మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆగ్రాలో జరిగిన జి-20 సాధికారత ప్రారంభ సమావేశం మొదటి రోజున మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి

మాట్లాడుతూ, "మీరు మీ భవిష్యత్తును సరిగ్గా పొందాలనుకుంటే, మీరు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలనుకుంటే, మీ సంభాణలు, నిర్ణయాల్లో మహిళలు కేంద్ర బిందువుగా ఉండేలా చూసుకోండి" అని సూచించారు

Posted On: 11 FEB 2023 5:51PM by PIB Hyderabad

 

 

1.     ప్రణాళికవిధానాలను అభివృద్ధి చేయడంతో పాటుసమానత్వంమహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉమ్మడి బలాన్ని సమీకరించడానికి సదస్సు అవకాశం కల్పిస్తుంది. 

 

 

2.     మహిళల నాయకత్వంసాధికారతను వేగవంతం చేయడానికివ్యాపారాలుప్రభుత్వాల మధ్య అత్యంత సమగ్రమైన విధానాలతో నడిచే ఒక కూటమి గా జి-20 సభ్య దేశాలు వ్యవహరించడానికి జి.-20 సాధికారత సదస్సు ప్రయత్నిస్తుంది

 

 

3.     జి-20 దేశాల కూటమి కి భారత్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో జరుగుతున్న  సదస్సు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది: మహిళా వ్యవస్థాపకతఈక్విటీ మరియు ఆర్థిక వ్యవస్థకు విజయం”, "క్షేత్ర స్థాయి తో సహా అన్ని స్థాయిల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి భాగస్వామ్యం", "సమాన శ్రామిక శక్తిమహిళా సాధికారత భాగస్వామ్యానికి విద్య కీలకం"

 

 

2023 ఫిబ్రవరి, 11, 12 తేదీల్లో తాజ్ కన్వెన్షన్ హోటల్ లో జి-20 సాధికారత ప్రారంభ సమావేశానికి ఆగ్రా ఆతిథ్యమిస్తోంది.   ఒక ప్రణాళికవిధానాలను అభివృద్ధి చేయడానికిసమానత్వంమహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించడానికిఉమ్మడి బలాన్ని సమీకరించడానికి సదస్సు అవకాశాన్ని కల్పిస్తోంది.

  

మహిళల నాయకత్వంసాధికారతను వేగవంతం చేయడానికివ్యాపారాలుప్రభుత్వాల మధ్య అత్యంత సమగ్రమైన విధానాలతో నడిచే కూటమిగా జి-20 సభ్య దేశాలు వ్యవహరించడానికి జి-20 సాధికారత సదస్సు ప్రయత్నిస్తుంది.  జి-20 దేశాల కూటమి కి భారత్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో  సదస్సు మూడు అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతోంది: మహిళా వ్యవస్థాపకతఈక్విటీ మరియు ఆర్థిక వ్యవస్థకు విజయం”, "క్షేత్ర స్థాయి తో సహా అన్ని స్థాయిల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి భాగస్వామ్యం", "మహిళా సాధికారతసమాన శ్రామిక శక్తి భాగస్వామ్యానికి విద్య కీలకం".
 
జి-20 సాధికారత సదస్సు ప్రారంభ సమావేశంలో పాల్గొంటున్న జి-20 సభ్య దేశాల ప్రతినిధులకు శక్తివంతమైన ఆగ్రా నగరం ఘన స్వాగతం పలికింది.  విమానాశ్రయం నుంచి సభా వేదిక వరకు మార్గంలో నగర పౌరులు జెండాలు పట్టుకునిసాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. 
 
