వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఈరోజు ఇండోర్‌లో విజయవంతంగా ముగిసిన వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ADM)


భారతదేశం యొక్క G20 అధ్యక్షతన ఈ సమావేశం ముగింపు

Posted On: 15 FEB 2023 5:06PM by PIB Hyderabad

అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ (AWG), G20 ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన మొదటి అగ్రికల్చర్ డెప్యూటీస్ మీటింగ్ 2023 ఫిబ్రవరి 15న అంటే నేడు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం సంస్కృతివంటకాలు మరియు చరిత్రతో కూడిన అనుభవాల సమ్మేళనం అని చెప్పచ్చు. ఇందులో పాల్గొనడం ద్వారా వీటి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే పలు సమావేశాలలో అర్థవంతమైన చర్చలలోనూ పాల్గొనే అవకాశం అందరికీ లభించింది.

భారత ప్రెసిడెన్సీ ప్రతిపాదించిన ఎజెండా పై పలు దేశాలు జోక్యం చేసుకోవడమే కాదు.. వాటిలోని అంశాలను సైతం  బాగా చర్చించారు. ఈ కార్యక్రమం యొక్క చివరి రోజు సాంకేతిక విభాగ సంబంధిత అంశంతో సెషన్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా “ఆహార భద్రత మరియు పోషకాహారం”, “వాతావరణ స్మార్ట్ విధానంతో స్థిరమైన వ్యవసాయం”, “సమిష్టి వ్యవసాయ విలువ గొలుసులు మరియు ఆహార వ్యవస్థలు” మరియు "వ్యవసాయ పరివర్తన కోసం డిజిటలైజేషన్" అనే  నాలుగు అంశాల మీద బాగా విస్తృతంగా చర్చించారు.

ఆహార భద్రత మరియు పోషకాహారం అనే అంశానికి సంబంధించిన సాంకేతిక సెషన్‌పై చర్చ గురించిప్రారంభ వ్యాఖ్యలు శ్రీమతి. శుభ ఠాకూర్జాయింట్ సెక్రటరీడిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ (DA&FW) చేయగా; ఆ తర్వాత చర్చించే అంశం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) అని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆహార భద్రత మరియు పోషకాహారంపై DA&FW అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్‌ను సమర్పించారు. ఆ తర్వాత శ్రీమతి శుభ ఠాకూర్జాయింట్ సెక్రటరీ, DA&FW ఈ వేదిక ద్వారా మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ రీసెర్చ్ అండ్ అవేర్‌నెస్ (MIIRA) గురించి అందరికీ పరిచయం చేశారు.

Sh. ఫ్రాంక్లిన్ L. ఖోబుంగ్జాయింట్ సెక్రటరీ, DA&FW, వాతావరణ స్మార్ట్ విధానంతో స్థిరమైన వ్యవసాయ విధానాలకు సంబంధించిన సాంకేతిక సెషన్‌కు ప్రారంభ వ్యాఖ్యలను అందించారు. అనంతరం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అనే అంశం గురించి చర్చించాలని నిర్ణయించారు.

DA&FW మరియు ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ (IFAD) అడిషనల్ సెక్రటరీ డాక్టర్ అభిలక్ష్ లిఖి చేత సమగ్ర వ్యవసాయ విలువ గొలుసులు మరియు ఆహార వ్యవస్థలపై సాంకేతిక సెషన్‌ను ప్రారంభించారు.

డిజిటలైజేషన్ ఫర్ అగ్రికల్చరల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై జరిగిన టెక్నికల్ సెషన్‌కు ప్రారంభ వ్యాఖ్యలు డాక్టర్ పి.కె. మెహెర్దాఅదనపు కార్యదర్శి, DA&FW అందించారుఈ అంశాన్ని చర్చించాలని ICRISAT నిర్ణయించింది.

ప్రతి థీమ్-ఆధారిత సాంకేతిక సెషన్ సమయంలోమేధోపరంగా గొప్ప ఆలోచనలుసూచనలు మరియు పరిశీలనల మార్పిడితో కూడిన బహిరంగ సభ చర్చ జరిగింది. అంతర్దృష్టితో కూడిన ప్రదర్శనలు వ్యవసాయ పరివర్తనకు మార్గం సుగమం చేశాయి. అలాగే వ్యవసాయంలో డిజిటలైజేషన్ యొక్క ప్రాముఖ్యతకు చిన్నకారు రైతులపై ప్రత్యేక దృష్టి సారించింది.

సెషన్ కో-చైర్ డాక్టర్. స్మితాసిరోహి, DA&FW జాయింట్ సెక్రటరీసెషన్‌లలో చర్చించిన నిర్దిష్ట అంశాలను హైలైట్ చేస్తూ ప్రతి సెషన్‌ను ముగింపు దశకు తీసుకువచ్చారు.

సమావేశాన్ని ముందుకు సాగిస్తూ సెషన్ చైర్ ష్. DA&FW సెక్రటరీ మనోజ్ అహుజావ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి అంశాలపై G20 సభ్య దేశాల మధ్య ఎక్కువ అనుబంధం మరియు సహకారాన్ని కలిగి ఉండవలసిన అవసరం గురించి నొక్కి చెప్పారు. రాబోయే AWG సమావేశాలలో G20 వ్యవసాయ సమస్యలపై చర్చలను మరింత ముందుకు తీసుకువెళతామని చైర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారి భారతదేశం యొక్క చిరస్మరణీయ సందర్శనను ఒక చక్కని జ్ఞాపకంగా మలిచి గత రోజులలో జరిగిన వివిధ సంఘటనలు, విశేషాలను సమీకరించి రూపొందించిన ఒక వీడియో ప్రదర్శించడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

***(Release ID: 1899633) Visitor Counter : 183