రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్ కౌశల్ వికాస్ యోజన కింద 15000మందికి పైగా అభ్యర్ధులకు శిక్షణనిచ్చిన భారతీయ రైల్వేలు
నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమమైన రైల్ కౌశల్ యోజన కింద యవతకు ఉపాధి అవకాశాలను, వ్యవస్థాపకతను పెంపొందించేందుకు వివిధ వృత్తులలో సాంకేతిక శిక్షణను అందిస్తున్న భారతీయ రైల్వలు
Posted On:
14 FEB 2023 4:43PM by PIB Hyderabad
రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ (రైల్వే శిక్షణా సంస్థలు)లో యువతకు ప్రవేశ స్థాయి నైపుణ్యాల శిక్షణను అందించి వారిని సాధికారం చేసేందుకు రైల్ కౌశల్ వికాస్ యోజన (ఆర్‌కెవివై) భారతీయ రైల్వేలు నోటిఫై చేసింది. ఆర్‌కెవివై కింద నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాన్ని సమన్వయం/ నిర్వహణ చేసేందుకు నోడల్ పియుగా వారణాసికి చెందిన బనారస్ లోకో వర్క్స్‌ను నియమించారు. భారతదేశ వ్యాప్తంగా శిక్షణ సెప్టెంబర్, 2021న ప్రారంభమైంది. ఇప్పటివరకూ, 23,181మంది అభ్యర్ధులు ఆర్‌కెవివై కింద నమోదు చేసుకోగా, 15 665 మంది అభ్యర్ధులు తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
ఈ పథకం కింద, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్, తదితర పధ్నాలుగు పారిశ్రామికకు ఉపయోగపడే సాంకేతిక విద్యలను ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం సహా భారత రైల్వేలు విస్తరించిన మారుమూల 94 శిక్షణా కేంద్రాలలో శిక్షణను అందించారు. దేశంలో ఏప్రాంతానికి చెందిన అభ్యర్ధులు అయినా ఈ శిక్షణలో చేరవచ్చు. ఈ శిక్షణను ఉచితంగా అభ్యర్ధులు అందిస్తారు. ఆర్‌కెవివైని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పథకం కింద ఉపాధి కల్పించే నిబంధన లేదు. అయితే, ఈ పథకం భారతదేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు, వ్యవస్థాపకతను పెంచేందుకు వివిధ వృత్తులలో సాంకేతిక శిక్షణను ఇచ్చే నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం ఈ పథకం.
***
(Release ID: 1899247)
Visitor Counter : 222