యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

2023-24 ఆర్థిక సంవత్సరానికి 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే 11% ఎక్కువగా రూ.3397.32 కోట్ల బడ్జెట్ కేటాయింపులను యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ పొందింది.


ఖేలో ఇండియా బడ్జెట్ కేటాయింపు లో గణనీయమైన వృద్ది (రూ. 1000 కోట్లు)

క్షేత్రస్థాయి ప్రతిభ గుర్తింపు, మౌలిక సదుపాయాల కల్పన, ఉన్నత క్రీడాకారులకు మద్దతు మరియు సుదూర ప్రాంతాలకు చెందిన మహిళలు, దివ్యాంగులు మరియు యువతకు సమాన అవకాశాలు కల్పించి మొత్తం క్రీడా సంస్కృతిని సృష్టించడంపై ప్రధాన మంత్రి అపూర్వమైన శ్రద్ధ చూపారు: శ్రీ అనురాగ్ ఠాకూర్.

Posted On: 02 FEB 2023 2:49PM by PIB Hyderabad

ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలోని భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాలను కేంద్రీకృతం చేసింది.  360-డిగ్రీల మద్దతు ద్వారా దేశంలోని మొత్తం క్రీడల పర్యావరణ వ్యవస్థకు ప్రేరణ ను ఇచ్చింది. ఈ విధంగా, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు కూడా సంవత్సరాల్లో అనేక రెట్లు పెరిగాయి, 2004-05లో కేవలం రూ. 466 కోట్లు గా ఉండే బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.3397.32 కోట్లకు పెరిగింది.

 

2022-23 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 11% పెరిగాయి. భారతదేశంలో కామన్వెల్త్ క్రీడలు జరిగిన 2010 తర్వాత మంత్రిత్వ శాఖకు ఇది అత్యధిక బడ్జెట్ కేటాయింపు. బడ్జెట్ కేటాయింపులు 2011-12 బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ గా మరియు 2014-15 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ గా పెరిగాయి.

 

క్రీడా శాఖకు బడ్జెట్‌లో ఈ ఏడాది కేటాయింపులు రూ. 2462.59 కోట్లు అదే గత ఏడాది  రూ. 2254 కోట్లు మరియు యువజన వ్యవహారాల శాఖకు ఈ ఏడాది రూ. 934.73 కోట్లు అదే గత ఏడాది కేటాయింపులు రూ. 808.60 కోట్లు.

 

ఈ సంవత్సరం బడ్జెట్ కేటయింపులు గణనీయంగా పెరిగిన మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన పథకాలు/సంస్థలు ఇవి ఖేలో ఇండియా (రూ. 1000 కోట్లు), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (రూ. 785.52 కోట్లు), నెహ్రూ యువ కేంద్ర సంగతన్ (రూ. 401.49 కోట్లు), జాతీయ క్రీడా సమాఖ్యలు (రూ. 785.52 కోట్లు), మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (రూ. 325 కోట్లు).

 

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ. అనురాగ్ సింగ్ ఠాకూర్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించారు. క్రీడలు మరియు యువజన రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపారు.  శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, “దేశంలో ప్రస్తుతం ఉన్న క్రీడా పర్యావరణ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని గుర్తించి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మొదటి నుండి, అట్టడుగు స్థాయి వర్గాలవారి ప్రతిభను గుర్తించడం లో,  మౌలిక సదుపాయాల కల్పన, ఎలైట్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం మరియు సుదూర ప్రాంతాలకు చెందిన మహిళలు, దివ్యాంగులు మరియు యువతకు సమాన అవకాశాలను అందించే మొత్తం క్రీడా సంస్కృతిని సృష్టించడం అపూర్వమైన శ్రద్ధ చూపారు. దీని ఫలితంగా ఖేలో ఇండియా స్కీమ్, ఫిట్ ఇండియా ఉద్యమం, టార్గెట్ ఒలింపిక్ పోడియం, మిషన్ ఒలింపిక్ సెల్ మొదలైన ప్రత్యేక పథకాలు మరియు కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలు చాలా విజయవంతమయ్యాయి అలాగే దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రశంసించబడ్డాయి. ప్రధానమంత్రి క్రీడలకు నూతనోత్తేజాన్ని అందించడంతో, 2014 నుండి భారతదేశ క్రీడా చరిత్రలో పెద్ద సంఖ్యలో చారిత్రాత్మకమైన ప్రథమాలు నమోదయ్యాయి.

 

రాబోయే సంవత్సరంలో యువజన వ్యవహారాల శాఖ యొక్క ప్రత్యేక చొరవలలో ఒకటి యువతకు చేరువయ్యేందుకు మరియు వారి నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడానికి అలాగే సమాజం పట్ల మరింత బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి వారిని వివిధ కార్యకలాపాలలో నిమగ్నం చేయడానికి యువ లీడర్‌షిప్ పోర్టల్‌ను నిర్మించడం, సామాజిక జీవన నాణ్యతను మెరుగుపరిచే మరియు వారి ఆదాయ-సంపాదన సామర్థ్యాన్ని పెంచే ఏదైనా కార్యాచరణ కోసం నమోదు చేసుకోవాలనుకునే యువకుల కోసం పోర్టల్ ఒక రిజిస్ట్రీగా రూపొందించబడుతోంది. డిజిటల్ అక్షరాస్యత మరియు ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలోని యువతను వివిధ పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థలు, చిన్న వ్యాపారాలు, రైతు-ఉత్పత్తిదారుల సమూహాలు మరియు సహకార సంఘాలతో అనుసంధానించడానికి ఇది సహాయపడుతుంది. ఇటువంటి కార్య్రమాలు యువతకు అనుభవపూర్వకమైన అభ్యాసాన్ని అందిస్తుంది, వారి నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు అదే సమయంలో, స్థానిక సంఘాల ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. ఇది సంపన్నమైన మరియు శ్రద్ధగల దేశంగా అవతరించాలానే భారతదేశం యొక్క దృష్టికి అనుగుణంగా ఉంది. ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఒక సంవత్సరం లోపు పోర్టల్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

 

మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లోని మూలధన కేటాయింపులు రూ. 935.68 కోట్లు (బడ్జెట్‌లో 27%) ఇందులో మూలధన ఆస్తుల సృష్టికి గ్రాంట్లు ఉన్నాయి.

***



(Release ID: 1896199) Visitor Counter : 565