సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రజాపయోగ కార్యక్రమాలు ప్రసారం చేసే అంశంపై మార్గదర్శకాలు విడుదల చేసిన సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ
Posted On:
30 JAN 2023 5:45PM by PIB Hyderabad
“భారతదేశంలో టెలివిజన్ ఛానెల్‌ల అప్‌లింకింగ్, డౌన్‌లింక్ కోసం మార్గదర్శకాలు, 2022”ని సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇతర కార్యక్రమాలతో పాటు ప్రైవేట్ ప్రసార సంస్థలు ప్రతిరోజూ 30 నిమిషాల పాటు ప్రజాపయోగ కార్యక్రమాలు ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్ బ్రాడ్‌కాస్టర్‌లు,సంఘాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. చర్చలు, సంప్రదింపులు ద్వారా అందించిన సలహా, సూచనల మేరకు మంత్రిత్వ శాఖ 30.01.2023న “సలహా” జారీ విడుదల చేసింది.
ప్రసారం చేసిన కార్యక్రమాల్లో పొందుపరిచిన అంశాలను పరిశీలించి ప్రజాపయోగ కార్యక్రమాలుగా నిర్ధారణ చేస్తామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజాపయోగ కార్యక్రమాల నిడివి ఏకకాలంలో 30 నిమిషాలు ఉండాల్సిన అవసరం లేదని , వీటిని చిన్న సమయ స్లాట్‌లలో విస్తరించవచ్చని పేర్కొన్న మంత్రిత్వ శాఖ కార్యక్రమాల వివరాలను బ్రాడ్‌కాస్టర్ ఆన్‌లైన్‌లో ప్రసార సంస్థ నెలవారీ నివేదికను సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. జాతీయ ప్రాముఖ్యత, సామాజిక ఔచిత్యంతో కూడిన అంశాల ఆధారంగా కార్యక్రమాలను రూపొందించాల్సి ఉంటుంది.
విద్య ,అక్షరాస్యత వ్యాప్తి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి,ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,శాస్త్ర సాంకేతిక అంశాలు, మహిళా సంక్షేమం,బలహీన వర్గాల సంక్షేమం, పర్యావరణం,సాంస్కృతిక వారసత్వం రక్షణ,జాతీయ సమైక్యత అంశాల ఆధారంగా కార్యక్రమాలను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తుంది.
ప్రజాపయోగ కార్యక్రమాలు ప్రసారం చేసే అంశంపై ప్రైవేటు శాటిలైట్ టీవీ చానళ్ళు స్వచ్చందంగా మార్గదర్శకాలు పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
“సలహా” కాపీ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్
https://mib.gov.in/sites/ default/files/Advisory%20on% 20Obligation%20of%20PSB_1.pdf
మరియు బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్
https://new.broadcastseva.gov. in/digigov-portal-web-app/ Upload?flag=iframeAttachView& attachId=140703942&whatsnew= true లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1894790)
Visitor Counter : 165