ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధిపతి అనుచిత వ్యాఖ్యలు చేసారని అంటూ ఒక పత్రికలో వచ్చిన వార్త తప్పుదోవ పట్టించే విధంగా ఉంది


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డైరెక్టరేట్ ఒక భాగంగా పనిచేస్తూ వైద్య,నర్సింగ్ నిపుణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది

Posted On: 15 FEB 2023 12:39PM by PIB Hyderabad

నర్సుల పట్ల డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  అధిపతి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ది మార్నింగ్ స్టాండర్డ్ లో వచ్చిన వార్త తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తన వద్దకు వచ్చిన నర్సుల బృందాన్ని ఉద్దేశించి కొద్దీ రోజుల కిందట డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  అధిపతి అనుచిత వ్యాఖ్యలు చేశారని పత్రిక పేర్కొంది. నర్సుల పట్ల గౌరవం, సానుభూతి  లేకుండా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్  అధిపతి ప్రవర్తించారని వార్తలో పేర్కొన్నారు. చిన్న విషయంపై అనవసర రాద్ధాంతం సృష్టించే విధంగా వార్త ఉంది. 

 నర్సింగ్ తో సహా అన్ని ఆరోగ్య అంశాలపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS నేతృత్వంలో) ఒక సాంకేతిక సంస్థగా పనిచేస్తూ సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలు సూచిస్తుంది.  నర్సింగ్ అంశంతో సహా ఆరోగ్య రంగానికి సంబంధించిన  విధాన నిర్ణయాలు , వాటి అమలు బాధ్యత కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పై ఉంటుంది. పని విభజన వల్ల   డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, మంత్రిత్వ శాఖ మధ్య సామరస్య పూర్వకంగా పని చేయగలుగుతున్నాయి. 

నర్సుల అంశానికి సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ లో ప్రస్తుతం  నర్సింగ్ సలహాదారు, ఏడీజీ  (నర్సింగ్),డిప్యూటీ అసిస్టెంట్ డీజీ  (నర్సింగ్) డిప్యూటీ నర్సింగ్ సలహాదారు.పనిచేస్తున్నారు.  ఈ పోస్టులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలని కొన్ని నర్సింగ్ సంఘాలు కోరుతున్నాయి.  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అందిస్తున్న సాంకేతిక సలహాలు ఆధారంగా మంత్రిత్వ శాఖ, తగిన నిర్ణయాలు తీసుకుంటూ సంతృప్తికరంగా పనిచేస్తోంది. దీంతో కొన్ని నర్సింగ్ సంఘాలు కోరుతున్న విధంగా   పోస్టులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి బదిలీ చేయడానికి మంత్రిత్వ శాఖకు సముఖంగా లేదు.  

 నర్సింగ్ వృత్తిపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సానుకూలంగా వ్యవహరిస్తూ  వైద్యరంగంలో  నర్సింగ్ సముచిత  స్థానాన్ని సాధించాలని కోరుకుంటుంది. ఒక వర్గానికి చెందిన నర్సులు ,   డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పనిచేస్తున్న  నాలుగు టెక్నికల్ నర్సింగ్ పోస్టుల పట్ల అసంతృప్తితో ఉన్నారు.  ఈ పోస్టులను మంత్రిత్వ శాఖకు బదిలీ చేయాలని కోరుతున్నారు. వార్తలో  ప్రస్తావించిన   ఈ-మెయిల్  నర్సింగ్ అసోసియేషన్‌లకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పంపిన ప్రతిస్పందన. దీనిలో నర్సుల సంఘం నుంచి వినతి పత్రం అందిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది.  డైరెక్టరేట్ మంత్రిత్వ శాఖలో అంతర్భాగమని  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ భావిస్తోంది.  నర్సుల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖలోని నర్సింగ్ ప్రోగ్రామ్ విభాగం తో కలిసి పనిచేయడానికి  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సిద్ధంగా ఉంది. 

***



(Release ID: 1899683) Visitor Counter : 116