మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
హజ్ విధానం
Posted On:
09 FEB 2023 4:47PM by PIB Hyderabad
భారతీయ యాత్రికుల కోసం సురక్షితమైన, సౌకర్యవంతమైన హజ్ తీర్థయాత్రను అందిచడానికి, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. భారత్, సౌదీ అరేబియాలలో హజ్ యాత్రికుల భద్రత, ప్రయాణం, బస, శ్రేయస్సు కోసం వివిధ భాగస్వామ్య పక్షాల వారి సన్నిహిత సమన్వయంతో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల హజ్ కమిటీలు, హజ్ కమిటీ ఆఫ్ ఇండియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దిశగా సమన్వయంతో విశేషంగా కృషి చేస్తున్నాయి. ఈ సంవత్సరం హజ్ యాత్ర- 2023 కోసం.. సన్నద్ధతను మంత్రిత్వ శాఖ చాలా ముందుగానే ప్రారంభించింది. పైన పేర్కొన్న వాటాదారులతో హజ్ నిర్వహణపై వివిధ ఇంటరాక్టివ్ సెషన్‌లను కూడా ఏర్పాటు చేసింది. యాత్రికుల ఎంపిక కోసం సరసమైన ఆన్‌లైన్ ప్రక్రియతో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు టైమ్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా నిర్ధారించారు. వాటాదారుల కోసం హజ్ యాత్ర -2023కి సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలు కూడా 06.02.2023న ఖరారు చేసి జారీ చేయబడ్డాయి. వీటిని ఈ క్రింది లింక్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
https://www.minorityaffairs.gov.in/sites/default/files/HAJ-policy.pdf
హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా హజ్-2023 దరఖాస్తు ఉచితంగా చేయబడింది, వీఐపీలు/ ప్రముఖుల కోసం విచక్షణ కోటా రద్దు చేయబడింది. మహిళా యాత్రికులు, శిశువులు, దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ సమాచారాన్ని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈరోజు లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వకంగా సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1897846)
Visitor Counter : 202