రైల్వే మంత్రిత్వ శాఖ
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ఆధ్వర్యంలో 18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్‌ను నిర్వహణ
' రైల్వే భద్రతా వ్యూహం: స్పందన భవిష్యత్తు అవసరాలు' ఇతివృత్తంగా సమావేశాలు
డీజీ ఆర్ఫీఎఫ్ అధ్యక్షతన ప్రపంచ భద్రతా కాంగ్రెస్‌ను నిర్వహణ
Posted On:
20 FEB 2023 11:16AM by PIB Hyderabad
యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ (యూఐసి) లేదా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (యూఐసి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సంయుక్తంగా జైపూర్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నుంచి 23 ఫిబ్రవరి వరకు 18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్‌ను నిర్వహించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ (యూఐసి ) లేదా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (యూఐసి) రైలు రవాణా ను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో రైల్వే భద్రతా రంగంలో ప్రధాన భద్రత, చట్ట అమలు సంస్థగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పి ఎఫ్} పనిచేస్తున్నది.
18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్

భారతదేశంలో ప్రధాన రైల్వే భద్రతా సంస్థగా పనిచేస్తున్న రైల్వే భద్రతా దళం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైల్వే భద్రత రంగంలో దేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ భద్రతా శాఖ అధ్యక్షునిగా అధ్యక్షుడిగా ఆర్పీఎఫ్ డీజీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్పీఎఫ్ డీజీ ఒకే విధమైన జనాభా నమూనా కలిగి ఉన్న ఆసియా, ఆఫ్రికా దేశాలతో పాటు అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన సభ్య దేశాల మధ్య సమన్వయం సాధించడానికి కృషి ప్రారంభించారు. సభ్య దేశాలు కలిసి ఒకే వేదిక ద్వారా పనిచేయడం వల్ల తమ అభిప్రాయాలు వివరించి, వేదిక ద్వారా సమస్యలను పరిష్కరించడానికి వీలవుతుంది. భారతదేశం జీ -20 గ్రూప్ దేశాల అధ్యక్ష పదవిని చేపట్టిన నేపథ్యంలో ; పింక్ సిటీ జైపూర్‌లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ 18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్‌ను నిర్వహించనుంది.
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ సభ్య సంస్థల ప్రతినిధులు (సెక్యూరిటీ ప్రతినిధులు) పాల్గొనే కాంగ్రెస్ సమావేశాలకు ఆర్పీఎఫ్ ఆతిథ్యం ఇస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భారతదేశం తన సాంస్కృతిక వారసత్వం, శక్తి సామర్ధ్యాలు,సాధించిన పురోగతిని తగిన అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. 18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్ రూపంలో భారతదేశానికి ఈ అవకాశం లభించింది.
' రైల్వే భద్రతా వ్యూహం: స్పందన భవిష్యత్తు అవసరాలు' ఇతివృత్తంగా 18వ ప్రపంచ భద్రతా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అనుబంధంగా పనిచేస్తున్న రైల్వే సంస్థల సెక్యూరిటీ అధిపతులు, సభ్య దేశాల ప్రతినిధులు, భారతీయ రైల్వేలు, రైల్వే భద్రతా దళం, సీనియర్ పోలీసు అధికారులు. సమావేశాలకు హాజరవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైల్వే భద్రతా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడానికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని . ప్రపంచవ్యాప్తంగా రైల్వే భద్రతకు సంబంధించిన సమస్యలు , సవాళ్లపై ప్రభావవంతమైన చర్చలు నిర్వహించడానికి రైల్వే భద్రతా దళం సిద్ధంగా ఉంది. ప్రధానమైన సమస్యలపై చర్చలు జరిగి పరిష్కార మార్గాలు సూచించే విధంగా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా రైల్వే భద్రత రంగంలో సమూల మార్పులు చోటు చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందిస్తుంది.
కాంగ్రెస్ ప్రారంభ సదస్సు 2023 ఫిబ్రవరి 21న జరుగుతుంది. 2023 ఫిబ్రవరి 23న ముగింపు సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ లో భాగంగా “క్లిష్టమైన ఆస్తులు, సరుకు రవాణాను రక్షించడం”, ' మానవతా దృక్పధంతో భద్రత కల్పించడం' “ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ రైల్వే భద్రతా సాధనాలు, పద్ధతులు” మరియు “విజన్ 2030” అనే అంశాలపై ప్రత్యేక సదస్సులు జరుగుతాయి.
