నీతి ఆయోగ్
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం
అటల్ ఇన్నోవేషన్ మిషన్ నేతృత్వంలో దేశంలో ఆవిష్కరణ రంగాన్ని పటిష్టం చేయడానికి అమలు చేయాల్సిన చర్యలు చర్చించనున్న సమావేశం
प्रविष्टि तिथि:
21 FEB 2023 2:07PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ మిషన్ అమలు చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం విద్య, నైపుణ్యాల అభివృద్ధి మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన సోమవారం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ సాధించిన పురోగతి భవిష్యత్తు ప్రణాళికలను ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. గత ఏడాది అటల్ ఇన్నోవేషన్ మిషన్ సాధించిన ప్రగతిని,అమలు చేసిన కార్యక్రమాలను సమావేశం సమీక్షించింది. భవిష్యత్తులో అమలు చేయాల్సిన కార్యక్రమాలు సమావేశంలో చర్చకు వచ్చాయి.
దేశంలో ఆవిష్కరణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యార్థులు, యువతకు వ్యవస్థాపకత రంగం పట్ల ఆసక్తి కలిగేలా చర్యలు అమలు చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా టైర్ 2/3 నగరాల్లోని ఉన్నత విద్యా సంస్థల్లో కార్యక్రమం అమలు జరగాలన్నారు. ఔత్సాహిక ఆవిష్కర్తలకు మద్దతును అందించడానికి, వనరులు అందుబాటులోకి తీసుకు రావడానికి సాంకేతికత, డిజిటల్ వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించాలి అని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 కింద ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి రూపొందించిన కార్యక్రమాలను కమిటీ చర్చించింది. విద్యార్థులందరికీ టింకరింగ్ తీసుకురావడం, సెక్టోరల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లు, ఇండస్ట్రీ యాక్సిలరేటర్లు లాంటి ఆధునిక సౌకర్యాలతో వివిధ రంగాలు, రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఆవిష్కరణ రంగాన్ని అభివృద్ధి చేయడం,సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కొత్త ఇంక్యుబేటర్లను స్థాపించడానికి మరియు సంబంధిత డొమైన్‌లో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి PSU లతో కలిసి AIM యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేశారు. పాఠశాలలు మరియు ఉన్నత విద్యా సంస్థలలో ఆవిష్కరణ పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి AIM మరియు విద్యా మంత్రిత్వ శాఖను ఆయన సిఫార్సు చేశారు.
సమావేశం అనంతరం శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ "దేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపక రంగాలను ప్రోత్సహించడంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ గణనీయమైన పురోగతిని సాధించింది. ఆవిష్కరణ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి చర్యలు కొనసాగుతాయి. ఔత్సాహిక ఆవిష్కర్తలకు వనరులు అందుబాటులోకి తెచ్చి సహకారం అందించాలి. కొత్తగా అమలు చేయనున్న కార్యక్రమాల వల్ల దేశంలో ఒక శక్తివంతమైన ఆవిష్కరణల వ్యవస్థను అభివృద్ధి చెందుతుంది." అని అన్నారు.
అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉన్నత స్థాయి కమిటీకి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి
డాక్టర్ జితేంద్ర సింగ్, నీతి ఆయోగ్ సీఈఓ , విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, సాంకేతిక మంత్రిత్వ శాఖ, శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మంత్రిత్వ శాఖ, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కార్యదర్శులు, ప్రైవేటు రంగం విద్యాసంస్థల సభ్యులు తో సహా మిషన్ ఉన్నత స్థాయి కమిటీ లోని ఇతర సభ్యులు వివిధ అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించారు. .
దేశంలో ఆవిష్కరణ, వ్యవస్థాపక రంగం అభివృద్ధి కోసం అటల్ ఇన్నోవేషన్ మిషన్ కృషి చేస్తోంది. ఆవిష్కరణ, వ్యవస్థాపక రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని స్థాయి కమిటీ సమావేశం నిర్ణయించింది.
***
(रिलीज़ आईडी: 1901092)
आगंतुक पटल : 294