ఆర్థిక మంత్రిత్వ శాఖ
గత ఆరేళ్ళగా 4.7శాతం వార్షిక వృద్ధి రేటుతో ఉత్సాహంగా ఉన్న వ్యవసాయ రంగం
మునుపెన్నడూ లేని విధంగా 2021-22లో యుఎస్‌డి 50.2 బిలియన్లను చేరుకున్న వ్యవసాయ ఎగుమతులు
ఈ రంగాన్ని ప్రోత్సహించడంలో కీలక అంశాలుగా నిలిచిన పెరుగుతున్న ఎంఎస్‌పి, వ్యసాయ రుణం, ఆదాయ మద్దతు పథకాలు, వ్యవసాయ బీమా
Posted On:
31 JAN 2023 1:21PM by PIB Hyderabad
గత ఆరేళ్ళలో వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధిని 4.6శాతంతో బలమైన వృద్ధిని సాధిస్తోంది. ఇది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల రంగం దేశ యావత్ అభివృద్ధి, ఆహార భద్రతకి చెప్పుకోదగిన స్థాయిలో దోహదం చేసేందుకు తోడ్పడిందని మంగళవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే 2022-23 పేర్కొంది. అంతేకాకుండా, ఇటీవలి సంవత్సరాలలో దేశం వ్యవసాయ ఉత్పత్తుల నికర ఎగుమతుదారుగా అవతరించింది. ఎగుమతులు 2021-22 సంవత్సరంలో రికార్డు స్థాయిలో యుఎస్$ 50.2 బిలియన్లను తాకాయి.
పంట, పశు ఉత్పాదకతను పెంచేందుకు, మద్దతు ధర (కనీస మద్దతు ధర) ద్వారా రైతులకు ఖచ్చితమైన ప్రయోజనాలు లేదా రాబడిని నిర్ధారించడానికి, పంట వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, రుణ సౌలభ్యతను పెంచడం, యాంత్రీకరణను సులభతరం చేయడం, తోటల పెంపకం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం పై దృష్టి పెట్టడం అన్నవి ఈ రంగంలో వృద్ధికి, ఉత్సాహానికి కారణంగా సర్వే ఆపాదించింది. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడంపై కమిటీ సూచనలకు అనుగుణంగానే ఈ చొరవలు ఉన్నాయని సర్వే పేర్కొంది.
ఉత్పత్తి వ్యయంపై రాబడిని నిర్ధారించడానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)
మొత్తం 22 ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటలకు 2018-19వ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఎంఎస్‌పిని అఖిలభారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే 50శాతం మార్జిన్‌తో పెంచుతోందని సర్వే పేర్కొంది. మారుతున్న ఆహార పద్ధతులకు అనుగుణంగాను, స్వయం సమృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు పప్పు ధాన్యాలు, నూనె గింజలకు సాపేక్షంగా అధి ఎంఎస్‌పి ఇవ్వడం జరిగింది.
వ్యవసాయ రుణాల మెరుగైన అందుబాటు
ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి రూ. 18.5 లక్షల కోట్లను వ్యవసాయ రుణాలను అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ప్రభుత్వం నిలకడగా ఈ లక్ష్యాన్ని ప్రతి ఏడాదీ పెంచుతూ రావడమే కాక గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాదికీ నిర్దేశించిన లక్ష్యాన్ని నిరంతరం అధిగమించగలిగింది. 2021-22లో ఇది నిర్దేశించిన లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్ల కన్నా 13 శాతం ఎక్కువ సాధించింది.
రైతులకు పోటీ వడ్డీ రేట్లను ఇబ్బంది లేకుండా రుణ లభ్యతను ఖరారు చేసేందుకు - ఏ సమయంలోనైనా రుణాన్ని అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకం, రాయితీ వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాన్ని అందించే సవరించిన వడ్డీ రాయితీ పథకం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందించడం వల్ల ఇది సాధ్యమైందని సర్వే సూచించింది.
రూ. 4,51,672 కోట్ల కెసిసి పరిమితితో అర్హులైన 3.89 కోట్ల మంది రైతులకు డిసెంబర్ 2022న కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేయడం జరిగింది. భారత ప్రభుత్వం 2018-19లో కెసిసి సౌకర్యాన్ని మత్స్య, పశుసంవర్ధ రైతులకు కూడా విస్తరించడంతో, ప్రస్తుతం 1`.0 లక్షలమంది (17 అక్టోబర్ 2022 నాటికి) కెసిసిలను మత్స్య రంగానికి మంజూరు చేయగా, 9.5 లక్షలను (4 నవంబర్ 2022 నాటికి) పశుసంవర్థక రంగానికి మంజూరు చేయడం జరిగింది.
