వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతదేశం జి20 అధ్యక్షత కింద వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ (ఎడబ్ల్యుజి) 1వ అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్ (ఎడిఎం)కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఇండోర్
Posted On:
12 FEB 2023 3:04PM by PIB Hyderabad
మూడు రోజుల కార్యక్రమమైన 1వ ఎడిఎం 13-15 ఫిబ్రవరి 2023వరకు ఇండోర్‌లో జరుగుతోంది. జి20 దేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన వందమంది ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.
మూడురోజుల సమావేశంలో తొలిరోజు ప్రదర్శనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శిరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారు. చిరుధాన్యాలు, విలువ జోడించిన ఆహార పదార్ధాలతో పాటుగా పశుసంవర్ధక, మత్స్య శాఖలకు చెందిన స్టాళ్ళు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.
వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ తొలి ఎడిఎంలో మొదటి రోజు వ్యవసాయ సంబంధిత విషయాలను అంశాలను చర్చించాలని నిర్ణయించారు. రెండవ రోజు కేంద్ర పౌరవిమాన యాన మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింథియా సమావేశానికి హాజరు కానున్నారు. ఆ రోజు పాల్గొంటున్న సభ్యులు, అంతర్జాతీయ సంస్థల మధ్య సాధారణ చర్చలు జరుగనున్నాయి.
మూడవ రోజు ఎడబ్ల్యుజి కీలక బట్వాడాలపై చర్చలకు కేటాయించారు. ఇందులో పాలుపంచుకుంటున్న సంబంధిత సభ్యులు, అంతర్జాతీయ సంస్థలతో రోజంతా చర్చలు జరిగే సాంకేతిక సెషన్‌గా ఇది ఉండనుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా, ప్రతినిధులు రాజ్వాడా ప్యాలెస్, మాండు కోట వంటి వారసత్వ సంపదలను సందర్శించడం ద్వారా సుసంపన్నమైన భారతీయ చరిత్రను తెలుసుకుంటారు. భారీ విందులు, సాంస్కృతిక ప్రదర్శనలు మన భారతీయ వంటకాల, సంస్కృతి రుచిని అతిథులకు అందిస్తాయి.
***
(Release ID: 1898664)
Visitor Counter : 227