శారీరకమానసిక శ్రేయస్సును పెంపొందించడానికి యోగా ప్రయోజనాలను వ్యాప్తి చేసే లక్ష్యంతోఆయుష్ మంత్రిత్వ శాఖ మొదటి రోజు కార్యక్రమాన్ని యోగా తో ప్రారంభించింది.  అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమయంలోకొంతమంది మహిళా నాయకులు తాము ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడానికి అనుసరించిన స్ఫూర్తిదాయకమైన కథనాలను వివరించారు.   రాజస్థాన్ నుండి వచ్చిన భారతదేశపు మొదటి ఎం.బి.శ్రీమతి ఛవీ రజావత్ఆహార రంగంలో పారిశ్రామికవేత్త శ్రీమతి చికితా గులాటి  సందర్భంగా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.   భారతదేశానికి చెందిన కొంతమంది ఔత్సాహిక మహిళా నాయకులు తమ అనుభవాలను ప్రత్యక్షంగా పంచుకోడానికి  సదస్సు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. 
 
 
 
స్వాగతోపన్యాసం చేస్తున్న మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే 
 
 
 
అనంతరం మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే స్వాగతోపన్యాసం చేస్తూ,  21 శతాబ్దంలోప్రపంచ వృద్ధి దక్షిణాది దేశాల నుండే వస్తుందనీమహిళల నాయకత్వంఆవిష్కరణలను ప్రదర్శించడం ద్వారా ప్రపంచంలో దక్షిణ ప్రాంతానికి నాయకత్వం వహించే సామర్థ్యం భారతదేశానికి ఉందని పేర్కొన్నారు.   మొత్తం 36 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఉండగాఅందులోని  27 రాష్ట్రాలలో లింగ బడ్జెటింగ్ తో పాటుయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యు.పి.వంటి భారతదేశం అమలు చేస్తున్న అనేక మహిళా-కేంద్రీకృత కార్యక్రమాల గురించి శ్రీ పాండే  సందర్భంగా ప్రముఖంగా పేర్కొన్నారు.  మహిళలుపురుషులను డిజిటల్ ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెడుతూ శతాబ్దపు మహిళలు సాధించిన గొప్ప ఆవిష్కరణల్లో ఇది ఒకటిఅని ఆయన వివరించారు. 
 
 
 
ఆగ్రాలో జి-20 సాధికారత సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర మహిళాశిశు అభివృద్ధిమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ
 
 
 
కేంద్ర మహిళాశిశు అభివృద్ధిమైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ  సదస్సులో కీలకోపన్యాసం చేస్తూ,  "మీరు మీ భవిష్యత్తును సరిగ్గా పొందాలనుకుంటేమీరు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలనుకుంటేమీ సంభాణలునిర్ణయాల్లో మహిళలు కేంద్ర బిందువుగా ఉండేలా చూసుకోండిఅని సూచించారు. 
 
 
భారతదేశ జి-20 అధ్యక్ష పదవి చరిత్రలో ఒక పరీవాహక ఉద్యమం గా ఎలా నిలిచి పోతుందనే అంశంపై కూడా ఆమె  దృష్టి సారించారు.  అందరి శ్రేయస్సు కోసం ఆచరణాత్మక అంతర్జాతీయ పరిష్కారాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించాలని భారతదేశం కోరుకుంటోంది.  అలా చేయడంలో 'వసుధైక కుటుంబం' (లేదా 'ప్రపంచం ఒకే కుటుంబం') యొక్క నిజమైన స్ఫూర్తిని భారతదేశం వ్యక్తపరుస్తుంది.  భారతదేశ ఎస్.హెచ్.జికథనం యొక్క స్థాయిని ఆమె ప్రత్యేకంగా నొక్కిచెప్పారుఅట్టడుగు స్థాయిలలో మహిళా నాయకత్వం యొక్క ప్రాముఖ్యతనుప్రతి మహిళకు బ్యాంకింగ్ఆర్థిక సేవల లభ్యతను నిర్ధారించే ప్రయత్నాల గురించి కూడా ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.  వీటితో పాటుజాతీయ విద్యా విధానంలో "జెండర్-ఇన్క్లూజన్-నిధితో ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మించిరుతుక్రమ పరిశుభ్రత విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశంలో లింగ న్యాయం కోసం అమలుచేస్తున్న కృషి గురించి కూడా ఆమె వివరించారు. 
 