ఆదాయం, విపత్తులో మద్దతు
ఏప్రిల్ -జులై 2022-23లో పిఎం కిసాన్ ఆవృత్తం కింద ప్రభుత్వం నుంచి 11.3 కోట్ల మంది రైతులు ఆర్ధిక లేదా ఆదాయ మద్దతును పొందినట్టు సర్వే పట్టి చూపింది. గత మూడేళ్ళలో ఈ పథకం రూ. 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువ విలువైన మద్దతును నిరుపేద రైతులకు అందించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసిఎఆర్), ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఎఫ్‌పిఆర్ఐ)లు చేపట్టిన ఎంపిరికల్ స్టడీ (అనుభవేద్య అధ్యయనం) ఈ పథకం రైతులు వ్యవసాయ ఇన్‌పుట్లు కొనుగోలు చేయడంలో ఎదుర్కొననే విత్త సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడడమే కాక, ప్రత్యేకంగా, చిన్న, సన్నకారు రైతులు తమ రోజువారీ వినియోగం, విద్య, ఆరోగ్యం, ఇతర యాధృచ్ఛిక ఖర్చులను తీర్చేందుకు తోడ్పడింది.
రైతాంగ నమోదులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏడాదికి సగటున 5.5 కోట్ల దరఖాస్తులతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం కావడమే కాక,అందుకున్న ప్రీమియం పరంగా, మూడవ అతిపెద్దదని సర్వే పేర్కొంది.
దాని ఆరేళ్ళ అమలు కాలంలో, రైతులు రూ. 25,186 కోట్ల ప్రీమియంను కట్టగా, రూ. 1.2 లక్షల కోట్ల (31 అక్టోబర్ 2022నాటికి) క్లెయిములను అందుకున్నారు. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించినప్పటి నుంచీ రుణాలు పొందని సన్నకారు, చిన్నరైతుల వాటా 282శాతం పెరిగిందనే వాస్తవాన్ని బట్టి రైతుల్లో ఈ పథకం ఆమోదయోగ్యతను నిర్ధారించవచ్చని సర్వే పేర్కొంది.
వ్యవసాయ యాంత్రీకరణ - ఉత్పాదకతను స్థాపించేందుకు కీలకం
కుటుంబ యాజమాన్యంలో వ్యవసాయ కమతాల సగటు పరిమాణం తగ్గు ముఖం పట్టడంతో, చిన్న వ్యవసాయ కమతాల ఉత్పాదకతను పెంచేందుకు ఆచరణీయమైన, సమర్ధవంతమైన యంత్రాలు కీలకమని సర్వే సూచించింది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ (ఎస్ఎంఎఎం - వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్ ) కింద 21,628 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 467 హైటెక్ హబ్‌లు, 18305 వ్యవసాయ యంత్రాల బ్యాంకులను డిసెంబర్ 2022 నాటికి స్థాపించడంతో పాటుగా, వ్యవసాయ యంత్రాల ఉపయోగంలో శిక్షణ, ప్రదర్శనల ద్వారా రాష్ట్రప్రభుత్వాలకు తోడ్పాటునందించారు. వ్యవసాయ యాంత్రీకరణంగా సాగు ఖర్చును తగ్గించడమే కాక వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన చాకిరీని తగ్గిస్తుందని సర్వే పేర్కొంది.
సేంద్రీయ & సహజ వ్యవసాయం
భారతదేశంలో 2021-22 నాటికి ప్రపంచంలో అతిఎక్కువ సంఖ్యలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న 44.3 లక్షలతో రైతులు ఉండటమే కాక 59.1 లక్షల హెక్టార్ల భూమిని సేంద్రీయ వ్యవసాయం కిందకి తీసుకురావడం జరిగిందని సర్వే తెలిపింది. సేంద్రీయ, సహజ వ్యవసాయం రసాయనాలు, పురుగుమందులు లేని ఆహార ధాన్యాలను పంటలను అందించడమే కాక మట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.
ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పికెవివై), మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ (ఎంఒవిసిడిఎన్ఇఆర్) అన్న రెండు అంకితమైన పథకాల ద్వారాను, క్లస్టర్ & ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల ఏర్పాటు ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. పికెవివై కింద మొత్తం 6.4 లక్షల హెక్టార్ల భూమి,16.1 లక్షమంది రైతులతో 32,384 క్లస్టర్లు నవంబర్ 2022నాటికి కవర్ చేయడం జరిగింది. అలాగే, ఎంఒవిసిడిఎన్ఇఆర్ కింద 1.5 లక్షల రైతులు, 1.7 లక్షల హెక్టార్ల భూమితో ఈశాన్య ప్రాంతంలో సముచిత పంటలలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 177 ఎఫ్‌పిఒలు/ ఎఫ్‌పిసిలను సృష్టించడం జరిగింది.
జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ (జెడ్‌బిఎన్ఎఫ్) సహా అన్ని రకాలైన సంప్రదాయ/ పర్యావరణ వ్యవసాయ పద్ధతులు అనుసరించే రైతులకు సాయపడటం కోసం భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి (బిపికెపి) కింద, ఎనిమిది రాష్ట్రాలలో 4.09 లక్షల హెక్టార్ల భూమిని సహజ వ్యవసాయం కిందకు తీసుకువచ్చారు.
***
(Release ID: 1895046)
Visitor Counter : 506