ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తక్కువ కర్బన ఉద్గారాలు కలిగిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి 2030 నాటికి 5 ఎంఎంటీ వార్షిక ఉత్పత్తి సాధించడానికి జాతీయ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు


ఇంధన పరివర్తన సాధన, సున్నా ఉద్గారాల విడుదల లక్ష్యం సాధన కోసం ప్రాధాన్యతా పెట్టుబడుల కోసం 35,000 కోట్ల రూపాయల కేటాయింపు

పర్యావరణహిత కార్యక్రమాల అమలు, ప్రతిస్పందన చర్యల ప్రోత్సాహానికి 'గ్రీన్ క్రెడిట్' కార్యక్రమం

ప్రత్యామ్నాయ ఎరువుల వాడకాన్ని ఎక్కువ చేసి రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి పీఎం-ప్రణామ్ పథకం ద్వారా కృషి

'వ్యర్థాల నుంచి సంపద సృష్టి' కోసం 10,000 కోట్ల రూపాయల వ్యయంతో గోబర్ధన్ పథకం అమలు

చిత్తడి నేలల పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి అమృత్ ధరోహర్ పథకం అమలు

Posted On: 01 FEB 2023 1:04PM by PIB Hyderabad

"హరిత పారిశ్రామిక రంగం అభివృద్ధి,  ఆర్థిక పరివర్తన సాధన సాధించి 2070 నాటికి 'పంచామృతం', నికర శూన్య కర్బన ఉద్గారాలను చేరాలన్న లక్ష్యాన్ని సాధించడానికి  భారతదేశం దృఢ సంకల్పంతో కృషి చేస్తోంది"  అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అన్నారు. పర్యావరణహిత  జీవనశైలి  ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన "ఎల్ఐఎఫ్ఇ" లేదా పర్యావరణహిత జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో కార్యక్రమాలు అమలు చేస్తుంది అని  ఆర్థిక మంత్రి అన్నారు. అమృత కాలంలో దేశానికి  మార్గనిర్దేశం చేసే 'గ్రీన్ గ్రోత్' పై  బడ్జెట్ దృష్టి  పెంచుతుందని అన్నారు.

గ్రీన్ హైడ్రోజన్ మిషన్

ఇటీవల ప్రకటించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్  ఆర్థిక వ్యవస్థను తక్కువ కార్బన్ తీవ్రత గల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి,  శిలాజ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి వివరించారు. "హైడ్రోజన్ అమలు చేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెడుతుంది " అని ఆమె అన్నారు.
2030 నాటికి 5 ఎంఎంటీల వార్షిక ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామని కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

 

ఇంధన పరివర్తన, నిల్వ ప్రాజెక్టులు
ఇంధన పరివర్తన, నికర శూన్య  లక్ష్యాల సాధన, ఇంధన భద్రత కోసం  పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ప్రాధాన్య మూలధన పెట్టుబడుల కోసం రూ.35,000 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు


వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ తో  4,000 ఎండబ్ల్యుహెచ్  సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కు సహకారం అందిస్తామని  ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను సుస్థిర అభివృద్ధి మార్గంలో నడిపించే చర్యలను ప్రకటించిన శ్రీమతి సీతారామన్  "పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం వివరణాత్మక వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది " అని  ప్రకటించారు.

పునరుత్పాదక ఇంధన తరలింపు
లద్దాఖ్ నుంచి 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించడం, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం అంతర్రాష్ట్ర ట్రాన్స్ మిషన్ వ్యవస్థను రూ.20,700 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.దీనిలో కేంద్ర ప్రభుత్వం 8,300 కోట్ల రూపాయలను సమకూర్చుతుంది. 
గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్
కంపెనీలు, వ్యక్తులు, స్థానిక సంస్థలు పర్యావరణపరంగా సుస్థిరమైన , ప్రతిస్పందించే చర్యలను అమలు చేసి  ప్రవర్తనా మార్పులు  ప్రోత్సహించడానికి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద  గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తామని  ఆర్థిక మంత్రి అన్నారు. "పర్యావరణహిత కార్యకలాపాల కోసం అదనపు వనరులను సమీకరించడానికి ఇది సహాయపడుతుంది", అని ఆమె అన్నారు.
పీఎం-ప్రణామ్
ప్రత్యామ్నాయ ఎరువులు వాడకాన్ని ఎక్కువ చేయడానికి,   రసాయన ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహించడానికి "భూమాత పునరుద్ధరణ, అవగాహన, పోషణ, మెరుగుదల కోసం పీఎం-ప్రణామ్ పథకం   "అమలు జరుగుతుంది 
గోబర్ధన్ పథకం
వృత్తాకార ఆర్థిక వ్యవస్థను  ప్రోత్సహించడానికి గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్ ధన్) పథకం కింద 'వ్యర్థాల నుంచి సంపద సృష్టి' కోసం  500 కేంద్రాలను  ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.  వీటిలో పట్టణ ప్రాంతాల్లో 75 ప్లాంట్లు సహా 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు, మొత్తం రూ.10,000 కోట్ల పెట్టుబడితో 300 కమ్యూనిటీ లేదా క్లస్టర్ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి.

బ్లెండెడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ పై పన్నులు పెరగకుండా ఉండేందుకు అందులో ఉన్న జీఎస్టీ చెల్లింపు సీబీజీపై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించాలని ప్రతిపాదించారు.
సహజ, బయో గ్యాస్ ను మార్కెటింగ్ చేసే అన్ని సంస్థలకు 5 శాతం సీబీజీ నిబంధనను త్వరలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను ఆర్థిక మంత్రి ప్రకటించారు. బయో మాస్ సేకరణ, బయో ఎరువులు పంపిణీకి తగిన ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
భారతీయ ప్రకృతిక్ ఖేతి బయో ఇన్పుట్ రిసోర్స్ కేంద్రాలు 
వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు ప్రకృతి సేద్యాన్ని అవలంబించేలా  చూడడానికి  10,000 బయో ఇన్ పుట్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు జాతీయ స్థాయిలో సూక్ష్మ ఎరువులు, పురుగుమందుల తయారీ వ్యవస్థను  ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
మిష్టీ 
అడవుల పెంపకం లో భారతదేశం సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంజిఎన్ఆర్ఇజిఎస్, కాంపా ఫండ్, ఇతర వనరుల మధ్య సమన్వయం సాధించి  తీరప్రాంతం వెంబడి సాధ్యమైన చోట ఉప్పు సాగు అవుతున్న  భూములలో మడ అడవుల పెంపకం కోసం 'మాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హాబీటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్ కం పథకం ( మిష్టీ ) అమలు జరుగుతుంది అని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
అమృత్ ధరోహర్
చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడంలో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కువ చేయడానికి అమృత్ ధరోహర్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ప్రకటించారు. వచ్చే మూడు సంవత్సరాలలో అమలు జరిగే పథకం  చిత్తడి నేలల సద్వినియోగం చేసుకోవడానికి, జీవవైవిధ్యం, కర్బన ఉద్గారాల తగ్గింపు , ఎకో-టూరిజం అభివృద్ధి  స్థానిక ప్రజలకు ఆదాయం అందించే అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పథకం అమలు జరుగుతుంది.  

 

***


(Release ID: 1895596) Visitor Counter : 480