యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

2వ ఖేలో ఇండియా మహిళల హాకీ లీగ్ అండర్‌-21 మొదటి రోజు భారీ విజయం సాధించిన సాయ్, ప్రీతమ్ శివాచ్ జట్లు

Posted On: 19 FEB 2023 2:43PM by PIB Hyderabad

2వ ఖేలో ఇండియా ఉమెన్స్ అండర్ 21 లీగ్ ఆదివారం న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభమయింది. అర్జున అవార్డు గ్రహీత అలాగే 1964 ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ (ట్రిపుల్ ఒలింపియన్) శ్రీ హర్బిందర్ సింగ్ మరియు అర్జున అవార్డు గ్రహీత డబుల్ ఒలింపియన్ శ్రీ దేవేష్ చౌహాన్‌లు ట్రోఫీలను ఆవిష్కరించారు.

 

image.png

ఈరోజు జరిగిన మొత్తం రెండు మ్యాచ్‌ల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ జట్టు 13-0తో సెల్యూట్ హాకీ అకాడమీని ఓడించగా, ప్రీతమ్ శివాచ్ హాకీ అకాడమీ 11-0తో హెచ్‌ఐఎం హాకీ అకాడమీని ఓడించింది.

2వ ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్బిందర్ సింగ్..మూడు ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పాటు హాకీ ఇండియా జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడి కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం మహిళల హాకీ లీగ్‌ను నిర్వహించడం చాలా అభినందనీయమైన ప్రయత్నమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఖేలో ఇండియా లీగ్‌ల నుండి రాబోయే రోజుల్లో భారతదేశానికి ఆడ్డంతో పాటు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుపొందగల మంచి క్రీడాకారులు రూపుదిద్దుకుంటారని చెప్పారు.

"ఖేలో ఇండియా మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం మరియు గత సంవత్సరం యూ-21 మరియు యూ-16 విభాగాలలో గత రెండు ఉమెన్స్ ఖేలో ఇండియా లీగ్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తున్నాను. ఇందులో పాల్గొంటున్న టీమ్‌లు మరియు ఆటగాళ్లందరికీ  శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అని తెలిపారు.

 

image.png

 

భారత్‌ తరఫున రెండు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించిన దేవేష్‌ చౌహాన్‌ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఖేలో ఇండియా లీగ్‌ల ద్వారా ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు భారత ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తోందని..భారత్‌కు ఆడాలనే కలను నెరవేర్చుకోవడం ప్రతి క్రీడాకారుడి బాధ్యత అని ఈ సందర్భంగా చెప్పారు.

ఈ కార్యక్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు కోచ్‌గా పనిచేసిన పీయూష్ దూబే (హాకీకి భారత హై పెర్ఫార్మెన్స్ మేనేజర్)తో పాటు నేషనల్ స్టేడియం నిర్వాహకులు శ్రీ దిలీప్ సింగ్ హాజరయ్యారు.


 

*****



(Release ID: 1900597) Visitor Counter : 177