మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రేపు జరుగనున్న 31వ జాతీయ మహిళా కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకునేందుకు రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్‌సిడబ్ల్యు; సశక్త నారీ సశక్త భారత్ అన్నది కార్యక్రమ ఇతివృత్తం
Posted On:
30 JAN 2023 11:11AM by PIB Hyderabad
జాతీయ మహిళా కమిషన్ 31వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 31 జనవరి, 2023, అంటే మంగళవారం రోజున గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తమ తమ రంగాలలో అత్యద్భుతంగా రాణించి, తమదైన ముద్రవేసేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్న మహిళలను, వారిని కథనాలను గుర్తించి, వేడుకగా జరుపుకునే లక్ష్యంతో సశక్త నారి, సశక్త భారత్ అన్నది ఈ కార్యక్రమ ఇతివృత్తంగా ఎంచుకున్నారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయమంత్రి శ్రీ డాక్టర్ ముజపడా మహేంద్రభాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
జాతీయ కమిషన్లు, రాష్ట్ర మహిళా కమిషన్లు, ఎంబసీలు, న్యాయశాఖకు చెందిన ప్రముఖులు, మహిళా శిశుసంక్షేమాభివృద్ధి విభాగాలు, ఎమ్మెల్యేలు, విశ్వవిద్యాలయాలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు, పోలీసు విభాగం నుంచి సీనియర్ అధికారులు, మిలటరీ, పారా మిలటరీ అధికారులు, జాతీయ, రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికరణ సంస్థలు, ఎన్‌సిడబ్ల్యు సలహా మండలి సభ్యులు, కమిషన్ మాజీ చైర్‌పర్సన్లు, సభ్యులు, ఎన్జీవోలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.
తమ 31వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకునేందుకు కమిషన్ 31 జనవరి,2023 నుంచి 1 ఫిబ్రవరి, 2023 వరకు రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండవ రోజు, అనేకమంది స్ఫూర్తి, సాధికారత బాటలో నడిపించిన అసాధారణ మహిళలతో ప్యానెల్ చర్చ జరుగనుంది. ఈ చర్చ ద్వారా, భిన్న సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన మహిళ నిర్ణయాధికారం, నాయకత్వ పాత్రలలో జెండర్ సమానత్వంపై దృష్టి సారిస్తూ విభిన్నమైన, వివిధ చర్చలతో కూడిన వేదికను అందించడం కమిషన్ లక్ష్యం.
ఎన్‌సిడబ్ల్యుని 1992 జనవరిలో జాతీయ మహిళా కమిషన్ చట్టం, 1990 కింద చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేశారు. దీనిని మహిళలకు గల రాజ్యాంగపరమైన, న్యాయ సంరక్షనలను సమీక్షించి, వాటి పరిష్కారానికి అవసరమయ్యే పరిష్కారాలను సూచించి, సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేసి, మహిళలను ప్రభావితం చేసే విధానపరమైన విషయాలపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు స్థాపించారు.
***
(Release ID: 1894699)
Visitor Counter : 247