రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రయాణికుల విభాగంలో 73 శాతం పెరిగిన రైల్వే ఆదాయం


రిజర్వ్‌డ్ ప్యాసింజర్ విభాగంలో 48 శాతం వృద్ధి నమోదు

అన్‌రిజర్వ్డ్ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో 361 శాతం వృద్ధి

Posted On: 02 FEB 2023 2:58PM by PIB Hyderabad

 

ఏప్రిల్2022- జనవరి 2023 మధ్య కాలంలో భారతీయ రైల్వే  ప్రయాణీకుల విభాగం ఆదాయం 73 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ. 31634 కోట్లుగా నిలిచింది.  ఈ ఏడాది ఆదాయం 73 శాతం వృద్ధి చెంది రూ.54733 కోట్లకు చేరుకుంది.  రిజర్వ్ చేయబడిన ప్రయాణీకుల విభాగంలో  2022 ఏప్రిల్ 1 నుండి జనవరి 31, 2022 వరకు బుక్ చేసిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7 శాతం వృద్ధితో 6181 లక్షల నుంచి 6590 లక్షలకు చేరుకుంది. ఏప్రిల్ 1 నుండి జనవరి 31, 2023 వరకు రిజర్వ్ చేయబడిన ప్రయాణీకుల విభాగం నుండి రూ.42945 కోట్ల ఆదాయం వచ్చింది, గత సంవత్సరం ఇదే కాలంలో ఈ విభాగం ఆదాయం రూ.29079 కోట్లుగా నిలిచింది, అంటే ఈ విభాగం ఆదాయంలో 48 % పెరుగుదల నమోదు అయింది. అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ విభాగంలో ఏప్రిల్ 1 నుండి జనవరి 31, 2023 వరకు బుక్ చేసిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 19785 లక్షలతో పోలిస్తే 45180 లక్షలకు చేరుకుంది. ఇది 128% పెరుగుదలను చూపింది.  ఏప్రిల్ 1 నుండి జనవరి 31, 2023 మధ్య కాలంలో అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ సెగ్మెంట్ నుండి రూ. 11788 కోట్ల ఆదాయం వచ్చింది, గత ఏడాది ఇదే కాలంలో ఈ విభాగం ఆదాయం రూ.2555 కోట్లుగా నిలిచింది,  ఈ విభాగంలో 361 శాతం వృద్ధి నమోదు అయింది.

*****



(Release ID: 1896200) Visitor Counter : 155