విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్.టి.పి.సి. సంస్థకు వరుసగా ఆరో సంవత్సరం ‘ఏటీడీ ఉత్తమ అవార్డు 2023’
Posted On:
08 FEB 2023 1:58PM by PIB Hyderabad
దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి కార్పొరేషన్ ఎన్.టి.పి.సి లిమిటెడ్ సంస్థను అమెరికాలోని ‘అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్‌మెంట్ (ఏటీడీ)’- 'ఏటీడీ బెస్ట్ అవార్డ్స్ 2023'తో సత్కరించింది. టాలెంట్ డెవలప్‌మెంట్ రంగంలో ఎంటర్‌ప్రైజ్ విజయాల్ని ప్రదర్శించినందుకు ఎన్.టి.పి.సి లిమిటెడ్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది ఆరో సారి. సృజనాత్మక పద్ధతుల ద్వారా ఉద్యోగులను నిమగ్నం చేయడమే లక్ష్యంగా ఎన్.టి.పి.సి పని సంస్కృతి పునాది ఎల్లప్పుడూ ముందుకు సాగుతోంది. ఈ అవార్డు ఎన్.టి.పి.సి యొక్క సమకాలీన హెచ్ఆర్ పద్ధతులకు నిదర్శనం. టాలెంట్ డెవలప్‌మెంట్ ద్వారా ఎంటర్‌ప్రైజ్ విధానాన్ని ప్రదర్శించే సంస్థలను ఏటీడీ ఉత్తమ అవార్డులకు గుర్తిస్తారు. ఎన్.టి.పి.సి. సంస్థ ఈ తరహా పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో విజయవంతమైంది, ఇది ఉద్యోగులకు వారి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి తగిన వ్యవస్థను అందిస్తుంది. ఈ అవార్డులకు ఎంపిక చేసే సంస్థలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్న మరియు పెద్ద ప్రైవేట్, పబ్లిక్ మరియు లాభాపేక్ష లేని సంస్థలూ ఉన్నాయి. అమెరికాకు చెందిన అసోసియేషన్ ఫర్ టాలెంట్ డెవలప్‌మెంట్ అనేది టాలెంట్ డెవలప్‌మెంట్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కూటమి మరియు ఏటీడీ బెస్ట్ అవార్డ్ అనేది లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ రంగంలో అత్యంత గౌరవనీయమైన గుర్తింపుగా భావించబుడుతుంది.
***
(Release ID: 1897536)