 
 
జి-20 సాధికారత ప్రారంభ సమావేశంలో ప్రత్యేక ప్రసంగం చేస్తున్న జి-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ 
 
 
మాంద్యంవాతావరణ మార్పువాతావరణ ఆర్థిక అవసరం వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశం జి-20 కూటమి అధ్యక్ష పదవిని ఎలా నిర్వహిస్తుందనే విషయాన్ని జి-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ తమ ప్రత్యేక ప్రసంగంలో పేర్కొన్నారు.  జి-20 కూటమి అధ్యక్ష పదవీ కాలంలో భారతదేశం అందరినీ కలుపుకొనినిర్ణయాత్మకంగాఫలితం-ఆధారితంగాకార్యాచరణ-ఆధారితంగా ఉండాలనే గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనను ఆయన  సందర్భంగా ప్రముఖంగా తెలియజేశారు.  భారతదేశం తన వృద్ధి రేటును మరింత పెంచుకోవాలంటేమహిళల తలసరి ఆదాయాన్ని పెంచడంతో పాటునాయకత్వ స్థానంలో వారిని ఉంచడం చాలా అవసరమని ఆయన సూచించారు.  జన్-ధన్-యోజనప్రధానమంత్రి ముద్ర యోజనతో పాటుఎస్‌.హెచ్‌.జి.లను ప్రోత్సహించి లక్ష్యంతో ఇటీవలి బడ్జెట్ కేటాయింపులు వంటి మహిళా సాధికారత కోసం భారతదేశం తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి శ్రీ కాంత్ వివరించారు.  జి-20 సాధికారత సదస్సు కృషిసిఫార్సులు నాయకుల అధికారిక సమాచారం లో స్థానం పొందవచ్చనిభారతదేశ ప్రతిష్టాత్మక ఫలితాలతో అవి ప్రతిధ్వనిస్తాయనిఆయన పేర్కొన్నారు.
 
 
వ్యవస్ధాపకతనాయకత్వంవిద్య ద్వారా మహిళల ప్రగతి ఎజెండాను అమలు చేయాలని జి-20 సాధికారత అధ్యక్షురాలు డాక్టర్ సంగీతారెడ్డి సూచించారు.  డిజిటల్ చేరికను ఉపయోగించిజి-20 సాధికారత సదస్సు దీన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడంతో పాటుడిజిటల్ నైపుణ్యంపటిమతో మహిళల నాయకత్వాన్ని నడిపిస్తుంది.  ప్రపంచ మహిళా సాధికారత ఎజెండాను ముందుకు తీసుకెళ్లగల భారతదేశ నేతృత్వంలోని రెండు వేదికల గురించి ఆమె ప్రత్యేకంగా పేర్కొన్నారు.  మొదటిదిభారతదేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగం కోసం అభివృద్ధి చేయబడే పాఠ్యాంశాలతో డిజిటల్ అక్షరాస్యతభవిష్యత్తు నైపుణ్యం కోసం భారత ప్రభుత్వంనాస్కామ్ ఫౌండేషన్ తదితరులు అభివృద్ధి చేసిన వేదిక.  రెండవదిమహిళల సభ్యత్వం కోసం నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిత్వరలో ప్రారంభించనున్న వేదిక.  
 
 
 
'బిలియనీర్ యొక్క కొత్త నిర్వచనం బిలియన్లను సంపాదించే వ్యక్తి కాదుబిలియన్ జీవితాలను తాకిన వ్యక్తి' అని డాక్టర్ రెడ్డి తమ ప్రసంగాన్ని ముగించారు. 
 
 
 

 

*****


(Release ID: 1898463) Visitor Counter : 498