రక్షణ మంత్రిత్వ శాఖ
సహ అభివృద్ధి, సహ ఉత్పత్తి, సరఫరా గొలుసులను ఏకం & బలోపేతం చేయడం, జాయింట్ వెంచర్ల ఏర్పాటు, ప్రపంచంలో భారత్‌లో ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటుకు అంతర్జాతీయ ఒఎంలను ఆహ్వానించిన రక్షణ మంత్రి
ఎయిరో ఇండియా -2023 సందర్భంగా ఒఇఎంల సిఇఒలతో సమావేశమైన శ్రీ రాజ్‌నాథ్ సింగ్
పోటీ భూమి ఖర్చులు, నైపుణ్యం కలిగిన మానవ పెట్టుబడి, బలమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ & భారీ రక్షణ మార్కెట్ వంటి ప్రయోజనాలను భారత్ అందిస్తుందిః రక్షణ మంత్రి
Posted On:
14 FEB 2023 11:24AM by PIB Hyderabad
రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఒఇఎం - ప్రాధమిక ఉపకరణ ఉత్పత్తి దారులు) సిఇఒలతో14వ ఎయిరో ఇండియా సందర్భంగా 14 ఫిబ్రవరి, 2023న సమావేశమయ్యారు. ఈ సంభాషణ సందర్భంగా అంతర్జాతీయ రక్షణ పరిశ్రమకు భారతదేశం పోటీ భూమి ధర ఖర్చులను, నైపుణ్యం కలిగిన మానవ పెట్టుబడి, శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, అంతర్జాతీయ రక్షణ పరిశ్రమకు భారీ దేశీయ రక్షణ మార్కెట్ వంటి చెప్పుకోదగిన ప్రయోజనాలను భారత్ అందిస్తుందని ఆయన పట్టి చూపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ తయారీ కంపెనీలు భారతదేశ వృద్ధి కథలో భాగం కావడానికి ఇది అందరికీ విజయాన్ని ఇచ్చే పరిస్థితిగా ఆయన అభివర్ణించారు.
కీలకమైన రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటుగా, మా ప్రజలకు ఉపాధి కల్పించడం అన్న రెండు లక్ష్యాలను రక్షణ ఉత్పత్తి సాధిస్తోందంటూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ భారత రక్షణ రంగ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రక్షణ పారిశ్రామిక కారిడార్లకు పెట్టుబడుల కోసం ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రేరకాల గురించి, భారతదేశంలో రక్షణ ఉత్పత్తిలో ఎఫ్‌డిఐలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన న్యాయవ్యవస్థ, వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేయడం కోసం చేస్తున్న యత్నాల గురించి ఆయన ప్రస్తావించారు.
సహ అభివృద్ధి, సహ ఉత్పత్తి, సరఫరాలంకెలను ఏకం చేయడం, జాయింట్ వెంచర్లు, ఇలా భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించి ప్రపంచానికి తయారుచేసేందుకు అవకాశాలున్నాయని ఆయన అన్నారు. భారతీయ రక్షణ ఉత్పత్తిలో అంతర్జాతీయ పెట్టుబడులకు సౌకర్యం కల్పించేందుకు సిఇఒలు తమ సూచనలను చేశారు. ప్రైవేటు పరిశ్రమలకు నియంత్రణా అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు.
జనరల్ అటామిక్స్, శాఫ్రాన్, బోయింగ్, ఎంబ్రీర్, రఫేల్ అడ్వాన్స్‌డ్ సిస్టంస్ సిఇఒలు, సీనియర్ మేనేజ్‌మెంట్ ఈ ముఖాముఖి సమావేశానికి హాజరయ్యారు. రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనె, డిజి (అక్విజిషన్) శ్రీ పంకజ్ అగ్రవాల్, రక్షణ ఉత్పత్తి అదనపు కార్యదర్శి శ్రీ టి. నటరాజన్, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 1899149)
Visitor Counter : 181