గతంలో 2006, 2015లో రైల్వే భద్రతా దళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ న్యూఢిల్లీలో ప్రపంచ భద్రతా కాంగ్రెస్ సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ చందర్ ఐపిఎస్ జూలై 2022 నుంచి జూలై 2024 వరకు ఇంటర్నేషనల్ యుఐసి సెక్యూరిటీ ప్లాట్‌ఫారమ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
నేపధ్యం:
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC)
యూనియన్ ఇంటర్నేషనల్ డెస్ కెమిన్స్ డి ఫెర్ (UIC) లేదా ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) ప్యారిస్, ఫ్రాన్స్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఇది 1922 నుంచి వృత్తిపర సంస్థగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రంగానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా రైలు రవాణాను ప్రోత్సహిస్తుంది. రైలు రవాణా రంగాన్ని ప్రోత్సహించడం, ప్రమాణాలు నెలకొల్పడం, సభ్య దేశాల మధ్య ఉత్తమ విధానాల పట్ల అవగాహన కల్పించడం, భాగస్వామ్యం పెంచడం, కొత్త వ్యాపారం, కొత్త కార్యకలాపాలలో సభ్యులకు సహకారం అందించడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ కృషి చేస్తోంది. మెరుగైన సాంకేతిక, పర్యావరణహిత పనితీరును ప్రతిపాదించడం, పోటీతత్వాన్ని మెరుగుపరచడం మరియు ఖర్చులను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రపంచ రైల్వే రంగాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
ప్రయాణికులు,ఆస్తులు, పరికరాల భద్రతకు సంబంధించిన విషయాలలో రైలు రంగం తరపున విశ్లేషణలు , విధాన నిర్ణయాలు అభివృద్ధి చేయడానికి, రూపొందించడానికి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ అధికారం కలిగి ఉంది. భద్రతా రంగంలో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ సభ్యుల ఉమ్మడి ప్రయోజనాలు రక్షించడానికి ఎప్పటికప్పుడు అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం, సభ్యుల సెక్యూరిటీ డైరెక్టర్ల మధ్య సమాచారం, అనుభవాల మార్పిడిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ గుర్తింపు కలిగిన అనుభవాలు పంచుకోవడం, ప్రాజెక్ట్‌లను ప్రతిపాదించడం వంటి అంశాలకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ బాధ్యత వహిస్తుంది.
నెట్‌వర్కింగ్ ప్రయోజనాలను ఉపయోగించుకుని ప్రపంచవ్యాప్తంగా నేరస్థులు నేరాలు, దాడులు చేయడానికి అవకాశం ఉన్న సమయంలో సవాళ్లు ఎదుర్కోవడానికి సంయుక్త కృషి అవసరం ఉంటుంది. ,ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన అంతర్జాతీయ సంస్థగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ సభ్య దేశాలు ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలు పంచుకోవడానికి ఒక వేదికగా పనిచేస్తుంది.
రైల్వే భద్రతా దళం:
భారతదేశంలో రైల్వే భద్రతా రంగంలో ప్రధాన భద్రత, చట్ట అమలు సంస్థగా రైల్వే భద్రతా దళం విధులు నిర్వర్తిస్తోంది. రైల్వే ఆస్తుల రక్షణ , భద్రత కోసం 1957లో రైల్వే భద్రతా దళం ఏర్పాటయింది.రైల్వే ఆస్తుల రక్షణతో పాటు ప్రయాణీకుల సౌకర్యాల అదనపు పాత్రల వరకు అభివృద్ధి చెందింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రయాణికుల భద్రత కల్పించడంలో దళం కీలక పాత్ర పోషిస్తోంది. రైల్వే ప్రయాణీకులకు సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించే అద్భుతమైన సంప్రదాయాన్ని నెలకొల్పడానికి రైల్వే భద్రతా దళం చర్యలు ప్రారంభించింది. భారతీయ రైల్వే తన లక్ష్యాలను చేరుకోవడంలో ఈ దళం చురుకైన పాత్ర పోషిస్తోంది. రైల్వే , దాని వినియోగదారుల భద్రతా అవసరాలను గుర్తిస్తుంది. నైపుణ్యాలు, వనరులను సమకూర్చుకోవడం, వినూత్న పరిష్కారాలను అమలు చేయడం ద్వారా రైల్వే భద్రతా దళం పరిస్థితులకు అనుగుణంగా చర్యలు అమలు చేస్తోంది. రైల్వే భద్రతా దళంలో అత్యధిక సంఖ్యలో మహిళలు (9%) పని చేస్తున్నారు. అత్యధిక సంఖ్యలో మహిళలను కలిగి ఉన్న కేంద్ర భద్రతా సంస్థగా రైల్వే భద్రతా దళం గుర్తింపు పొందింది. కర్తవ్య నిర్వహణ, ప్రయాణికులకు భద్రత, సౌకర్యాల కల్పన కోసం రైల్వే భద్రతా దళం అనేక కార్యకలాపాలను చేపట్టింది.
***
(Release ID: 1900768)
Visitor Counter : 247