివిధ ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి. వీటిలో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఫెర్రీలు, అటానమస్ జీరో-ఎమిషన్ వెసెల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీపై పైలట్ ప్రాజెక్ట్, ఎలక్ట్రిక్ కాటమరన్ వాటర్ ట్యాక్సీ, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ రో-రో, హైబ్రిడ్ ఎల్ఎన్జి-ఎలక్ట్రిక్ ఇన్లాండ్ కార్గో క్యారియర్, హైబ్రిడ్ టగ్స్ వంటి గ్రీన్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ ఉన్నాయి.

12 ప్రధాన ఓడరేవులు చేపట్టిన హరిత కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ రంగంలో హరిత విప్లవాన్ని తీసుకువస్తాయి, ఇది 'బ్లూ ఎకానమీ'లో కీలక భాగం, పర్యావరణ ప్రయోజనాలను సృష్టిస్తుంది. ఇంకా పెట్టుబడులు , నగదు ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది.

***



(Release ID: 1901291) Visitor Counter : 153