కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ ) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్  చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ ఎండ్ వేల్స్ (ఐసిఎఇడబ్ల్యు)కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

प्रविष्टि तिथि: 15 FEB 2023 3:47PM by PIB Hyderabad

ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ ) మరియు ఇన్స్ టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లాండ్ ఎండ్ వేల్స్ (ఐసిఎఇడబ్ల్యు) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకాలు చేయడానికి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తన ఆమోదాన్ని ఇచ్చింది.

 ఎమ్ఒయు ఉద్దేశ్యం ఏమిటి అంటే అది ఒక పక్షం మరొక పక్షం యొక్క సభ్యుల యోగ్యత మరియు శిక్షణ యొక్క గుర్తింపు తో పాటు వర్తమాన నియమాలు మరియు షరతుల కు సంబంధించిన ఒక బ్రిడ్జింగ్ మెకానిజమ్ ను నిర్ధారించి సభ్యుల కు మెరుగైన అవగాహన ను ప్రసాదించడం. ఎంఒయు దీనిపైన సంతకాలు చేసిన ఇరు పక్షాలకు ఒక పక్షాని కి మరొక పక్షం వాటి యోగ్యత/ప్రవేశ సంబంధి అవసరాలు, సిపిడి విధానాలు, మినహాయింపు మరియు ఇతర ప్రాసంగిక వ్యవహారాల లో సామగ్రి సంబంధి పరివర్తనల పై సమాచారాన్ని పరస్పరం అందించుకోవడాని కి వీలు కల్పిస్తుంది.

ఐసిఎఇడబ్ల్యు తో కలసి ఐసిఎఐ ఈ విధమైనటువంటి సహకారాన్ని ఏర్పరచుకోవడం యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) లో భారతదేశాని కి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) లకు పెద్ద సంఖ్య లో వృత్తిపరమైనటువంటి అవకాశాల ను కల్పిస్తుంది. దీనికి తోడు ఈ ఒప్పందం వల్ల యుకె లో ప్రపంచ స్థాయి అవకాశాల కోసం అన్వేషిస్తున్నటువంటి భారతీయ సిఎ లకు కూడా ప్రయోజనం సిద్ధించగలదు.

 

***


(रिलीज़ आईडी: 1899608) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam